నగుమోము గనలేని (కీర్తన)

నగుమోము గనలేని అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.

ఈ కీర్తన ఖరహరప్రియ జన్యమైన ఆభేరి రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]

త్యాగరాజు ఈ అభేరి రాగంలో ఈ కీర్తన ఒక్కటి మాత్రమే వ్రాశాడు. ఆయనగారి శిష్యుడు తంజావూరు రామారావు. ఆయన నందరూ చిన్న త్యాగరాజు అంటూ ఉండేవారు. అతడు గురువుగారూ! ఈ రాగంలో మరొక కీర్తన వ్రాయండి అని అడిగితే త్యాగరాజు చిరు నవ్వు నవ్వి అభేరి సంపూర్ణ స్వరూప ప్రదర్శనకు ఈ ఒక్క కీర్తన చాలు నాయనా అన్నారు.

కీర్తన మార్చు

పల్లవి

నగు మోము గన లేని నా జాలిఁ దెలిసి

నన్ను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ | | నగు మోము | |

అనుపల్లవి

నగరాజధర ! నీదు పరివారు లెల్ల -

ఒగి బోధన జేసెడువారలు గారె ? యిటు లుండుదురే ? నీ

భారతీయ సంస్కృతి మార్చు

పూర్తి పాఠం మార్చు

మూలాలు మార్చు

  1. "కర్ణాటిక్ సైట్ లో నగుమోము కీర్తన పూర్తి సాహిత్యం". Archived from the original on 2011-11-19. Retrieved 2011-10-27.
  2. "మంగళంపల్లి పాడిన కీర్తన రాగా.కాం లో వినండి". Archived from the original on 2011-09-10. Retrieved 2011-10-27.
  3. "రాగా.కాం లో నగుమోము పోటీ పాట". Archived from the original on 2011-11-26. Retrieved 2011-10-27.