ద్విభాష్యం రాజేశ్వరరావు

ద్విభాష్యం రాజేశ్వరరావు కథా, నవలా రచయిత.[1]

ద్విభాష్యం రాజేశ్వరరావు
ద్విభాష్యం రాజేశ్వరరావు
జననంద్విభాష్యం రాజేశ్వరరావు
1945
యలమంచిలి
నివాస ప్రాంతంవిశాఖపట్నం
సంస్థకోరమాండల్ ఫర్టిలైజర్స్
ప్రసిద్ధితెలుగు కథా రచయిత, నవలా రచయిత
పదవి పేరుడిప్యుటీ మేనేజర్

జననం మార్చు

ఇతడు విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో 1945లో జన్మించాడు.

విద్యాభ్యాసం మార్చు

ఇతడు హైస్కూలు చదువు వరకు యలమంచిలిలోను, ప్రి యూనివర్సిటి అనకాపల్లిలోను చదివాడు. విశాఖపట్నంలో మెకానికల్ ఇంజనీరింగులో డిప్లొమా చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో బి.ఎ. పట్టా పొందాడు. ఎన్విరాల్‌మెంటల్ స్టడీస్‌లో పి.జి.డిప్లొమా చదివాడు.

ఉద్యోగం మార్చు

ఇతడు మొదట హైదరాబాద్ లోని ఆల్విన్ మెటల్ వర్క్స్‌లో అప్రెంటీస్‌గా చేరాడు. తర్వాత నాగార్జునసాగర్ కెనాల్స్‌లో ఓవర్‌సీర్‌గా పనిచేశాడు. కొంతకాలం విజయవాడలో ఆంధ్రప్రభ విలేఖరిగా ఉన్నాడు. 1967లో కోరమాండల్ ఫర్టిలైజర్స్‌లో ట్రైనీగా చేరి అదే సంస్థలో 2003లో డెప్యుటీ మేనేజర్‌గా పదవీ విరమణ చేశాడు.

రచనలు మార్చు

ఇతడు 400కు పైగా కథలు, 14 నవలలు, కొన్ని నాటికలు, నాటకాలు రచించాడు. ఆకాశవాణి ద్వారా 125కు పైగా ప్రసంగాలు, రూపకాలు, నాటికలు, నాటకాలు, కథలు ప్రసారం చేశాడు. ఇతని రచనలు బాల, కథాంజలి, రూపవాణి, చిత్రగుప్త, జాగృతి, ప్రజామత, ఆంధ్రజనత, కృష్ణాపత్రిక, కానుక, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, పల్లకి, స్వాతి, విజయ, చిత్ర, నవ్య, నీలిమ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు కన్నడ, తమిళ, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతని రచనలపై ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మూడు పరిశోధనలు జరిగాయి.

రచనల జాబితా మార్చు

నవలలు మార్చు

 1. ఏ వెలుగులకు ప్రస్థానం
 2. జీవనయాత్ర
 3. గతి తప్పిన కోరిక
 4. రష్యాలో రెండో కృష్ణుడు

కథాసంపుటలు మార్చు

 1. నీలిమంట
 2. శిథిల శిల్పం
 3. చిన్నారి రాయబారి
 4. బ్లాక్ మెయిల్
 5. దేవుడే రక్షించాలి
 6. చెట్టంత మనిషి
 7. తెల్లవారిన రాత్రి
 8. మనోరథం

కథలు మార్చు

ఇతడు వ్రాసిన కథలలో కొన్ని:[2]

 1. అంతరాలు
 2. అందరూ బతకాలి
 3. అద్దం
 4. అపస్వరాలు
 5. అప్రణిహితాం
 6. అమృతహస్తం
 7. అమ్మ
 8. అమ్మకానికో ఇల్లు
 9. అవసరానికో ఆప్తుడు
 10. అవినీతి కథ
 11. అసలు సమస్య
 12. ఆకాశపల్లకి
 13. ఆడచీమ
 14. ఆస్తి
 15. ఈ దేశంలో ఓ సగటుకథ
 16. ఉద్గ్రంథం
 17. ఉన్నత శిఖరం
 18. ఎన్నిక
 19. ఓ సగటు కథ
 20. కిటికీ
 21. కెటలిస్ట్
 22. క్షమయాదరిత్రీ
 23. గజం నిజం-పలాయనం మిధ్య
 24. గడువు
 25. గడ్డిపూలు...
 26. గాజుముక్కలు
 27. గిల్టీ
 28. గెలుపు
 29. చరమగీతం
 30. చిన్నతల్లి కాకా హోటేలు లేక్
 31. చిలకగోరింక
 32. చివరకు మిగిలింది
 33. చెట్టంత మనిషి
 34. జ్వాల
 35. తాచెడ్డకోతి
 36. తీరని సమస్య
 37. తెలిసినవాళ్లు
 38. తెల్లవారిన రాత్రి
 39. తొందరపాటు
 40. దేవుడికోపం లేక విధినిర్ణయం అను ఒకేఒకసూదిమందుకథ
 41. దొంగ
 42. నాపేరేమిటి?
 43. నివురు-నిప్పు
 44. నిశాకన్య
 45. నీకు తెలియని నిజం
 46. నీలిమంట
 47. నోరియాక్షన్
 48. పగలు కురిసిన వెన్నెల
 49. పదిరూపాయలు
 50. పుట్టలోని చెదలు
 51. ప్రకృతి కిరణం
 52. ప్రాణిహితం
 53. ప్రారబ్ధం భోగతోనశ్యేత్
 54. బొమ్మ
 55. భిన్నత్వంలో ఏకత్వం
 56. భూతం
 57. మగ మహారాజులు
 58. మనసులోని మరోమనిషి
 59. మనసులోని ముల్లు
 60. మనోరథం
 61. మరణించిన...
 62. మహాపురుష లక్షణం
 63. మానవత వికసించాలి!
 64. యెలిమెంటు
 65. రైలువెళ్లిపోయింది
 66. లాభం
 67. వర్షం
 68. వాన కురిసిన రాత్రి
 69. వాళ్లకీఉన్నాయి కష్టాలు
 70. విద్యా వివాహనాశాయ?
 71. విధి
 72. వినేనాధుడు
 73. విన్నపాలు
 74. విముక్తి
 75. వీనస్
 76. వెర్రి గొర్రెలు
 77. వ్యథ
 78. శిల
 79. శ్రమయేవ జయతే
 80. సంస్కారం
 81. సత్యాసత్యాలమద్య
 82. సీతాపతి కథ
 83. సృష్టి నిజం
 84. స్థానభ్రంశం
 85. స్నేహంకన్నా తీయనిది
 86. హద్దుల్లేని అనుభవం

నాటకాలు/నాటికలు మార్చు

 1. పులిస్వారి
 2. సావిత్రి సవాల్
 3. దీర్ఘాయుష్మాన్ భవ
 4. కలుపుమొక్కలు
 5. వట్టిమాటలు కట్టిపెట్టోయ్

పురస్కారాలు మార్చు

ఇతని కథలు వివిధ పోటీలలో ఎనిమిదిసార్లు బహుమతిని గెలుచుకున్నాయి. ఇతడు వ్రాసిన కథ "నీలిమంట"కు 1969 దీపావళి కథలపోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇతని నవల "ఏ వెలుగులకీ ప్రస్థానం"కు యువ పత్రిక నిర్వహించిన చక్రపాణి నవలల పోటీలో బహుమతి వచ్చింది. ఇంకా ఇతడు వ్రాసిన నాటకాలు, నాటికలు అనేక బహుమతులను గెలుచుకున్నాయి.

ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని:

 • ఎనుగంటి లక్ష్మీనరసింహారావు పురస్కారం - కిన్నెర సంస్థ వారిచే
 • గురజాడ అవార్డు - వేదగిరి కమ్యూనికేషన్స్ వారిచే
 • రాయనిపాటి లక్ష్మీకాంతారావు ఉత్తమ కథాపురస్కారం
 • గణపతిరాజు అచ్యుతరామరాజు స్మారక జీవన సాఫల్య పురస్కారం

మూలాలు మార్చు

 1. అడపా, రామకృష్ణ (1 May 2017). "రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావుతో సంభాషణ". సాహితీకిరణం మాసపత్రిక. 9 (3): 10–12.
 2. కాళీపట్నం, రామారావు. "కథానిలయంలో ద్విభాష్యం రాజేశ్వరరావు పేజీ". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 25 October 2017.