[1]

భారతదేశ ఆవుల జాతులు

మార్చు

పాడి ఆవులు

మార్చు

సాహివాల్

దస్త్రం:Sahiwal breed cow.jpg
సాహివాల్ జాతి ఆవు.

గిర్

  • దక్షిణ కథిమవార్ ప్రాంతాలలోని గిర్ అడవులలో ఉంటుంది.
  • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 900 కిలోలు
  • – వాణిజ్య డైరీ ఫారంలో -1600 కిలోలు

తార్ పార్ కర్

  • జోద్ పూర్, కచ్, జైసల్మార్ ప్రాంతాలలో ఉంటుంది.
  • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 1600 కిలోలు
  • వాణిజ్య డైరీ ఫారంలో-2500 కిలోలు

ఎర్ర సింధి

కరణ్ ఫ్రీ
రాజస్థాన్కి చెందిన థర్పర్కర్ జాతి ఆవులను హోల్స్టీన్ ఫ్రీష్ ఆబోతులతో కృత్రిమ గర్భధారణ చేయించి కరణ్ ఫ్రీ జాతిని అభివృద్ధి చేశారు. థర్పర్కర్ జాతి ఆవుల పాల దిగుబడి సామాన్యంగానే ఉన్నప్పటికీ, ఇవి అధిక ఉష్ణోగ్రతను, తేమతో కూడిన వాతావరణాన్ని తట్టుకోగల శక్తిని కలిగి ఉండడం వలన ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ఈ జాతి లక్షణాలు

  • ఈ జాతి ఆవులు శరీరం మీద, నుదుటి మీద, తోక కుచ్చు మీద నలుపు తెలుపు మచ్చలు కలిగి ఉంటాయి. పొదుగు ముదురు రంగులో ఉండి చన్నుల మీద తెల్లటి మచ్చలుంటాయి. పాలిచ్చేనరాలు ఉబ్బి ఉంటాయి.
  • కోడె దూడల కన్నా పెయ్య దూడలు తొందరగా ఎదుగుదలకు వచ్చి 32 నుండి 34 నెలల వయసులోనే గర్భం దాలుస్తాయి.
  • గర్భధారణ అవధి సాధారణంగా 280 రోజులు ఉంటుంది. ప్రసవం జరిగిన 3 నుండి 4 నెలలలోపే తిరిగి గర్భం దాలుస్తాయి. అందువల్ల తిరిగి గర్భందాల్చడానికి 5 నుండి 6 నెలలు తీసుకునే స్థానిక జాతుల కన్నా మెరుగైనవి.
  • పాల దిగుబడి: కరణ్ ఫ్రీ జాతి ఆవులు సంవత్సరానికి 3,000 నుండి 3,400 లీటర్ల పాలు ఇస్తాయి. పరిశోధనా స్థానం వారి ఫారంలో ఈ జాతి ఆవుల పాల దిగుబడి 320 రోజుల కాలంలో 3,700 లీటర్లు కాగా వెన్న శాతం 4.2 ఉందని తెలిసింది.
  • సమతుల్యమైన సాంద్ర దాణా మిశ్రమం, పచ్చిమేత విరివిగా మేపినప్పుడు ఈ జాతి ఆవులు రోజుకి 15 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. పాలు బాగా వచ్చే సమయంలో (అంటే దూడ పుట్టిన 3 నుండి 4 నెలలకు) పాల దిగుబడి రోజుకు 25 నుండి 35 లీటర్ల వరకూ పెరగవచ్చు.
  • పాల దిగుబడి అధికంగా ఉన్నందున, బాగా పాలు ఇచ్చే ఆవులకు పొదుగు వాపు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది. పోషక లోపాలు కూడా తలెత్తవచ్చు. ముందుగా పసికట్టగలిగితే వీటిని నివారించుకోవచ్చు.
  • దూడ ఖరీదు: కొత్తగా ఈనిన ఆవు అది ఇచ్చే పాల దిగుబడిని బట్టి రూ. 20,000 నుండి 25,000 వరకూ ఉంటుంది.

సేద్యయోగ జాతులు

మార్చు

అమ్రిత మహల్

  • కర్ణాటకలో ఎక్కువగా లభిస్తుంది.
  • పొలం దున్నడానికి, రవాణాకు బాగా ఉపయోగపడుతుంది.

హల్లికార్

  • కర్ణాటకలోని తుమ్ కూర్, హసన్,, మైసూర్ జిల్లాలలో ఉంటుంది.

కంగాయమ్

పాడి, సేద్య యోగ జాతులు

మార్చు

ఒంగోలు

 
ఒంగోలు జాతి ఎద్దు.

హరియానా

  • హర్యానా లోని కర్నల్, హిస్సార్, గుర్ గావ్ జిల్లాలలో, పడమర మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో ఉంటుంది.
  • పాల దిగుబడి- 1140-4500 కిలోలు
  • ఎద్దులు రవాణాకి, పొలం దున్నడానికి అనువైనవి.

కాంక్రెజ్

 
కాంక్రెజ్ జాతి ఎద్దు.
  • గుజరాత్లో ఎక్కువగా ఉంటుంది.
  • పాల దిగుబడి - గ్రామీణ ప్రాంతాలలో- 1300 కిలోలు
  • వాణిజ్య సరళిలో- 3600 కిలోలు
  • ఈతకు వచ్చినవపుడు వయసు- 36 నుండి 42 నెలలు
  • ఈతకు, ఈతకు మధ్య సమయం -15 నుండి 16 నెలలు

డియోని

  • ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర, పడమర ప్రాంతాలలో ఉంటుంది
  • పాడి ఆవులు అధిక పాల దిగుబడికి, ఎద్దులు పొలం పనులకు అనువైనవి.

విదేశీ జాతులు

మార్చు

పాడి ఆవులు

మార్చు
 
జెర్సీ ఆవు.

జైర్సీ

  • మొదటి ఈతకు వయసు – 26 నుండి 30 నెలలు
  • ఈతకు, ఈతకు మధ్య సమయం 13 నుండి 14 నెలలు
  • పాల దిగుబడి - 5000 నుండి 8000 కిలోలు
  • డైరీ పాల దిగుబడి 20 లీటర్లు, కానీ సంకరజాతి జెర్సీ పాల దిగుబడి 8 నుండి 10 లీటర్లు ఒక రోజుకి.
  • భారతదేశంలో ఈ జాతి ఆవులు మనదేశ ఉష్ణ ప్రదేశాలకు బాగా అలవాటు పడ్డాయి
 
హౌలిస్టిన్ ఫ్రిజియన్ ఆవు.

హౌలిస్టిన్ ఫ్రిజియన్

  • ఈ జాతి ఆవు హాలాండ్ నుంచి దిగుమతి చేసుకోబడింది
  • పాల దిగుబడి 7200 నుండి 9000 కిలోలు
  • విదేశీ జాతులలో ఈ జాతి ఆవు పాల దిగుబడిలో అత్యంత శ్రేష్ఠమైనది
  • సగటున రోజుకు 25 లీటర్లు పాలు ఇస్తుంది, అదే సంకర పరచిన ఈ ఆవు సగటున 10 నుండి 15 లీటర్లు రోజుకు దిగుబడినిస్తుంది. కోస్తా ఆంధ్రా ప్రాంతాలకు బాగా అనువైనది.

గేదెల జాతులు

మార్చు

ముర్రా

  • హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలలో ఉంటుంది.
  • పాల దిగుబడి 1560 కిలోలు.
  • సగటున రోజుకు 8 నుండి 10 లీటర్లు పాలు ఇస్తుంది. సంకర పరచిన ముర్రా గేదె రోజుకు 6 నుండి 8 లీటర్లు ఇస్తుంది.
  • కోస్తా ప్రాంతాలలో, శీతోష్ణ ప్రదేశాలకు అనువైనది.

సుర్తీ

  • గుజరాత్ లో లభిస్తుంది
  • పాల దిగుబడి 1700 నుండి 2500 కిలోలు

జఫరాబాద్

  • గుజరాత్ లోని కతైవార్ ప్రాంతములో ఉంటుంది
  • పాల దిగుబడి 1800 నుండి 2700 కిలోలు

నాగపూర్

  • నాగపూర్, వార్దా, అకోలా, అమరావతీ ప్రాంతాలలో ఉంటుంది.
  • పాల దిగుబడి 1030 నుండి 1500 కిలోలు

పాడి పశువుల ఎంపికలో మెళకువలు

మార్చు

పాడి ఆవుల ఎంపిక
దూడలను, ఆవులను ప్రదర్శనలలో ఎంపిక చేసుకోవడం అనేది ఒక కళ. ఆవులను కొనేటప్పుడు, వాటి పాల ఉత్పత్తి, ఈత సమర్ధతను చూసి కొనాలి. బాగా సమర్ధవంతంగా నడిపిన ఫారం నుంచి, పశువుల నాణ్యతను, చరిత్రను తెలుసుకొని కొనాలి. కొనాలనుకునే ఆవు పాలదిగుబడిని మూడుపూటలా తూచి ప్రతిసారి సగటున ఎన్ని పాలిస్తున్నాయో లెక్కకట్టుకోవాలి. పాలు పితకడానికి ఎవరినైనా దగ్గరకి రానివ్వగలిగే ఆవుని మాత్రమే ఎన్నుకోవాలి. అక్టోబరు – నవంబరు మాసాలలో మాత్రమే కొనుగోలు చేయాలి. ఈనిన తొంబై రోజుల వరకు అధిక శాతం పాలను ఇవ్వాలి.

మంచి ఈత సామర్ధ్యం ఉన్న ఆవుల ఎంపిక
ఆవులు ఆరోగ్యంగా, చురుకుగా, ఆకర్షణీయంగా, ఆడ లక్షణాలతో నిండుగా ఉండాలి. మంచి శరీర సౌష్టవం కలిగి, శరీరము త్రికోణాకారముగా ఉండాలి. కాంతి వంతమైన కన్నులు కలిగి, మెడ సన్నముగా ఉండాలి. పొదుగు చక్కని సమతులము కలిగి, పెద్దదిగా, నిడివిగా ఉండి శరీరమునకు చక్కగా అంటిబెట్టుకొని ఉండాలి. పొదుగు క్రింద ఉండే పాలనరము పెద్దదిగా, ఉబ్బి వంకరటింకరగా ఉండాలి. చనుకట్లు ఒకే పరిమాణము కలిగి చతురస్రముగాను, సమదూరముగాను ఉండాలి.

వాణిజ్య సరళిలో నడిపే డైరీలను పాడి పశువుల ఎంపిక

మార్చు

భారతదేశ పరిస్ధితులలో ఒక్కొక్క డైరీ ఫారానికి కనీసం 20 పశువులు (10 ఆవులు, 10 గేదెలు) ఉండాలి. ఈ లెక్కన కొన్ని రోజులకు 50:50 లేదా 40 – 60 నిష్పత్తిలో కనీసం 100 పాడి పశువుల వరకు నడవచ్చు.మన దేశంలో చాలా మటుకు తక్కువ క్రొవ్వు కలిగిన పాలను మాత్రమే ఇష్టపడతారు ఒక డైరీలే కలబోసిన జాతులు, ఉంటే మంచిది ( సంకరపరచినవి, ఆవులు, గేదెలు ఒకే షెడ్లో వేరు వేరు వరుసలో ఉంచబడినవి) పాలు విక్రమించుకునే ముందు, మార్కెట్టును బాగా తెలుసుకోవాలి. అవసరాన్నిబట్టి ఆవు పాలు, గేదెపాలు కలపొచ్చు కానీ, హొటల్స్, వినియోగదారులు ( 30 శాతం మంది) ఎక్కువగా గేదె పాలను ఇష్టపడతారు. వైద్యశాలలు ఎక్కువగా ఆవు పాలను ఇష్టపడతారు.

ఆవుల ఎంపిక
మంచి నాణ్యత కలిగిన ఆవులు మార్కెట్ లో లభిస్తాయి. రోజుకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు 12,000 నుండి 15,000 వరకు ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధతో చూచిన ప్రతి ఆవు 13 నుండి14 నెలల వ్యత్యాసంలో ఒక్కొక్క దూడను ఈనుతుంది. ఆవు పాలలోని క్రొవ్వు శాతం 3 నుండి 5.5 వరకు ఉంటుంది. ఇది గేదె పాల కంటే తక్కువ.

గేదెల ఎంపిక
డైరీ ఫారంలకు బాగా అనువైన ముర్రా, మెహసనా జాతి గేదెలు మన దేశంలో బాగా అనువైనవి. క్రొవ్వు శాతం ఆవు పాల కంటే ఎక్కవగా ఉన్నందువల్ల గేదె పాలను ఎక్కువగా వెన్న, నెయ్యి తయారీకి ఉపయోగిస్తారు.ఇండ్లలో టీ తయారీకి ఎక్కువగా కూడా ఉపయోగిస్తారు. గేదెల పోషణకి పీచు ఎక్కువ కలిగిన వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను ఉపయోగించవచ్చు. అందువల్ల తక్కువ ఖర్చుతో గేదెలను మేపవచ్చు. గేదెలు ఎక్కువ వేడిని తట్టుకోలేవు. అందువల్ల వాటిని చల్ల బరచడానికి, ఫ్యాన్, షవర్లు అవసరం. గేదెలు ఈతకు ఆలస్యంగా వస్తాయి. ఈతకు ఈతకు 16 నుండి 18 నెలలు సమయం పడుతుంది.

వనరులు

మార్చు
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]