ధర్మమే జయం 1960 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.వరలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు కడారు నాగభూషణం దర్శకత్వం వహించాడు. కన్నాంబ, జమున, గిరిజ, గుమ్మడి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు గుడిమెట్ల అశ్వత్థామ, ఎస్. హనూమంతరావు సంగీతాన్నందించారు.[1]

ధర్మమే జయం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
నిర్మాణ సంస్థ వరలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం : కడారు నాగభూషణం
  • స్టూడియో: వరలక్ష్మి పిక్చర్స్
  • నిర్మాత: ఎస్.వరలక్ష్మి;
  • ఛాయాగ్రాహకుడు: లక్ష్మణ్ గోరే;
  • స్వరకర్త: అశ్వథామ గుడిమెట్ల, ఎస్.హనుమంత రావు;
  • గేయ రచయిత: వెంపటి సదాశివ బ్రహ్మం, అరుద్ర, కె. వడ్డాది, ఎ. వేణుగోపాల్
  • విడుదల తేదీ: ఏప్రిల్ 9, 1960
  • సంభాషణ: వెంపటి సదాశివ బ్రహ్మం
  • గాయకుడు: పి. లీలా, జిక్కి, పి. సుశీల, కె. జమునా రాణి, ఉడుతా సరోజిని, స్వర్ణలత, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
  • ఆర్ట్ డైరెక్టర్: మాధవపెద్ది గోఖలే

సంక్షిప్త కథ మార్చు

"ప్రజా సేవ" (పత్రిక)యే తన సర్వస్వంగా భావించే దేముడివంటి మాధవరావు, భర్త అడుగుబాడలలో నడచుకొనే సహధర్మచారిణి అన్నపూర్ణ, వదినను తల్లి కంటే మిన్నగా ప్రేమించే లక్ష్మణుని వంటి మరిది ప్రభాకర్ బీదవర్గానికి చెందిన వారు. మిల్లు యజమాని భుజంగరావు, ఆయన కూతురు కమల, కొడుకు చిదంబరం, భుజంగరావు బావమరిది రమేశం, ఆయన ఏకైక పూతురు గిరిజ ధనికవర్గానికి చెందినవారు. ప్రభాకర్, కమల, గిరిజ ఒకే కాలేజీలో బి.యే. చదువుతూ వుంటారు. గిరిజ ప్రభాకర్‌నీ, అతను కమలనీ, కమల అతన్నీ ప్రేమించుకొంటారు. ముగ్గురూ కలిసి నాటకాలాడుతూ, సైకిళ్ళు తొక్కుతూ, ఉమ్మడిగా బి. యే. తప్పుతారు. ఈలోగా మాధవరావు అప్పులవాళ్ళ అగ్నిపరీక్షలో అనేకసార్లు తప్పుతాడు. అయినా అతడు కార్మికులపక్షం వీడిపోక 'ప్రజాసేవ'ను కొనసాగిస్తూ వుంటాడు. తర్వాత ప్రభాకర్, కమల, గిరిజ సెప్టెంబరు పరీక్షలో ఫస్టుక్లాసులో పాసవుతారు. 'ప్రభాకర్‌తో పెళ్ళిచేస్తే చెయ్యి లేదా ఇలు విడిచిపోయి, నీ పరువు గంగలో కలుపుతానని కమల తండ్రిని బెదిరిస్తుంది. గిరిజ తనని పెళ్ళిచేసుకోమని ఎంత వేధించినా, ‘ఎప్పటికైనా గొప్పవారు గొప్పవారే, కొద్దివారు కొద్ది వారే' అని ఎంతచెప్పినా, కనులనే వివాహం చేసుకుంటానని ప్రభాకర్ పంతం పట్తాడు. ఇద్దరికీ పెళ్ళవుతుంది. తర్వాత ఇల్లరికం, భుజంగరావు మరణం, మాధవరావుకు అపనిందలు తటస్థిస్తాయి. ప్రభాకర్‌కు ధనవ్యయం వస్తుంది. కమని భర్తను తృణీకరిస్తుంది. పగతీర్చుకోవాలనుకున్న గిరిజ చివరకు చనిపోతుంది. చివరికి అంతా పశ్చాత్తాపపడి కథను సుఖాంతం చేస్తారు.[2]

మూలాలు మార్చు

  1. "Dharmame Jayam (1960)". Indiancine.ma. Retrieved 2020-09-21.
  2. సారథి (17 April 1960). "చిత్రసమీక్ష: వరలక్ష్మీపిక్చర్సు వారి ధర్మమే జయం" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 29 జనవరి 2023. Retrieved 29 January 2023.

బాహ్య లంకెలు మార్చు