ధర్‌పల్లి (నిజామాబాద్ జిల్లా)

భారతదేశంలోని గ్రామం

ధర్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ధర్‌పల్లి మండలానికి గ్రామం.[1]

ధర్‌పల్లి
—  రెవెన్యూ గ్రామం  —
ధర్‌పల్లి is located in తెలంగాణ
ధర్‌పల్లి
ధర్‌పల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°34′35″N 78°22′10″E / 18.576505°N 78.369358°E / 18.576505; 78.369358
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం ధర్‌పల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,132
 - పురుషుల సంఖ్య 5,336
 - స్త్రీల సంఖ్య 5,796
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

పేరు వెనుక చరిత్ర మార్చు

శ్రీకృష్ణుడు త్రేతాయుగకాలంలో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశ పర్యటన నేపథ్యంలో దారిమధ్యలో ఆగిన పల్లెనే దారిలోనిపల్లెగా పేరుగాంచి, ఆ తరువాతికాలంలో అది ధర్‌పల్లిగా ప్రసిద్ధిగాంచిందని ప్రతీతి. రాజుల కాలంలో ధర్‌పల్లికి చుట్టుపక్కల సీతాయిపేట, హోన్నాజిపేట, దమ్మన్నపేట అనే పెద్దపెద్ద పేటలు (పట్టణాలు) ఉండేవి. అక్కడి వ్యాపారులు, ధనవంతులు తమతమ వ్యాపారం కోసం ఈ పేటలకు వచ్చేవారని.. అలా వచ్చేప్పుడు దారిమధ్యలో సేద తీరేవారు. ఆ గ్రామాలకు వెళ్ళేదారి ప్రధాన కూడలీలో ఈ గ్రామం ఉండడంతో దీనిపేరు దారిపల్లెగా పేరుగాంచిందని… తర్వాత ధర్‌పల్లిగా రూపాంతరం చెందిందని పూర్వీకులు చెబుతున్నారు.[3]

గ్రామ చరిత్ర మార్చు

1985లో మండల వ్యవస్థ రూపొందడంతో చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రధాన కూడలీగా ఉన్న ఈ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కర్ణం రామచంద్రరావు, ఎమ్మెల్యే థామస్‌ కృషి ఫలితంగా మండలంగా ఏర్పాటైంది. గ్రామ మొదటి సర్పంచ్‌గా మూత రాములు (నామినేటేడ్‌)కాగా ఎన్నికల ద్వారా ఎం. కాంతరావు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అయితే అప్పుడు సర్పంచ్‌ పదవికి మూడు సంవత్సర కాలపరిధి మాత్రమే. కాగా కొన్ని సంవత్సరాలు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా మొట్టమొదటిసారి 1981లో సర్పంచ్‌ స్థానానికి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అప్పుడు ఏలేటి వెంకట్‌రెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన తొలి సర్పంచ్‌గా చరిత్రలో నిలిచాడు.[3]

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2546 ఇళ్లతో, 11132 జనాభాతో 3965 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5336, ఆడవారి సంఖ్య 5796. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1293 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1017. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 571249.[4]

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నిజామాబాద్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నిజామాబాద్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

1987లో మండల కేంద్రంలోని 5 ఎకరాల స్థలంలో 30 పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మించబడింది. ధర్పల్లిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆరుగురు డాక్టర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. టి. బి వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు 11 మంది ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

1970లో తారురోడ్డు, పోస్టాఫీసు ఏర్పాటయయ్యాయి. ధర్పల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

1970లో గ్రామంలో బ్యాంకు ఏర్పాటయింది. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

1964లో ఈ గ్రామానికి విద్యుత్‌ సరఫరా వచ్చింది. గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

ధర్పల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1441 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 394 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 16 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 487 హెక్టార్లు
  • బంజరు భూమి: 184 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1441 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1367 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 746 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

ధర్పల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 746 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

ధర్పల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, పసుపు, సోయాబీన్

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బీడీలు

గ్రామ విశేషాలు మార్చు

  • మండల కేంద్రంలోని మద్దుల్ అటవీ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. [1]
  • ధర్పల్లి గ్రామములోని చెరువు ముందటి తండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు 2014,ఫిబ్రవరి-16,17,18లలో, మూడు రోజులపాటు నిర్వహించారు. 17 మద్యాహ్నం హోమం, సాయంత్రం ఆదివాసుల పూజ, అన్నదానం నిర్వహించెదరు. 18న ఉదయం జగదాంబ మాత, సేవాలాల్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది. ఉదయం విగ్రహాలకు ప్రత్యేక పూజలు, యగ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.[2] 1830లో నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ అడవిలో నరసింహస్వామి ఆలయం వుందని, అది జాగ్రత్త స్థలమనీ వ్రాశారు.[5]
  • ఇక్కడ జగన్నాథస్వామి దేవాలయం కూడా ఉంది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-05-05.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. 3.0 3.1 telugu, NT News (2023-02-24). "Dharpally | శ్రీకృష్ణుడు సేదతీరిన నేల.. మన తెలంగాణ పల్లె.. త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న ఈ గ్రామం గురించి తెలుసా !". www.ntnews.com. Archived from the original on 2023-02-26. Retrieved 2023-02-26.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లంకెలు మార్చు

[1] ఈనాడు నిజామాబాదు రూరల్, 2013,డిసెంబరు-15; 2వపేజీ. [2] ఈనాడు నిజామాబాదు రూరల్; 19,ఫిబ్రవరి-2014, 1వ పేజీ.