ద్వారం మనోరమ

ద్వారం మనోరమ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె సికింద్రాబాదు, హైదరాబాదు కళాశాలలలో పిన్సిపాల్‌గా ఉద్యోగం చేసి[1] మంచి ఖ్యాతి సంపాదించి తదుపరి అనేక మందికి విద్యాదానం చేసారు.

జీవిత విశేషాలుసవరించు

ఈమె ప్రసిద్ధ వాయులీన విద్వాంసుడూ ద్వారం వెంకటస్వామినాయుడు మనుమరాలు. ఆమె ప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు ద్వారం నరసింగరావు నాయుడు, హేమలత దంపతులకు జన్మించింది. ఆమె తన తాతయ్య ద్వారం వెంకటకృష్ణ నాయుడు వద్ద సంగీత శిక్షణ పొందారు. ఈమె సహోదరులలో ద్వారం దుర్గా ప్రసాదరావు విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసి పదవీవిరమణ చేసారు. రెండవ సోదరుడు ద్వారం సత్యనారాయణ రావు కూడా కర్ణాటక సంగీతకారుడు.[2] ఈమె మృదుభాషిణి. అతి మృదు వాయులీన విదుషీమణి. చక్కగా పాట కూడా పాడుతుంది. అనేక మంది మహా విద్వాంసులకు అలవోకగా సునాయాసంగా హాయిగా తీయగా అనుకూలంగా ప్రక్క వాద్యం వాయించినది. సోలో శైలి, గాత్ర శైలులలో కూడా మేటి ధీమణి. సునాదం, గంభీర నాదం, సంప్రదాయ శైలి తన సొమ్ము. ఈమె భర్త "పూసర్ల రమణబాబు".[3] ఆమె 2007లో ఆమె తండ్రి ద్వారం నరసింగరావు గారి జన్మదినం సందర్భంగా విశాఖపట్నలో కచేరీ ఇచ్చారు.[1]

ఆమె తన 8వ యేట నుండి 45 యేండ్ల అపటు సోలో వాయులీన కచేరిలలొ పాల్గొంటూ మేటి సంగీతకారులుగా చరిత్రలో నిలిచారు. ఆమె ఆంధ్ర విస్వవిద్యాలయం లో సంగీతంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆమె ఆలిండియా రేడియో, దూరదర్శన్ లలొ "ఎ" గ్రేడు వాయులీన విద్వాంసులుగా పనిచేసారు. ఆమె విజయనగరం, సికింద్రాబాదుల లోని సంగిత నృత్య కళాశాలలలో వాయులీన ప్రక్రియలో అసిస్టెంట్ అధ్యాపకులుగా పనిచేసారు. తదుపరి సికింద్రాబాదులోని ఎస్.బి.ఆర్. ప్రభుత్వ కళాశాల (సంగీత, నృత్యం) లో అధ్యాపకులుగా పనిచేసారు. వరంగల్, మంథని సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసారు. హైదరాబాదులోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీ విరమణ చేసారు.

బిరుదులుసవరించు

  • వాయులీన సుధానిథి
  • నాద బాధీరథ

పురస్కారాలుసవరించు

ఆమె 1965లో భారత రాష్ట్రపతి నుండి ఆల్ ఇండియా రేడియోలో ఉత్తమ వాయులీన ఆర్టిస్టు గా పురస్కారాన్ని పొందారు. 1996 లో హైదరబాదులో నేషనల్ పీస్ అండ్ సోలిడారిటీ కౌన్సిల్ నుండి "భారత మహాన్" పురస్కారాన్ని పొందారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Knowledgeable exposition". A.R.S. The Hindu. 14 December 2007. Retrieved 8 May 2016.
  2. "In the name of the legend". P. SURYA RAO. The Hindu. 14 November 2008. Retrieved 8 May 2016.
  3. "సద్గురువులు శ్రీ ద్వారం నరసింగరావు గారు - శిష్యుడు నూకల చిన్న సత్యనారాయణ". Archived from the original on 2017-02-28. Retrieved 2016-05-08.

ఇతర లింకులుసవరించు