తాపీ ధర్మారావు

భారతీయ రచయిత

తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 - మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.[1]

తాపీ ధర్మారావు నాయుడు
Tapi Dharmarao.jpg
తాపీ ధర్మారావు నాయుడు
జననంతాపీ ధర్మారావు నాయుడు
1887 , సెప్టెంబర్ 19
ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు
మరణం1973 మే 8
ఇతర పేర్లుతాతాజీ
వృత్తికల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు
ప్రసిద్ధితెలుగు రచయిత
తెలుగు భాషా పండితుడు
హేతువాది
నాస్తికుడు
మతంలేదు
పిల్లలుకుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
తండ్రిడాక్టర్ అప్పన్న
తల్లినరసమ్మ
Notes
తాపీ ధర్మారావు నాయుడు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”

జీవిత చరిత్రసవరించు

ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.[1] ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.

జీవితంలో ముఖ్య ఘట్టాలు[2]సవరించు

1887 - సెప్టెంబర్ 19 జననం - గంజాం జిల్లా, బరంపురం
1903 - మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 - మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత - విజయ నగరం
1904 - గురజాడను సుదూరంగా దర్శించడం
1904 - ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి

సినిమా జీవితంసవరించు

విశేషాలుసవరించు

 • ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
 • ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
 • 'మాలపిల్ల' (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.
 • తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.

రచనలుసవరించు

 1. ఆంధ్రులకొక మనవి
 2. దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
 3. పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
 4. ఇనుపకచ్చడాలు
 5. సాహిత్య మొర్మొరాలు
 6. రాలూ రప్పలూ
 7. మబ్బు తెరలు
 8. పాతపాళీ
 9. కొత్తపాళీ
 10. ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
 11. విజయవిలాసం వ్యాఖ్య
 12. అక్షరశారద ప్రశంస
 13. హృదయోల్లాసము
 14. భావప్రకాశిక
 15. నల్లిపై కారుణ్యము
 16. విలాసార్జునీయము
 17. ఘంటాన్యాయము
 18. అనా కెరినీనా
 19. ద్యోయానము
 20. భిక్షాపాత్రము
 21. ఆంధ్ర తేజము
 22. తప్తాశ్రుకణము

పురస్కారములుసవరించు

 • శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
 • చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
 • మరెన్నో సాహిత్య పురస్కారములు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 ప్రజాశక్తి (19 September 2015). "జన మాధ్యమాలలో తెలుగు వినియోగం". www.prajasakti.com. Archived from the original on 23 September 2015. Retrieved 19 September 2019.
 2. ఏటుకూరి, ప్రసాద్. తాపీ ధర్మారావు జీవితం-రచనలు. |access-date= requires |url= (help)

వనరులుసవరించు