కపిలవాయి లింగమూర్తి

భారతీయ కవి

కపిలవాయి లింగమూర్తి (మార్చి 31, 1928-నవంబర్ 6, 2018) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.[2] పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చాడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి.[3] 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[4]

కపిలవాయి లింగమూర్తి
2018 లో కపిలవాయి లింగమూర్తి గారి చాయ చిత్రం
జననం(1928-03-31)1928 మార్చి 31
మహబూబ్ నగర్ జిల్లా, బల్మూర్ మండలం జినుకుంట గ్రామం [1]
మరణం2018 నవంబరు 6(2018-11-06) (వయసు 90)
దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రి, హైదరాబాదు
మరణ కారణంవార్ధక్యం
విద్యమాస్టర్స్, పి. హెచ్. డి
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం (మాస్టర్స్), తెలుగు విశ్వవిద్యాలయం (డాక్టరేటు)
వృత్తికవి, పరిశోధకులు, విశ్రాంత తెలుగు పండితులు, ఉపన్యాసకులు
జీవిత భాగస్వామిమీనాక్షమ్మ
పిల్లలుకపిలవాయి కిశోర్ బాబు, కపిలవాయి అశోక్ బాబు
తల్లిదండ్రులు
  • వెంకటాచలం (తండ్రి)
  • మాణిక్యమ్మ (తల్లి)

జీవిత సంగ్రహం మార్చు

వీరు అచ్చంపేట తాలుకా, బల్మూర్ మండలం, జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు మార్చి 31, 1928కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ళ వయసులో తండ్రి మృతి చెందడంతో మేనమామ పెద లక్ష్మయ్య దగ్గర పెరిగాడు. పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని సంపాదించాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్‌కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు.[5] పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు. వీరు గవర్నర్లు శ్రీ కృష్ణకాంత్ గారు,శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ గారితో ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు గారు, వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో సన్మానాలు అందుకున్నారు.వీరికి వివిధ సంస్థలు, వ్యక్తుల ద్వారా వచ్చిన పురస్కారాలు 57, సన్మానాలు 163.కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 స్నాతకోత్సవంలో చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది. 1954 నుంచి 1983లో పదవీ విరమణ పొందే వరకు నాగర్‌కర్నూల్ లోని జాతీయోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, అక్కడే స్థిరపడ్డారు. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణంపోశారు. మొత్తం 130 రచనలు (పరిష్కతాలు,సంకాలనాలు,సంపాదితాలు కలిపి) ముద్రితమయినవి.16 రచనలు ద్వితీయ ముద్రీతాలు.ఇంకా 27 రచనలు ముద్రణ కావల్సి ఉంది.

రచనలలో శతకాలు 13, సంకీర్తనలు 9, ఉదాహరణలు 5, వచన గేయ పద్య కృతులు 7, కావ్యాలు 7 ,ఆధ్యాత్మిక రచనలు 9 ,చరిత్రలు 18 ,నవలలు వచన రచనలు 6, కథా సాహిత్యం 3, సంకలనాలు వ్యాఖ్యానాలు 6 ,జీవిత చరిత్రలు/ ఆత్మకథలు 3,నాటకాలు 4, నిఘంటువులు 1, అనువాదాలు 1 సంపాదితాలు పరిష్కతులు 51, సంచికలు సంపాదకులు 6 ఉన్నవి.ముద్రిత అముద్రిత వ్యాసాలన్నీ కలిపి 430. సుమారు 320 పుస్తకాలకు పీఠికలు ,ముందు మాటలు వెలువరించినారు.


జీవితము సాహిత్యం పై ఆరు మంది పరిశోధక విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్ పి.హెచ్.డి పట్టాలు పొందినారు

కపిలవాయి భావనలు మార్చు

  • సమైక్యరాష్ట్రంలో తెలంగాణ కవులు, సాహితీ వేత్తలకు అన్యాయం జరిగింది. జీవోలు తెలుగులో రావాలి. పాఠశాలల్లో తెలుగు బోధించాలి

రచనలు మార్చు

ఇతడు శతాధిక రచనలు చేశాడు. ఇతడు వెలువరించిన గ్రంథాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[6]

ముద్రితాలు మార్చు

స్వీయరచనలు మార్చు

  • ఆర్యా శతకం
  • ఆంధ్ర పుర్ణాచార్యుడు
  • ఉగాది ప్రబంధం
  • ఉదాహరణ పురుషుడు
  • ఉప్పునూతల కథ
  • ఉమామహేశ్వరం స్థలచరిత్ర - స్థానిక వృత్తాంతాలు
  • ఉమామహేశ్వరం హరికథ
  • కంకణగ్రహణం
  • కపిలవాయి గేయఖండికలు
  • కపిలవాయి లింగమూర్తి కథానికలు
  • కపిలవాయి లింగమూర్తి కావ్యాలు
  • కపిలవాయి పీఠికలు
  • కుటుంబగీత
  • క్షేపాల గంగోత్రి - తూము వంశ రెడ్ల చరిత్ర
  • గద్వాల హనుమద్వచనాలు
  • గురుగోవిందమాంబ చరిత్ర
  • గీతాచతుష్పథం
  • గోదాదేవి కథ
  • చంద్రగుండ మఠం చరిత్ర
  • చక్రతీర్థ మాహాత్మ్యం - అయిదాశ్వాసాలు గల స్థల చారిత్రక కావ్యం
  • జినుకుంట రామబంటు శతకం
  • తెల్లరాళ్ళపల్లి తిరుమలేశ శతకం
  • దుర్గాభర్గ శతకం
  • దేవుడు జీవుడు
  • నాగమణి
  • నాగరకందనూలు కథ
  • నిదర్శనాలు
  • పండరినాథ విఠల శతకం - ఏకప్రాస ఔత్సలాలు
  • పద్యకథా పరిమళము
  • పాలమూరు జిల్లా దేవాలయాలు - 2010
  • ప్రబోధపటహం
  • బావుచ్చి
  • భాగవత కథాతత్త్వం
  • మహాక్షేత్రం మామిళ్ళపల్లి - స్థల చరిత్ర
  • మూడుతరాల ముచ్చట
  • నమో పంచాయనాన నమః
  • పద్యపేటిక
  • రాజరథం
  • విశ్వకర్మ పురాణము
  • విశ్వబ్రాహ్మణులు సంస్కృతీ అనుకరణం (కన్నడ నుండి అనువాదం)
  • వివాహస్వర్ణోత్సవ సద్దలి
  • శ్రీ ఇందేశ్వర చరిత్ర
  • శ్రీనారాయణదాసు రామాచార్యుల వంశచరిత్ర
  • శ్రీనివాసవైజయంతీ కళ్యాణోదాహరణం
  • శ్రీ భైరవకోనక్షేత్ర మాహాత్మ్యం
  • శ్రీమత్ప్రతాపగిరి ఖండం - ఆరు ఆశ్వాసాల స్థల చారిత్రక కావ్యం
  • శ్రీమదానందాద్రి పురాణం
  • శ్రీలక్ష్మీపుర నరసింహ భజనకీర్తనలు
  • శ్రీ శివరామబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
  • సహమానశతకం
  • సాయిత్రయి
  • సాయిశతకద్వయం
  • సాలగ్రామం (ఆత్మకథ)
  • సుందరీ సందేశం
  • సుబ్రహ్మణ్యోదాహరణం
  • సోమశిల దేవాలయాల చరిత్ర
  • సోమశిల దేవాలయాల చరిత్ర శాసనాలు, సోమేశ్వరక్షేత్ర మాహాత్మ్యం
  • సోమేశ్వర క్షేత్ర మాహాత్మ్యం
  • స్మృతిపథం

సంపాదకత్వం, పరిష్కృతాలు, వ్యాఖ్యానాలు, సంకలనాలు మార్చు

  • అచలతత్త్వాలు
  • అచలానందం
  • అమడబాకుల శ్రీ కళ్యాణ లక్ష్మీ వేంకటేశ్వరీయం
  • అవధూత పూజావిధానం
  • ఆత్మైకబోధ
  • ఆరు అముద్రితశతకాలు
  • ఆంధ్రపూర్ణాచార్యుడు (నవల)
  • ఇంద్రేశ్వర భజనమాల
  • ఉమామహేశ్వర వ్రతము
  • ఉమామహేశ్వర స్థలపురాణాలు, శాసనాలు
  • కమలారామం
  • కర్పరాద్రి మాహాత్మ్యం
  • కరస్థల నాగలింగేశ్వర చరిత్ర
  • కళానీరాజనం
  • కళ్యాణతారావళి
  • కవితా కదంబం
  • కావ్యగణపతి అష్టోత్తరం
  • కృష్ణనమస్కార శతకం
  • గురుత్రయ స్తోత్రం
  • గురుభజన కీర్తనలు
  • గేయ గుచ్ఛం
  • చూతపురీ విలాసం
  • తడకనపల్లె రామయోగి కృతులు
  • తారా తోరణం
  • దైవ భైషజ్యం
  • ధీరజనమనోజనవిరాజితం
  • శ్రీ పద్మకల్ప ప్రకాశిక
  • పరమహంస శతకం
  • పాలమూరు కవిపండిత కుటుంబాలు
  • పామర సంస్కృతం
  • పోతులూరి వీరబ్రహ్మ శతకం
  • బసవపురాణ సారం
  • భువనమోహినీ విలాసం
  • మనోబుద్ధిర్వివాదం
  • మనోబోధశతకం
  • మా భగోటా
  • మాంగల్యశాస్త్రం
  • మార్కండేయ చరిత్ర
  • యయాతి చరిత్ర వ్యాఖ్యానం
  • యోగసక్తా పరిణయం పీచుప్రతి - పరిష్కరణం - వ్యాఖ్యానం
  • రామగిరి రామయోగి చరితం
  • రామోదాహరణం
  • విశ్వకర్మ కులదీపకులు
  • విశ్వకర్మ పంచబ్రహ్మల యజ్ఞం
  • విశ్వకర్మ విలాసము
  • విశ్వజ్ఞ రామాచార్యులుగారి అభినందన సంచిక
  • వివేక శంఖారావము
  • శారద రామాయణం
  • శ్రీ బుద్దారం గండి రామలింగేశ్వర శతకం
  • శ్రీ ఎం.నారాయణగారి షష్టిపూర్తి సంచిక
  • శ్రీమదాంధ్ర పూర్ణాచార్యప్రభావము
  • శ్రీమద్భాగవత మహాత్మ్యం
  • శ్రీరామవచనాలు
  • శ్రీరుద్రాధ్యాయం
  • శ్రీ హనుమచ్చతకము
  • సంక్షిప్త ఆబ్దిక విధానం
  • సత్యనారాయణవ్రతకథ
  • సాలగ్రామశాస్త్రం
  • సావిత్రి చరిత్ర
  • స్మృతివాణి
  • స్వర్ణ శకలాలు
  • హనుమత్సహస్రం - వ్యాఖ్య
  • నిర్వచన శిల్పకళా విజయం
  • ఔట్ పేషెంట్
  • శంకరాంబ జీవిత చరిత్ర
  • ఉప్పు నూతల కేదారేశ్వర శతకం
  • విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర(బుర్రకథ)
  • రామకీర్తనలు
  • దుందుభి హనుమత్శర్మగారి స్మారక సంచిక
  • పుష్కర శ్రీ. బ్రహ్మొత్సవాల ప్రత్యేక సంచిక

అముద్రితాలు మార్చు

  • ఆంధ్రకవిశతకం
  • ఆలోచన
  • ఆవంచ (చారిత్రకనవల)
  • కపిలవాయి పీఠికలు (ద్వితీయ భాగం)
  • కపిలవాయి వచన ఖండికలు
  • కళ్యాణి (నాటకం)
  • కాదంబరి
  • కృష్ణవేణి (నాట్య రూపకం)
  • కృష్ణావతారం(నృత్య రూపకం)
  • గరుడ పురాణం
  • గురుశిష్యసంవాదము
  • జలేస్మిన్ సన్నిధిం కురు (శ్రవ్య రూపకం)
  • తటిల్లతలు (చాటువులు)
  • తారా లోకనం
  • నాగశేషమాంబజీవితచరిత్ర
  • నా యాత్రా విశేషాలు
  • పాడిపరిశ్రమ (హరికథ)
  • ప్రేరణం-కారణం
  • మద్యపానం (హరికథ)
  • మానాటి మహానుభావులు
  • మార్గదర్శకులు(నాటిక)
  • మృతసంజీవిని(నాటకం)
  • లేఖలు
  • వాసవీ మాత (రూపకం)
  • వివాహాలు వేడుకలు
  • సతీ బాలబ్రహ్మేశ్వర విలాసం రూపకం
  • సాహిత్య వ్యాస సంపుటి
  • సీట్ల పంచాయతి (నాటకం)

కపిలవాయి లింగమూర్తి పై ఇతరుల రచనలు మార్చు

  • మూర్తిదర్శనం - కపిలవాయి కిశోర్ బాబు, అశోక్ బాబు
  • లింగమూర్తిశతకం (ఖండం) - వైద్యం వేంకటేశ్వరాచార్యులు
  • శ్రీమత్ప్రాపగిరిఖండం - పరిశీలన: కె.యాదగిరాచారి
  • లింగమూర్తిశతకం (గీతం) - డా.వెలుదండ సత్యనారాయణ
  • గురుమూర్తిశతకం - డా.వెలుదండ సత్యనారాయణ
  • సాహితీవనం లో ఒక మాలి - డా.కొల్లోజు కనకచారి
  • గురుబ్రహ్మశతకం - డా.కె.బాలస్వామి
  • కపిలవాయి లింగమూర్తి జీవితం సాహిత్యం - డా. కనప నరేందర్

కపిలవాయి రచనలపై పరిశోధనలు మార్చు

కపిలవాయి లింగమూర్తి కావ్యాలు, గీతాలు, శతకాలు, వచన సాహిత్యం, స్థల చరిత్రలు, బాల సాహిత్యం మొదలగు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. ఈ రచనలపై పలువురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికి వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు రూపొందినవి.[7]

బిరుదులు మార్చు

  • 1992లో కవితా తపస్వి
  • 1992లో కవితా కళానిధి
  • 1992లో పరిశోధనా పంచానన
  • 1996లో కవికేసరి
  • 2005లో వేదాంత విశారద
  • 2008లో సాహితీ విరాణ్మూర్తి [8]
  • 2010లో గురు శిరోమణి
  • 2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి

సన్మానాలు మార్చు

కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందినారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం మొదలైన ఎన్నో సత్కారాలను పొందాడు.

కపిలవాయిపై డాక్యుమెంటరీ మార్చు

వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన, పరిశోధనలపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Mana Telangana (11 November 2018). "'సాహిత్య కళానిధి' కపిలవాయి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
  2. రమేష్ బాబు, హెచ్ (December 2018). "మనకాలపు మెకంజీ". Ramoji Foundation. Archived from the original on 12 జనవరి 2019. Retrieved 7 January 2019.
  3. "కపిలవాయి లింగమూర్తి ఇకలేరు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 2018-11-07. Archived from the original on 2018-11-09. Retrieved 2018-11-07.
  4. Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
  5. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, రచన: పి.భాస్కరయోగి
  6. గుడిపల్లి నిరంజన్ (మే 2019). నాగర్‌కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. pp. 53–54. Archived from the original on 29 మార్చి 2020.
  7. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది. 27.08.2014
  8. మూసీ సాహిత్య సాంస్కృతిక చారిత్రక మాసపత్రిక సెప్టెంబరు 2014 సంచిక