హాలీవుడ్ నీలిచిత్ర ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతినొంది, Jism 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ చిత్రసీమలోకి ప్రవేశించి వార్తల్లోకెక్కిన ప్రముఖ తార సన్నీలియోన్.

సన్నీ లియోన్

జీవితం

మార్చు

సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్ట పడేది. చిన్నతనం నుండి సన్నీలియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. పదకొండు ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ తొలి ముద్దును రుచిచూసింది [1]. పద్నాలుగేళ్ళ వయసులో నానమ్మ ఒత్తిడి వీరు కుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్ళారు. పదహారేళ్ళ వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు కన్యత్వాన్ని అర్పించిన సన్నీలియోన్ పద్దెనిమిదేళ్ళ వయసులో తాను బై సెక్సువల్ అను గుర్తించింది.

యుక్తవయసుకు వచ్చిన సన్నీలియోన్ మోడల్ గా ఎదగాలనుకుంది. 1999 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో వివస్త్రణ అవుతూ నాట్యం చేసే మరో యువతి పరిచయమైంది. తన ద్వార్ జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. అతని ద్వారా పురుషుల పత్రిక అయిన పెంట్ హౌస్ లో పనిచేసే 'జె అలెన్' ను ముఖాముఖి కలిసిన తర్వాత ఎడల్ట్ ఇండస్ట్రీ పై అపోహలు తొలగిపోయాయి. క్రమేణా చెరి, హై సొసైటి, స్వాంక్, లెగ్ వరల్డ్, హస్లర్, క్లబ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పత్రికల్లో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చింది. 2003 సంవత్సరానికి 'పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెల్చుకొంది. 2005 లో నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా ఎ.వి.యన్ అలల్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఇటీవల 2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ చిత్రం. ఈమె ఈ క్రింది ఇవ్వబడిన నీలి చిత్రాలలో నటించింది.

భారతీయ సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు Ref.
2012 జిస్మ్ 2 ఇజ్నా హిందీ హిందీ సినిమా రంగప్రవేశం
2013 జాక్‌పాట్ మాయ హిందీ
షూటౌట్ ఎట్ వాడాలా "లైలా" పాటలో ప్రత్యేక ప్రదర్శన హిందీ
2014 రాగిణి MMS 2 సన్నీ లియోన్ హిందీ
వడకూర ఆమెనే తమిళం తమిళ సినిమా అరంగేట్రం,

"లో ఆనా లైఫ్" పాటలో ప్రత్యేక పాత్ర

హేట్ స్టోరీ 2 హిందీ "పింక్ లిప్స్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
బల్వీందర్ సింగ్ ఫేమస్ హో గయా హిందీ "షేక్ దట్ బూటీ" పాటలో ప్రత్యేక ప్రదర్శన
కరెంట్ తీగ సన్నీ తెలుగు తెలుగు సినిమా అరంగేట్రం,

అతిధి పాత్ర

2015 DK ఆమెనే కన్నడ కన్నడ సినిమా అరంగేట్రం,

"సేసమ్మ" పాటలో ప్రత్యేక పాత్ర

ఏక్ పహేలీ లీలా లీల / మీరా హిందీ
కుచ్ కుచ్ లోచా హై శనాయ హిందీ
లవ్ యు అలియా ఆమెనే కన్నడ "కామాక్షి" పాటలో ప్రత్యేక పాత్ర
సింగ్ ఈజ్ బ్లింగ్ విమాన ప్రయాణీకుడు హిందీ అతిధి పాత్ర
2016 మస్తీజాదే లైలా లేలే / లిల్లీ లేలే హిందీ
వన్ నైట్ స్టాండ్ సెలీనా / అంబర్ కపూర్ హిందీ
బీమాన్ లవ్ సునైనా వర్మ హిందీ
ఫడ్డూ ఆమెనే హిందీ "తూ జరూరత్ నహీ తూ జరూరీ హై" పాటలో ప్రత్యేక ప్రదర్శన "
దొంగి కా రాజా హిందీ "చోలీ బ్లాక్‌బస్టర్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2017 రయీస్ హిందీ " లైలా మైన్ లైలా " పాటలో ప్రత్యేక ప్రదర్శన
నూర్ హిందీ అతిధి పాత్ర
బాద్షాహో హిందీ "పియా మోర్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
బాయ్జ్ మరాఠీ మరాఠీ సినిమా అరంగేట్రం, "కుత్ కుత్ జయచా హనీమూన్ లా" పాటలో ప్రత్యేక పాత్ర
భూమి హిందీ "ట్రిప్పీ ట్రిప్పీ" పాటలో ప్రత్యేక ప్రదర్శన
శ్రేష్ఠ బంగాలీ బెంగాలీ "చాప్ నిష్నా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
పిఎస్‌వి గరుడ వేగ తెలుగు "డియో డియో" పాటలో ప్రత్యేక ప్రదర్శన
తేరా ఇంతేజార్ రౌనక్ హిందీ
2019 ఝూతా కహిం కా ఆమెనే హిందీ "ఫంక్ లవ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
అర్జున్ పాటియాలా బేబీ నరులా హిందీ ఇన్‌సైడ్ ఫిల్మ్‌గా 2 పాత్రలు
మధుర రాజా ఆమెనే మలయాళం "మోహ ముందిరి" ఐటెం సాంగ్‌లో ప్రత్యేక పాత్ర
మోతీచూర్ చక్నాచూర్ హిందీ "బట్టియాన్ బుజాదో" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2022 జిన్నా రేణుక తెలుగు
ఛాంపియన్ ఆమెనే కన్నడ "డింగర్ బిల్లి" పాటలో ప్రత్యేక పాత్ర
ఓ మై ఘోస్ట్ మాయసేన తమిళం
2023 కెన్నెడీ చార్లీ హిందీ 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్
థీ ఇవాన్ తమిళం
2024 మృదు భావే ధృడా క్రుత్యే నర్తకి మలయాళం "ఫనా" పాటలో ప్రత్యేక పాత్ర
కొటేషన్ గ్యాంగ్ పార్ట్ 1 పద్మ తమిళం
మందిర తెలుగు
యుఐ కన్నడ
పెట్టా రాప్ TBA తమిళం
TBA రంగీలా TBA మలయాళం మలయాళ చిత్ర ప్రవేశం, చిత్రీకరణ
షెరో TBA మలయాళం చిత్రీకరణ
కోకా కోలా TBA హిందీ చిత్రీకరణ
హెలెన్ నైనా చిత్రీకరణ
భీమా కోరేగావ్ యుద్ధం TBA పాటలో ప్రత్యేక పాత్ర

భారతీయ చలన చిత్ర ప్రవేశం

మార్చు

సన్నీ లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన ప్రాత పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో ఈమె కూడా నటించింది. ఏక పహేలీ లీల, కుచ్ కుచ్ లోచా హై వంటి హిందీ సినిమాలు విడుదల అవ్వాల్సియున్నవి. ప్రస్తుతం కండోం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా తన విధులు నిర్వహిస్తూ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

వరించిన అవార్డులు

మార్చు
  • 2008 XBIZ Award – Web Babe of the Year 2011
  • 2010 AVN Award – Best All-Girl Group Sex Scene for the movie "Deviance"
  • 2010 AVN Award – Web Starlet of the Year
  • 2010 F.A.M.E. Award – Favorite Breasts
  • 2012 XBIZ Award — Porn Star Site of the Year (SunnyLeone.com)

మూలాలు

మార్చు
  1. సాక్షి - ఫన్ డే , 26 ఆదివారం - ఆగష్ణు 2012

బయటి లింకులు

మార్చు