దర్శ గుప్తా
దర్శ గుప్తా భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చలనచిత్రాలు, టెలివిజన్ షోలలో నటిస్తుంది. స్టార్ విజయ్ ఛానెల్‌లో ప్రసారమైన కామెడీ రియాలిటీ టీవీ షో కుకు విత్ కోమాలి (సీజన్ 2)లో ఆమె నటనకు ప్రసిద్ధిచెందింది.[2] అంతేకాకుండా రుద్ర తాండవం, ఓ మై గోస్ట్, మెడికల్ మిరాకిల్ సినిమాలతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది.[3]
దర్శ గుప్తా | |
---|---|
జననం | దర్శ గుప్తా |
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | ధర్షు[1] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2017 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కుకు విత్ కోమాలి (సీజన్ 2) రుద్ర తాండవం (2021) ఓహ్ మై గోస్ట్ |
రిచర్డ్ రిషి కథానాయకుడుగా మోహన్ జి దర్శకత్వంవహించిన తమిళ చిత్రం రుద్ర తాండవం (2021)తో ఆమె అరంగేట్రం చేసింది. 2022లో నటి సన్నీలియోన్ నటించిన ఓహ్ మై ఘోస్ట్ చిత్రంలో కూడా ఆమె నటించింది.[4]
కెరీర్
మార్చుజీ తమిళ్‌లో ప్రసారమైన తమిళ టెలివిజన్ సీరియల్ ముల్లుమ్ మలరంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె రంజిత్‌తో పాటు స్టార్ విజయ్‌లో సెంథూర పూవేలో కూడా కీలక పాత్ర పోషించింది.[5] 2020లో, ఆమె కుకు విత్ కోమాలి (సీజన్ 2) అనే కామెడీ రియాలిటీ షోలో మెరిసింది.[6]
2021 సంవత్సరంలో, మోహన్ జి. తన దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రుద్ర తాండవంలో ఆమె వారాహి పాత్రలో కథానాయికగా నటించింది. ఇది తన తొలి చిత్రం.[7][8][9] ఆమె FAB AWARD ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ సంవత్సరపు ఉత్తమ తొలి నటిగా గెలుపొందింది.[10] ఆమె తర్వాత మెడికల్ మిరాకిల్ అనే మరో భారీ చిత్రంలో నటించింది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ఓహ్ మై ఘోస్ట్‌లో ఆమె కూడా నటించింది.[11]
భారతదేశంలో కోవిడ్-19 లాక్-డౌన్ సమయంలో. ఆమె 20000 మందికి పైగా ఆశ్రయం, ప్రాథమిక వైద్య అవసరాలను అందించింది. సమాజానికి చేసిన తన సేవకుగాను హార్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[12][13]
మూలాలు
మార్చు- ↑ "Pugazh wishes Darsha by calling new nickname". www.indiaglitz.com.
- ↑ "Dharsha Gupta clocks 2.1M followers on Instagram; celebrates with fans". The Times of India.
- ↑ "From Dharsha Gupta to Akshara Reddy: Fit and fab Tamil TV actresses who can inspire you to hit the gym". The Times of India.
- ↑ "#Rewind2020: Dharsha Gupta to Losliya Mariyanesan, Tamil TV celebs who announced their debut on the silver screen this year". The Times of India.
- ↑ "Here's how Dharsha Gupta is helping the needy during lockdown". The Times of India.
- ↑ "Dharsha Gupta to Ashwin Kumar Lakshmikanthan: Celebs who are basking in the success of Cooku with Comalis 2". The Times of India.
- ↑ "Dharsha Gupta completes dubbing for her debut film 'Rudrathandavam'". The Times of India.
- ↑ "Dharsha Gupta to debut as heroine in Draupathi director's next movie 'Rudhra Thandavam'". thenewscrunch.com.
- ↑ "Rudra Thandavam movie starring 'Cook with Comali' fame Dharsha Gupta to release soon". thenewscrunch.com.
- ↑ "Dharsha Gupta Winning the Best Debutante Actress Of The Year - FAB AWARDS". YouTube.
- ↑ "Teaser of Sunny Leone and Sathish's Oh My Ghost out". Cinema Express.
- ↑ "Dharsha Gupta's timely help to the poor people affected by COVID 19 lockdown wins hearts". www.indiaglitz.com.
- ↑ "actress Dharsha Gupta celebrates special milestone with fans". www.indiaglitz.com.