త్రిపురనేని సాయిచంద్

సినీ నటుడు, డాక్యుమెంటరీ దర్శకుడు

త్రిపురనేని సాయిచంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త.[1] సుప్రసిద్ద రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు. సంఘసంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచాడు. ఆ తర్వాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీలు తీస్తూ ఢిల్లీలో గడిపారు[2]. పాతికేళ్ళ విరామం తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేశాడు. నిజజీవితంలో బ్రహ్మచారి[3]గా మిగిలిపోయిన సాయిచంద్, ఫిదా చిత్రంలో ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

త్రిపురనేని సాయిచంద్
జననం (1956-03-12) 1956 మార్చి 12 (వయస్సు: 64  సంవత్సరాలు)
కర్నూలు, ఆంధ్రప్రదేశ్
నివాసంహైదరాబాదు
చదువుబి.కాం
విద్యాసంస్థలున్యూ సైన్సు కాలేజ్, హైదరాబాదు
తల్లిదండ్రులు

ఫిల్మోగ్రఫీసవరించు

సాయిచంద్ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:

మూలాలుసవరించు

  1. Nadadhur, Srivathsan (2 August 2017). "Sai Chand: The father figure". The Hindu (ఆంగ్లం లో). The Hindu. Retrieved 15 February 2018.
  2. మనం మరిచిపోయిన నటుడు
  3. వెబ్ దునియా, పెళ్ళికాని బ్రహ్మచారిని