టి. వి. యస్. శర్మ
(టి.వి.ఎస్.శర్మ నుండి దారిమార్పు చెందింది)
టి. వి. యస్. శర్మ సుప్రసిద్ధ కళా దర్శకుడు. ఇతడు 1909లో మూగచింతల అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు 1936లో వచ్చిన సతీతులసి అనే సినిమాకు మొదటి సారి కళాదర్శకత్వం వహించాడు. 1939లో విడుదలైన మైరావణ ఇతని పనితనానికి ఒక గీటురాయి. ఆ చిత్రంలో పాతాళ లోక సృష్టి అందరినీ మెప్పించింది. సత్యభామ సినిమాలో నారద పాత్ర ఆహార్యం, నర్తనశాలలో "బృహన్నల" రూప సృష్టి , శ్రీకృష్ణపాండవీయం సినిమాలో దుర్యోధనుని రూపకల్పన ఇతని ప్రతిభకు తార్కాణాలు. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నర్తనశాల చిత్రంలో కళాదర్శకత్వానికి ఇతని ఉత్తమ కళాదర్శక పురస్కారం లభించింది. ఇతడు 1970, డిసెంబరు 7వ తేదీన మరణించాడు.[1]
టి. వి. యస్. శర్మ | |
---|---|
జననం | 1909 |
మరణం | 1970 డిసెంబరు 7 | (వయసు 61)
క్రియాశీల సంవత్సరాలు | 1939-1970 |
ఇతడు కళాదర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చలనచిత్రాలు
మార్చు- 1939 : సతీ తులసి
- 1939 : మళ్ళీ పెళ్ళి
- 1940 : మైరావణ
- 1942 : సత్యభామ
- 1950 : సంసారం
- 1952 : ఆడ బ్రతుకు
- 1957 : భాగ్యరేఖ
- 1959 : శ్రీ కృష్ణ లీలలు
- 1961 : సీతారామ కళ్యాణం
- 1963 : నర్తనశాల
- 1963 : లవకుశ
- 1966 : శకుంతల
- 1966 : శ్రీకృష్ణ పాండవీయం
- 1967 : రహస్యం
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 January 1971). "కళాదర్శకుడు టి.వి.యస్.శర్మ మృతి". విజయచిత్ర. 5 (7): 41.