నిజీన్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంది. ఇది దాల్ సరస్సు, ఖుషాల్ సర్ సరస్సు, గిల్ సర్ సరస్సులతో అనుసంధానించబడి ఉంటుంది.[1][2][3]

నిజీన్ సరస్సు
హరి పర్బత్ కొండతో నిజీన్ సరస్సు దృశ్యం
నిజీన్ సరస్సు is located in Jammu and Kashmir
నిజీన్ సరస్సు
నిజీన్ సరస్సు
ప్రదేశంశ్రీనగర్, శ్రీనగర్, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు34°06′50″N 74°49′56″E / 34.11389°N 74.83222°E / 34.11389; 74.83222
వెలుపలికి ప్రవాహంనల్లా అమీర్ ఖాన్
గరిష్ట పొడవు2.7 కి.మీ. (1.7 మై.)
గరిష్ట వెడల్పు0.82 కి.మీ. (0.51 మై.)
ఉపరితల ఎత్తు1,582 మీ. (5,190 అ.)

పేరు-అర్థం

మార్చు

నిజీన్ సరస్సు చుట్టూ పెద్ద సంఖ్యలో విల్లో, పోప్లర్ చెట్లు ఉన్నాయి. అందువల్ల, దీనిని "నజీనా" అనికూడా పిలుస్తారు. నజీనా అంటే "ఉంగరంలోని ఆభరణం" అని అర్ధం. "నిజీన్" అనే పదం నజీనా నుండి వచ్చింది.[2]

భౌగోళికం

మార్చు

ఈ సరస్సు దాల్ సరస్సుకి పశ్చిమాన హరి పర్బత్ కొండకు ఆనుకుని ఉంది. దాని ఉత్తర, పడమర వైపు బఘ్వాన్‌పోరా, లాల్ బజార్ ప్రాంతాలు ఉన్నాయి. ఈశాన్యంలో హజ్రత్‌బల్ ఉంది, ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది.[2]

ప్రస్తుత పరిస్థితి

మార్చు

దాల్ సరస్సుతో పోలిస్తే ఇది సహజమైన నీటికి ప్రసిద్ధి చెందింది. దాల్ సరస్సు కంటే తక్కువ లోతుగా, తక్కువ రద్దీగా ఉండటం వలన ఇది ఈతకు కూడా అనువుగా ఉంటుంది. కాశ్మీర్ లోయలోని ఇతర సరస్సులకు సమస్యలు ఉన్నట్లుగా ఈ సరస్సు కూడా ఆక్రమణలతో దిగజారిపోతుంది. దీని ద్వారా దాని నీటి నాణ్యత క్షీణిస్తోంది. వరదల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సరస్సు యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి, దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి సహాయపడే చర్యలలో నిమగ్నమై ఉంది.[2][4]

మూలాలు

మార్చు
  1. "Nigeen lake turned eutrophic". 11 Aug 2012. Retrieved 11 July 2015.
  2. 2.0 2.1 2.2 2.3 "Nigeen Lake-JK Tourism". Retrieved 11 July 2015.[permanent dead link]
  3. Unni,K.S. Conservation and Management of Aquatic Ecosystems, p. 122, గూగుల్ బుక్స్ వద్ద
  4. Press Trust of India (10 June 2015). "J&K govt to take steps for beautification of Nigeen lake". Business Standard. Retrieved 7 March 2018.