ద్వారం వెంకటస్వామి నాయుడు

సంగీత విద్వాంసుడు
(ద్వారం వెంకటస్వామినాయుడు నుండి దారిమార్పు చెందింది)

ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 నవంబరు 8 - 1964 నవంబరు 25) వయొలిన్ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941 లో ఇతనికి సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ పురస్కారం అందించింది.

ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు
జన్మ నామంద్వారం వెంకటస్వామి నాయుడు
జననం (1893-11-08)1893 నవంబరు 8
India బెంగళూరు, భారతదేశం
మరణం నవంబరు 25, 1964

వెంకటస్వామి నాయుడు బెంగళూరులో దీపావళివాడు జన్మించాడు. ఆయన తండ్రి వెంకటరాయుడు సైనక దళంలో కమీషన్డ్ ఆఫీసరుగా పనిచేసారు.[1]విశాఖపట్నంలో పెరిగాడు. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా నియమితుడయ్యాడు. 1936 లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.

వయొలిన్ వాయిద్యం ఒంటరి కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇవ్వడం ఇతనే ఆరంభించాడు. మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాల ఆడటోరియంలో ఇతని కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఇతని వయొలీన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నారు ఇంటిలో విని ఎంతో ప్రశంసించాడు.

ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి. కర్ణాటక సంగీతం వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ఇతనే కావచ్చును. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశాడు. "తంబూరా విశిష్ట లక్షణాలు" అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం "వివిపించే తపస్సు" అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఇతను శిష్యులకు చెప్పేవాడు. - ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి - అని చెప్పేవాడు.

చెన్నైలో "శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" లను స్థాపించారు. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలను ప్రతిష్ఠించారు.

పురస్కారాలు

మార్చు
దస్త్రం:Dwaram Venkata Swami Naidu.jpg
ద్వారం వేంకటస్వామి నాయుడు చిత్రపటం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. A titan among violin wizards
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-16. Retrieved 2020-01-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. http://www.india.gov.in/myindia/images/ps_awards.pdf

బయటి లింకులు

మార్చు