నంది హిల్స్

కర్ణాటక భారతదేశం

నంది కొండలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ కొండలపై నుండి సూర్యోదయాన్ని తిలకించడం ఓ రకమైన దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. కొండపైనుండి చూస్తే మేఘాలపై నుండి చూస్తున్నట్టు ఉంటుంది. ఈ దట్టమైన మేఘాలపైన సూర్యోదయాన్ని చూడటం ఓ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూడాలంటే ఉదయం 6 గంటలలోపు అక్కడకు చేరుకోవాలి. పార్కింగ్ సదుపాయం ఉంది. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొబైలు సిగ్నల్ దొరకడం కొంచెం కష్టమే. పురాతన కోట కట్టడాలను గమనించవచ్చు. కోట లోపలికి, సూర్యోదయాన్ని చూడడానికి ప్రవేశించాలంటే ప్రవేశ రుసుము చెల్లించాలి.[1]

నంది హిల్స్
నంది బెట్ట
నందిదుర్గ
పర్యాటక ప్రదేశం
నంది బెట్టనుండి సూర్యోదయం
నంది బెట్టనుండి సూర్యోదయం
నంది హిల్స్ is located in Karnataka
నంది హిల్స్
కర్ణాటక లో స్థానం
Coordinates: 13°23′11″N 77°42′03″E / 13.3862588°N 77.7009344°E / 13.3862588; 77.7009344
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిక్కబళ్లాపూర్
Elevation
1,478 మీ (4,849 అ.)
Time zoneUTC+5:30 (IST)
సమీప నగరంబెంగుళూరు

చరిత్ర

మార్చు
 
నంది కొండలపైన

ఈ ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ కట్టించాడు. ఈ కొండల మూలాలు అర్కవతి నది, పొన్నైయర్ నది, పాలర్ నది, పెన్నా నదిగా ఉండేవని చెప్పుకునేవారు..[2] ఈ కొండల గురించి అనేక చరిత్రలు ఉన్నాయి. చోళ రాజుల కాలంలో ఈ కొండలని ఆనందగిరిగా పిలిచేవారు. టిప్పు సుల్తాన్ కాలంలో ఈ కొండలని నందిదుర్గ అని కూడా పిలిచేవారు. ఈ కొండ పైన 1300 సంవత్సరాల పురాతన ద్రవిడియన్లు నిర్మించిన విదంగా నంది ఆలయం కట్టడం ఉంది కనుక ఈ కొండలను నంది హిల్స్ అనే పిలిచేవారని చరిత్ర చెబుతోంది.

ఈ కొండ క్రింద ఉన్న గ్రామము నంది గ్రామము. ఆ గ్రామమునందు సోమేశ్వరాలయము ఉంది.ఇక్కడ సంస్కృత శ్లోకాత్మకమైన శాసన మొకటి ఉంది. టి.యల్ నరసింహరావు చే పరిష్కృతమైన ఈ శాసనమును మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ 1949లో ప్రచురించారు. (Bulletin of the Govt.Oriental Manuscripts Library, Madras. Vol 2 Page 41) ఈ శాసనమునందు కృష్ణరాజు అనుప్రభువు యొక్క ప్రశంస ఉంది. ఇందులో అష్టదిగ్గజాల ప్రశంస ఉంది. ఈ శాసనపు 11వ శ్లోకములో శాసనకాలము పేర్కొనబడింది. ఇందు సాంకేతికముగా పేర్కొనబడిన కలిశకము 3486, అనగా సా.శ.1527. అందువలన శాసనమందు పేర్కొనబడిన కృష్ణరాజు శ్రీకృష్ణదేవరాయలు అనవచ్చును. ఇదే సం.లో రాయలు తిప్పలూరును అష్టదిగ్గజ కవీశ్వరులకు సర్వాగ్రహారముగా ఇచ్చెను. ఆ సంవత్సరమునందే అష్టదిగ్గజ కవుల ప్రశంస మైసూరు రాష్ట్రమందుకల నందిదుర్గ క్షేత్రమును సోమశంకరదేవునకు భూదానము చేసిన సమయమున కృష్ణదేవరాయలు ప్రత్యేకముగా పేర్కొనెను.

ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలోని నంది అనే ఊరినుంచి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.

మూలాలు

మార్చు
  1. Garg, Santosh Kumar (1999). International and interstate river water disputes. Laxmi Publications. pp. 7–8. ISBN 978-81-7008-068-8. Retrieved 28 July 2019.
  2. "Nandi Hills". 28 July 2019. Archived from the original on 2019-07-28.