ధరంపాల్
ధరంపాల్ (1922 - 2006) భారతదేశానికి చెందిన గాంధేయ వాది, స్వాతంత్ర సమర యోధుడు, చరిత్రకారుడు, తత్వవేత్త. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జన్మించాడు. అతను భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన ఎలా ఉందో తెలుసుకుంటూ దాదాపు 30 సంవత్సరాలు గడిపాడు. ఈ సమయంలో అతను సేకరించిన వాస్తవాలను డాక్యుమెంట్‌ల రూపంలో ముద్రించి పెట్టుకున్నాడు. ధరంపాల్ భారతదేశంలో సైన్స్ చరిత్ర, నాటి సమాజం, ప్రజల గురించి చాలా రచనలు చేశాడు.[1][2]
ధరంపాల్ | |
---|---|
జననం | ముజఫర్‌నగర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1922 ఫిబ్రవరి 19
మరణం | 2006 అక్టోబరు 24 | (వయసు 84)
జాతీయత | భారతీయుడు |
మతం | హిందూ |
పదవులు
మార్చు2001 లో, భారత ప్రభుత్వం ధరంపాల్ ను పశువుల జాతీయ కమిషన్ ఛైర్మన్ గా, రాష్ట్ర మంత్రిగా నియమించింది.
పూర్వ వలసరాజ్యపు భారతీయ విద్యావ్యవస్థపై అవగాహనను మార్చడంలో ధరంపాల్ కీలక పాత్ర పోషించాడు.[3][4]
రచనలు
మార్చుభారతదేశం వలస పాలనలో భారతీయ విద్య, వ్యవసాయం, సాంకేతికత, కళలపై ప్రభుత్వం డాక్యుమెంటేషన్ ఆధారంగా ధరంపాల్ ప్రాథమిక రచనలు రూపొందించాడు.
ఆయన రాసిన ప్రధాన పుస్తకాలు-[5]
- పద్దెనిమిదవ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ
- బ్యూటిఫుల్ ట్రీ
- భారతీయ మానస్త్వత్వ చిత్రణ,
- స్వధర్మ ఆఫ్ ఇండియా
- పౌర అవిధేయత, భారతీయ సంప్రదాయం
- భారతదేశ వైఖరి, అపకీర్తి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-07. Retrieved 2021-10-07.
- ↑ "Introducing Dharampal - Center For Indic Studies". 7 June 2020. Archived from the original on 7 June 2020.
- ↑ "The Beautiful Tree". www.goodreads.com.
- ↑ Kakkar, Ankur (19 February 2019). "Remembering Dharampal's Seminal Contribution".
- ↑ https://www.goodreads.com/book/show/22019037-understanding-gandhi%7Ctitle=Understandinghttps://timesofindia.indiatimes.com/india/National-commission-on-Cattle-to-be-set-up/articleshow_new/1136006699.cms%7Ctitle=National