ధీరజ్ ప్రసాద్ సాహు
ధీరజ్ ప్రసాద్ సాహు (జననం 1959 నవంబరు 23) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2010 జూలైలో కాంగ్రెస్ టిక్కెట్‌పై జార్ఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1]
ధీరజ్ ప్రసాద్ సాహు | |
---|---|
జార్ఖండ్ రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు | |
Assumed office 2018 మే 4 | |
అంతకు ముందు వారు | ప్రదీప్ కుమార్ బల్ముచు, కాంగ్రెస్ |
In office 2010 జులై 8 – 2016 జులై 7 | |
తరువాత వారు | మహేష్ పొద్దార్, భాజాపా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1959 నవంబరు 23 లోహార్‌దాగా |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లి | శుశీలా దేవి |
తండ్రి | బల్దేయో సాహు |
బంధువులు | శివ ప్రసాద్ సాహు (సోదరుడు) |
కళాశాల | మార్వాడీ కళాశాల, రాంచీ |
ప్రారంభ జీవితం
మార్చుజార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో సామాజిక కార్యకర్త బల్దియో సాహు, శుశీలా దేవి దంపతులకు ఆయన 1959 నవంబరు 23న జన్మించాడు. ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సాహు సోదరుడు.[2] ధీరజ్ ప్రసాద్ సాహు బిఏ డిగ్రీ పుచ్చుకున్నాడు.[3]
రాజకీయ జీవితం
మార్చు1977లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1978లో జైల్ భరో ఆందోళనలో జైలు పాలయ్యాడు. 2009 జూన్లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యాడు. జూలై 2010లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
2023 ఐటీ దాడులు
మార్చుఆయనకు చెందిన ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు 2023 డిసెంబరులో చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది.[4] ఇప్పటివరకు ఒడిశా, జార్ఖండ్‌లలోని ఆయన నివాసాలు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అనేక దాడులు నిర్వహించి, ₹351 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఇంకా మూసి ఉన్న లాకర్లను తెరవాల్సి ఉండగా దాడి కొనసాగుతోంది.[5]
మూలాలు
మార్చు- ↑ "Detailed Profile: Shri Sahu". Retrieved 14 October 2015.
- ↑ "राहुल गांधी से मिले सांसद धीरज प्रसाद साहू". livehindustan. 10 April 2018. Retrieved 23 September 2019.
- ↑ "Dhiraj Prasad Sahu". myNeta.info. Retrieved 14 October 2015.
- ↑ "దాడుల్లో దొరికింది 290 కోట్లు | Income Tax department raid on Odisha distillery has turned up Rs 290 Cr - Sakshi". web.archive.org. 2023-12-11. Archived from the original on 2023-12-11. Retrieved 2023-12-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Congress distances itself from MP amid Rs 300 crore cash haul in tax raid". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-10.