ధర్మవడ్డీ (సినిమా)

ధర్మవడ్డీ 1982లో విడుదలైన తెలుగు చిత్రం. త్రిపురనేని గోపీచంద్ రచించిన ధర్మవడ్డీ అనే కథ ఆధారంగా కె.బి.తిలక్ దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం.[1]

ధర్మవడ్డీ
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.తిలక్
తారాగణం జగ్గయ్య,
అన్నపూర్ణ,
నూతన్ ప్రసాద్
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయ మూవీస్
భాష తెలుగు
కె.బి.తిలక్

కోస్తా ప్రాంతంలో వ్యవసాయంలో చితికిపోయిన రైతు సూరయ్య అక్కడి ఆస్తులు అమ్ముకుని తెలంగాణా ప్రంతానికి వ్యవసాయంకోసం వలస వస్తాడు. అక్కడి పరిస్థితుల ప్రభావంతో, నలుగురికీ ఉపయోగపడుతుందని భావించి వడ్డీ వ్యాపారిగా మారతాడు. కానీ క్రమంగా నీతి నియమాలు వదిలేసి డబ్బు వ్యామోహం పెంచుకుని వడ్డీ వసూళ్ళు చేస్తూంటాడు. భార్య (అన్నపూర్ణ) మాట పెడచెవిన పెట్టి మరీ ధనవ్యామోహంతో చేసే పనులకు ఊళ్ళో జనం అసహ్యించుకుంటూంటారు.
తన వల్ల పైకొచ్చిన తోటి వ్యాపారి కొడుక్కిచ్చి తన కుమార్తె రాధ (కృష్ణవేణి)కి నిశ్చితార్థం చేశారు. చంద్రయ్య (నూతన్ ప్రసాద్) సూరయ్య డబ్బు ఎగ్గొట్టి అడిగితే మనుషులతో కొట్టించాడు. ఈ సంఘటనతో ఊళ్ళో చులకనైపోయి వడ్డీలు కట్టడం మానేశారు. అతని వడ్డీ వ్యాపారంలో డబ్బులు పెట్టిన జనం ఒకేసారి డబ్బు కావాలని పట్టుబట్టారు. ఆస్తి లాక్కున్నారు.
ఆస్తి పోయిందని తెలిసి పెళ్ళికొడుకు తరఫువారు సంబంధం వద్దన్నారు, కూతురు పెళ్ళి ఆగిపోయింది. ఈ పరిస్థితులకు తట్టుకోలేక అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.
సూరయ్య మేనల్లుడు చందు (సాయిచంద్) తనపై తిరగబడడంతో చంద్రయ్య చందు, సమ్మక్కల సాయంతో రాధ పెళ్లి చేస్తాడు. ఆపైన కూతురు ఉండీ లేకుండా అయి, సూరయ్య ఒంటరివాడై రోడ్లు పట్టుకుతిరగడం ప్రారంభించాడు. ఎవరైనా బలవంతం చేసి భోజనం పెడితే తినేస్థితికి వచ్చేస్తాడు. ఆపైన అతనికి ఏమైందన్నది మిగతా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.బి.తిలక్

కథ: త్రిపురనేని గోపీచంద్

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

సాహిత్యం: రాజా శివానంద, జి.వై.గిరి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి.శైలజ, విజయలక్ష్మి శర్మ.

విడుదల:1982 మార్చి 20.

పాటలు

మార్చు
  • 1. అబ్బో ఓరబ్బో ధనమండీ; దాని అవతారాలే చెబుతాం; మీరంతా వినరండీ, రచన: రాజా శివానంద, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ బృందం
  • 2. చల్లాచెయ్యీ గొల్లాభామ, కవ్వం తిప్పు కలువ భామ, రచన:రాజా శివానంద, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • 3.ఎత్తు పల్లాలు ఉన్న వంకర టిoకర డొంక, రచన: రాజా శివానంద, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • 4.ఎన్నాళ్ళు ఎన్నాళ్లురో ఈ రభస ఎట్టా, రచన: జి.వై.గిరి, గానం.విజయలక్ష్మి శర్మ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • 5.గడ్డిచ్చే కోడిపిల్ల పిల్లో పిల్లో , రచన: రాజా శివానంద, గానం.ఎస్ పి.శైలజ బృందం

వివరాలు

మార్చు

చిత్రం చిన్న కథ మీద ఆధారపడిందవడం వల్ల సాగలాగినట్లు అనిపిస్తుంది. సంగీతపరంగా తిలక్ మిగతా చిత్రాలతో పోలిస్తె పేలవంగా ఉంది.

మూలాలు

మార్చు
  1. వనం జ్వాలా నరసింహారావు (2006). అనుపమ గీతాల తిలక్ (కళాంజలి గ్రాఫిక్స్ ed.). హైదరాబాదు: హాసం ప్రచురణలు. p. 89-91.
  2. ఆంధ్రభూమి, విలేకరి (20 March 1982). "ధర్మవడ్డీ!". ఆంధ్రభూమి సినిమా పత్రిక: 44, 45.

3. ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.