ద్రోహి (1948 సినిమా)

1948 సినిమా

ద్రోహి ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో, ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం తదితరులు నటించిన 1948 నాటి తెలుగు చలనచిత్రం.

ద్రోహి
(1948 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్వీ ప్రసాద్
నిర్మాణం యార్లగడ్డ శివరామప్రసాద్,
కె.ఎస్.ప్రకాశరావు
కథ తాపీ ధర్మారావు
తారాగణం జి.వరలక్ష్మి,
లక్ష్మీరాజ్యం,
ఎల్వీ ప్రసాద్,
కె.ఎస్.ప్రకాశరావు,
కోన ప్రభాకరరావు,
రాళ్ళబండి కుటుంబరావు,
కస్తూరి శివరావు,
వెంకుమాంబ,
సురభి బాలసరస్వతి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం కె.జమునరాణి,
ఎం.ఎస్.రామారావు,
ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన తాపీ ధర్మారావు
సంభాషణలు తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం పి.శ్రీధర్
కళ టి.వి.ఎస్.శర్మ
నిర్మాణ సంస్థ స్వంతంత్ర ఫిల్మ్స్
నిడివి 179 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వివాదాలు మార్చు

సినిమా నిర్మాణ సమయంలోనే వివాదాలు చోటుచేసుకున్నాయి. సినిమా షూటింగ్ పూర్తికాగానే స్పాట్లోనే మేకప్ ఇంకా తీయకుండానే సినిమాలో నటించిన ఎస్.వరలక్ష్మికీ, లక్ష్మీకాంతానికి వివాదం చెలరేగింది. వరలక్ష్మి వాగ్వాదంలో లక్ష్మీకాంతాన్ని చెప్పుతో దాడిశారు. ఈ విషయం లక్ష్మీకాంతం ఫిర్యాదుమేరకు పోలీసు కేసు వరకూ వెళ్ళింది. చివరికి వారిద్దరి నడుమ రాజీకుదిరి కేసు సమసిపోయింది.[1]

పాటలు మార్చు

  1. పూవు జేరి పలు మారు తిరుగుచు - జి. వరలక్ష్మి, ఘంటసాల వెంకటేశ్వరరావు
  2. ఆలకించండి బాబు ఆదరించండి - సీత
  3. ఇదేనా నీ న్యాయము దేవా - ఎమ్. ఎస్. రామారావు
  4. ఎందుకీ బ్రతుకు ఆశలే ఎడారియే - సీత
  5. చక్కలిగింతలు లేవా చక్కని ఊహలు రావ - జి. వరలక్ష్మి
  6. మనోవాంఛలు ఈనాటి కూలిపోయె - జి. వరలక్ష్మి
  7. నేడే తీరెనా వాంఛ నేడే తీరేనే - జి. వరలక్ష్మి
  8. మా ప్రేమయే కదా సదా విలాసి - జి. వరలక్ష్మి, ఎమ్. ఎస్. రామారావు
  9. నవ్వనైనా నవ్వరాదే బుల్ బుల్ బుల్ నాతో మాటలైన - పిఠాపురం
  10. పదండిరా పదండిరా పదండిరా - పిఠాపురం, జి.వరలక్ష్మి
  11. ఓహో రోజా పూలారాజా ఆహా నీదే జన్మ పూచావే - కె. జమునారాణి
  12. చక్కరు కొట్టుకు వచ్చావా బలె టక్కరి పిల్లవె చినదానా - శివరావు, జి.వరలక్ష్మి
  13. తృణమో పణమో వెయ్యండి దీనుల బాధలు తీర్చండి - కె. జమునారాణి బృందం
  14. ధన్యవహో ధన్యవహో మాతా సీతా మరణించిననూ -
  15. నరులకు ప్రేమతో చేసిన సేవే నారాయణ సేవ -
  16. నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు నీ పానమే లేకున్న - జి. వరలక్ష్మి
  17. సరి సరి మాటల మూట సాలును తెల్చె జోలికి రాకోయి -

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. విలేకరి, మూర్తి (1 జూన్ 1948). "హిట్లర్ వరలక్ష్మి ప్రళయతాండవం". రూపవాణి. No. 4. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 24 July 2015.