నటరాజస్వామి ఆలయం (చిదంబరం)
చిదంబరం దేవాలయం (తమిళం: சிதம்பரம் கோயில்) పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.[1]
చిదంబరం ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 11°23′58″N 79°41′36″E / 11.39944°N 79.69333°E |
పేరు | |
ప్రధాన పేరు : | చిదంబరం తిల్లై నటరాజర్-కూతన్ కోయిల్ |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | కడలూర్ జిల్లా |
ప్రదేశం: | చిదంబరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నటరాజు (తిల్లై కూతన్ - శివుడు) |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ నిర్మాణశైలి |
హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ, శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
ఆలయం
మార్చుఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన, చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.
పద వివరణ
మార్చుచిదంబరం అను పదం, "చైతన్యం" అని అర్ధం వచ్చిన చిత్,, "ఆకాశం" (ఆకాయం నుంచి పుట్టిన) అని అర్ధం వచ్చిన అంబరం; సూచించిన చిదాకశం, చైతన్యం ఆరోపించబడినట్టి ఆకాశం, దీనినే అన్ని వేదాలు, శాసనాల ప్రకారం, మానవుడు చేరుకోవలసిన అంతిమ లక్ష్యంగా చెప్పబడింది.
మరొక సిద్ధాంతం ఏమనగా, ఇది చిత్ + అంబళం నుంచి పుట్టినది. అంబళం అనగా కళలను ప్రదర్శించుట కొరకు ఒక "వేదిక". చిదాకశం అనేది పరమేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా ఆనందం, నటరాజుని చిద్విలాసం లేదా ఆనంద నటన యొక్క చిహ్నాత్మక వర్ణన. చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శైవులు నమ్ముతారు.
ఇంకా మరొక సిద్ధాంతం ప్రకారం, "ఆట లేక దైవ నృత్యం" అని అర్ధం వచ్చే చితు, "వేదిక" అని అర్ధం వచ్చే అంబళం నుంచి వచ్చిన చిత్రాంబళం నుంచి ఈ పదం పుట్టినది.
ప్రత్యేక లక్షణాలు
మార్చుసర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది, శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. పరమ శివుడు నిలుపునట్టి ఈ విశ్వం యొక్క కదలికలు, నటరాజు యొక్క జగత్సంబంధమైన నృత్యాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.
అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ (అలియాస్ వనకోవరైయన్) సా.శ..1213 లో చిదంబరం లోని శివుని ఆలయాన్ని పునర్నిర్మించాడు. అదే బాణ సామ్రాజ్య ప్రముఖుడు తిరువన్నమలై ఆలయాన్ని కూడా నిర్మించాడు.
ఈ ఆలయాన్ని సనాతనంగా నడిపిస్తున్న దిక్షితార్ అని పిలువబడే, అంతర్వివాహీకులైన శైవ బ్రాహ్మణులు, అధికారిక పురోహితులు కూడా.
దీక్షితార్లకి, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య జరిగిన దీర్ఘకాలిక యుద్ధానికి ఇది చరమాంకం. ప్రభుత్వం దీక్షితార్లు కానివారిని తేవరం స్తోత్రాలను దేవుని యొక్క 'గర్భగుడి'లో (సంస్కృతం: గర్భగ్రిహ) గానం చేయుటకు అనుమతించినప్పుడు, దీక్షితులు, వారికి మాత్రమే నటరాజుని గర్భగుడిలో పూజించే హక్కు కలదని తెలియజెప్పి అభ్యంతరం చెప్పుటతో మొదలైనది.
చిదంబరం పురాణం , దాని ప్రాముఖ్యత
మార్చుపురాణం
మార్చుచిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి, తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ, ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).
అజ్ఞానం యొక్క దమనం
మార్చుతిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా 'ఋషులు' నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు, భగవంతుడిని కొన్ని క్రతువులు, 'మంత్రాల'తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, 'పిచ్చతనాదర్' రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన, ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు, వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు, అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.
ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు, మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన 'సర్పాల'ను (సంస్కృతం: నాగ) ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు, నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.
పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ - అను, అజ్ఞానానికి, గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం (ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం) చేస్తాడు, ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని, అతను మంత్రాలకు, ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.
ఆనంద తాండవ భంగిమ
మార్చుపరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.
- అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్ని నటరాజుని పాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.
- చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి) అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.
- ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.
- వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది.
- చేతిలోని ఢమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.
ఇట్టి ప్రధాన సంగతులను నటరాజ మూర్తి, దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఇక్కడి నుంచి 32కిమీ దూరంలోని మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమ యొక్క అరుదైన రకం అగుపడుతుంది. ఈ కోవెలలో, నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టు, గుండ్రంగా తిరుగుచూ చేయు నృత్యభాగం ఈ పుణ్య స్థానంలో ఉంచబడిన ఒక పాలా కళగా గుర్తించడమైనది.
ఆనంద తాండవం
మార్చుఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన 'పతంజలి' రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.
కృత యుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపథార్ / పులికాల్ముని ని కలుస్తాడు (వ్యాఘ్ర / పులి అనగా అర్ధం "పులి", పథ / కాల్ అనగా అర్ధం "పాదం" – అతను దేవుని పూజకు తెచ్చు పూల మీద తుమ్మెదలు వ్రాలుటకు ముందే అనగా వేకువ జాములో చెట్లను ఎక్కి కోయుటకు వీలుగా అతనికి అట్టి పాదాలు, పులి యొక్క కంటిచూపు మాదిరి చూపు వచ్చెనని తెలియజేయు కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చినది). పతంజలి యోగి, అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్థించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే (తిరు - శ్రీ, మూలటనం - స్వయంభువుడైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున, తమిళ మాసం తాయ్ (జనవరి – ఫెబ్రవరి) లో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.
ప్రాముఖ్యత
మార్చుచిదంబరాన్ని వివిధ రచనలలో, తిల్లై (గతంలో తిల్లైవనంలో ఇప్పుడున్న దేవాలయం నెలకొన్నది), పెరుంపత్రపులియుర్ లేదా వ్యాఘ్రపురం (వ్యాఘ్రపథార్ ముని జ్ఞాపకార్ధం) అని కూడా సూచించడమైనది.
ఆలయం, విశ్వం యొక్క హృదయ కమలంలో నెలకొల్పారని భావించడమైనది": విరాట్ హృదయ పద్మ స్థలం . దైవం యొక్క చిద్విలాస నృత్యం, ఆనంద తాండవం ప్రదర్శించిన స్థలం - "తిరుమూలాటనేస్వర్ ఆలయా"నికి సరిగ్గా దక్షిణంలో ఉన్నది, ప్రస్తుతం ఆ స్థలం పొన్నాంబలం / పోర్సాబై (పొన్ అనగా అర్ధం బంగారం, అంబళం /సబై అనగా అర్ధం వేదిక)లో పరమశివుడు నర్తిస్తున్న రూపం ఉన్నది. అందువలన భగవంతుడిని సభనాయకార్ అనగా వేదిక పై వెలసిన దైవం అని కూడా అంటారు.
చిదంబర ఆలయం యొక్క బంగారపు పై కప్పు కలిగిన గర్భ గుడిలో దైవం మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు:
- "స్వరూపం" - సకల తిరుమేని అని పిలిచేటి ఈశ్వరుని మనిషిగా ఆపాదించిన రూపమైన నటరాజస్వామి.
- "అర్ధ-స్వరూపం" - చంద్రమౌళేశ్వరుని యొక్క స్పటిక లింగరూపంలోని, అర్ధ- ఈశ్వర మానుష్య శరీరమైన, సకల నిష్కళ తిరుమేని .
- "నిరాకార స్వరూపం" - చిదంబర రహస్యం లోని అంతరాళం మాదిరి, గర్భగుడిలోని శూన్య స్థలం, నిష్కళ తిరుమేని .
పంచ భూతాల స్థలాలు
మార్చుపంచభూతాల స్థలాలలో ఒకటైన చిదంబరంలో, ఆకాశం లేదా ఆగయంగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు ("పంచ" అనగా అర్ధం ఐదు, భూత అనగా అర్ధం మూలకం: భూమి, నీరు, నిప్పు, గాలి,, అంతరాళం, "స్థల" అనగా ప్రదేశం).
మిగతావి ఏవనగా:
- కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, ఇక్కడ భూమిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
- తిరుచిరాపల్లి, తిరువనైకావల్ లోని జంబుకేశ్వర ఆలయంలో, నీరుగా సాక్షాత్కరించిన స్వామిని ఆరాధిస్తారు.
- తిరువన్నామలైలోని అన్నమలైయర్ ఆలయంలో, అగ్నిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
- శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో, గాలి/వాయువుగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
చిదంబరం అనేది కూడా పరమ శివుడు నర్తించిన ఐదు ప్రదేశాలలో ఒకటి, అన్ని ప్రదేశాలలో వేదికలు/ సభైలు ఉన్నాయి. పోర్ సభై కలిగి ఉన్న చిదంబరం కాక, మిగతావి ఏవనగా, తిరువాలన్గాడులోని రతిన సభై (రతినం అనగా – రత్నం/ఎరుపు), కోర్తళ్ళంలోని చిత్ర సభై (చిత్ర – ఛాయా చిత్రం), మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని రజత సభై లేదా వెల్లి అంబళం (రజత / వెల్లి – వెండి), తిరునెల్వేలి నెల్లైఅప్పార్ ఆలయంలోని తామిర సభై (తామిరం – రాగి).
ఆలయ భక్తులు
మార్చుతిల్లై ఆలయ అర్చకులకు తన ఆదరణని చూపి, దైవసమానుడైనట్టి సుందరర్ తిరుతొందర్ తోగై లోకి (పరమశివుని యొక్క 63 భక్తుల చిట్టా) స్థానం సంపాదించాడు. తిల్లైలోని అర్చకుల యొక్క భక్తులకు, నేను భక్తుడను .
నలుగురు పుణ్యాత్ములైన కవులు - తిరుజ్ఞాన సంబంతార్, తిరునావుక్కరసర్, సుందరమూర్తి నయనార్,, మణిక్కవసాగర్ వంటి కవుల యొక్క కవిత్వంతో ఆలయం, స్వామి కూడా అమరత్వం పొందారు. మొదటి ముగ్గురి నుంచి సేకరించబడిన రచనలను తరచుగా దేవారా లు అని పిలుస్తారు కానీ ఇది తప్పు. కేవలం అప్పార్ (తిరునావుక్కరసర్) యొక్క గానాలను దేవారం అని అంటారు. సంబంతార్ యొక్క గానాలను తిరుకడైకప్పు అని అంటారు. సుందరర్ యొక్క గానాలను తిరుపాటు అని అంటారు.
తిరుజ్ఞాన సంబంతార్ చిదంబరంలోని స్వామిని కీర్తిస్తూ 2 గేయాలను రచించాడు, నటరాజస్వామిని కీర్తిస్తూ తిరునావుక్కరసర్ అకా అప్పార్ 8 తేవరాలు,, నటరాజస్వామిని కీర్తిస్తూ సుందరర్ ఒక గేయం రచించారు.
మణిక్కవసాగర్ రచించిన రెండు రచనలలో, మొదటిది తిరువాసకం (పవిత్ర ఉచ్చ్హారణలు) ని చిదంబరంలో ఎక్కువగా గానం చేయగా, రెండవది తిరుచిత్రంబలక్కోవైయర్ (అకా తిరుకోవైయర్), మొత్తం చిదంబరంలోనే గానం చేశారు. మణిక్కవసాగర్, చిదంబరంలోనే మోక్షం పొందాడని చెబుతారు.
మొదటి ముగ్గురి యొక్క రచనలు, ఆలయంలోని తాళపత్రాలలో భద్ర పరచారు, వాటిని శ్రీ రాజరాజ చోళునిగా ఖ్యాతికెక్కిన చోళ రాజు అరున్మోజ్హివర్మన్, నంబియన్దార్నంబి ఆధ్వర్యంలో స్వాధీనపరచుకున్నారు.
ఆలయ స్థాపత్యం , ప్రాముఖ్యత
మార్చుగోపురాలు
మార్చుఆలయానికి 9 ముఖద్వారాలు ఉండగా, వీటిలో నాలుగింటికి 7 స్థాయిలు కలిగిన ఎత్తైన పగోడాలు లేదా గోపురాలు తూర్పు, దక్షిణం, పడమర,, ఉత్తరంలో ఉన్నాయి. తూర్పు దిక్కునున్న గోపురానికి, భారతీయ నృత్యరూపమైన భరతనాట్యంలోని 108 భంగిమల (కర్ణముల ) యొక్క శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
ఐదు సభై (వేదిక)లు
మార్చు5 సభలు లేదా వేదికలు లేదా మందిరాలు ఉన్నాయి:
- నటరాజ స్వామి, ఆయన సతీమణి శివగామసుందరి అమ్మవారు కొలువున్న గర్భగుడి చిత్ సభై.
- చిట్ సభైకి ఎదురుగా ఉన్న కనక సభైలో ప్రతిదినం చేయవలసిన క్రతువులను నిర్వహిస్తారు.[2]
- ఆలయం యొక్క ధ్వజ స్తంభానికి (కోది మారం లేదా ధ్వజ స్తంభం ) దక్షిణంగా ఉన్న నృత్య సభై లేదా నాట్య సభై లో, స్వామి శక్తి స్వరూపిణియైన కాళికాదేవితో కలిసి నాట్యం చేసి స్థల శ్రేష్ఠత్వాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు.
- రాజ సభై లేదా 1000- స్తంభాల మందిరం సాదృశ్యకంగా తెలియజెప్పేటి, వేయి స్తంభాల కమలం యొక్క యోగ చక్రం లేదా సహస్రారం (ఇది యోగాలో చెప్పబడినట్టి శిరస్సు పై భాగంలోని 'చక్రం' నుంచి ఆత్మ భగవంతునిలో ఐక్యమౌతుంది. ఈ చక్రానికి ద్రుష్టాంతరంగా 1000- దళాలు కలిగిన కమలం చూపుతారు. సహస్రార చక్రం మీద ఏకాగ్రత వహించి ధ్యానం చేయువారు దైవిక శక్తిలోకి లీనమౌతారు అని చెబుతారు, ఇది యోగాభ్యాసంలో పరాకాష్ఠ).
- దేవ సభైలో కొలువున్న పంచ మూర్తులు (పంచ - ఐదు, మూర్తులు - విగ్రహాలైన, విఘ్నేశ్వరుడు - విఘ్నాలను తొలగించువాడు, తన సతీమణితో వయ్యారంగా ఆసీనుడైన భంగిమలోని సోమస్కందస్వామి, ఆ స్వామి సతీమణి శివానంద నాయకి, మురుగన్ స్వామి, చండికేశ్వర దేవత - స్వామి యొక్క భక్తులలో అగ్రగణ్యుడు).
ఇతర విగ్రహాలు
మార్చుఐదు సభై లలో లేని మిగతావి:
- పుణ్య పురుషులైన పతంజలి, వ్యాఘ్రపథార్ పూజించిన మూలమైన శివలింగం యొక్క విగ్రహాలు - తిరు ఆదిమూలనతార్, ఆయన సతీమణి ఉమైయమ్మై (உமையம்மை) లేదా ఉమైయా పార్వతి అని పిలుస్తారు
- పరమ శివుని యొక్క 63 అగ్ర భక్తుల విగ్రహాలు - లేదా అరుబత్తు మూవర్
- శివగామి - జ్ఞాన స్వరూపిణి లేదా జ్ఞానశక్తి యొక్క విగ్రహాలు
- విఘ్నాలను తొలగించుటకు సాక్షాత్కరించిన - విఘ్నేశ్వరుని విగ్రహం
- మురుగన్ స్వామి లేదా పాండియ నాయకన్ - శక్తి యొక్క మూడు రూపాలైనట్టి ఇచ్చై లేదా "కోరిక"కి ద్రుష్టాంతరమైన ఆయన సతీమణి వల్లి, క్రియ లేదా "చర్య"కి ద్రుష్టాంతరమైన ఆయన సతీమణి దేవయాని , జ్ఞాన లేదా "జ్ఞానానికి" ద్రుష్టాంతరమైన, ఆయన చేపట్టిన అజ్ఞానాన్ని రూపుమాపే బల్లెం, చేపట్టి సాక్షాత్కరించిన స్వామి కొరకు.
ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆలయం చుట్టుపక్కలలోని జలాశయాలు
మార్చుమూర్తి (విగ్రహం), స్థలం (ప్రదేశం), తీర్థం (జలం), ఆలయ పవిత్రతను సంతరించుకొని ఉంటాయి. చిదంబరం ఆలయంలో, చుట్టుపక్కలలో పలు జలాశయాలు ఉన్నాయి.
- 40 ఎకరాలు (160,000 మీ2) మీదనున్న ఆలయ ప్రాంగణంలో ఆలయ కోనేరు - శివగంగ ఉంది. ఈ పెద్ద కోనేరు ఆలయంలోని మూడవ నడవలో, శివగామి అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంది.[3]
- చిత్ సభై యొక్క తూర్పు వైపున ఉన్న పరమానంద కూభం అనెడి బావి నుంచి ఆలయంలో చేసే పూజలకు అవసరమైన నీటిని తోడుకుంటారు.[4]
- చిదంబరానికి ఈశాన్య దిశగా బంగాళాఖాతం దగ్గరలోని కిల్లైలో నెలకొని ఉన్నది కుయ్య తీర్థం, దీని ఒడ్డుని పసమారుతన్తురై అని అంటారు.
- చిదంబరానికి దక్షిణంలో సుమారుగా ఒక కిలోమీటరు ఇంకొంచెం ఎక్కువ దూరంలో నెలకొని ఉన్నది పులిమాడు .
- చిదంబర ఆలయానికి పడమటి దిక్కులో, ఇలామై అక్కినార్ స్వామి ఆలయానికి అభిముఖంగా వ్యాఘ్రపథ తీర్థం నెలకొని ఉంది.
- చిదంబరం ఆలయానికి పడమటి దిక్కులో, అనంతేశ్వర ఆలయానికి ఎదురుగా అనంత తీర్థం నెలకొని ఉంది.
- అనంత తీర్దానికి పడమరగా నాగసేరి అనే కోనేరు ఉంది.
- చిదంబరం ఆలయానికి వాయవ్య దిక్కులోని తిరుకలాంజేరిలో బ్రహ్మ తీర్థం నెలకొని ఉంది.
- చిదంబరం ఆలయానికి ఉత్తరంలో, బ్రహ్మ చాముండేశ్వరి ఆలయానికి (అనగా తిల్లై కాళీ ఆలయం) అభిముఖంగా శివ పిరియై కోనేరు నెలకొని ఉంది.
- శివ పిరియైకి ఆగ్నేయంగా ఉన్న కోనేరు తిరుపర్కదాల్ .
శ్రీ గోవిందరాజ స్వామి విగ్రహం
మార్చుచిదంబరం ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్ స్వామి, ఆయన సతీమణి పుండరీగవల్లి తాయార్ విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ విగ్రహాన్ని 'తిల్లై తిరుచిత్రకూటం' అని అంటారు, ఇది 108 దివ్యదేశములు లేదా విష్ణువు యొక్క మూల విరాట్టులలో ఒకటి అని చెబుతారు, ఈ విగ్రహ ప్రతిష్ఠలను (మంగళ శాసనం) స్తోత్ర (నాలాయిర దివ్య ప్రబంధం) గానం చేస్తూ విష్ణువు యొక్క ప్రధాన ఉపాసకులు ( ఆళ్వారుల) చేస్తారు. తిల్లై చిత్రకూటాన్ని (ప్రస్తుతం గోవిందరాజ ఆలయంలో లేనిది) కులశేఖర ఆళ్వార్, తిరుమంగై మన్నన్ ఆళ్వార్ గానం చేశారు. ఇద్దరు ఆళ్వార్లు నమోదు చేసిన విషయప్రతిలో చిదంబర బ్రాహ్మణులు (దీక్షితార్లు) చిత్రకూటంలోని స్వామికి వేదానుసార, నిత్యపూజ (తమిళంలో "మురైయహ") లను ఆచరించేవారని తెలియజేశారు. అయితే, చాలా మంది యొక్క భావన ఏమనగా ఆళ్వార్లు సూచించిన చిత్రకూటం అనేది రాముడు, మహామునులైన విశ్వామిత్రుడు, అత్రి ఆశ్రమాల్లో గడిపిన కాలం నాటి UP లోనిదై ఉంటుందని భావించుట చేత, కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. కానీ ఇవి నిరుపయోగమైన వాదన మాత్రమే, ఎందుకనగా అజ్హ్వార్ల మంగళ శాసనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, భౌగోళిక స్థానాన్ని ఆధారం చేసుకొని ఒక క్రమంలోనున్న విగ్రహాలను వెల్లడి చేస్తుంది అంటే మహాబలిపురం (మామళ్ళపురం), తిరువాయింద్రపురం (కద్దలూర్ దగ్గరున్నది), చిదంబరం (తిల్లై చిత్రకూటం) సీర్గాజ్హి (కాజ్హిచిరమ విన్నాగరం), తిరునంగుర్ మొదలైనవి. వైష్ణవుల చారిత్రాత్మక వాదన ప్రకారం ఈ ఆలయం ప్రథమతః శ్రీ గోవిందరాజ స్వామి యొక్క నిలయం అని అంటారు ఎందుకనగా పరమ శివుడు, ఆయన సతీమణితో కలసి శ్రీ గోవిందరాజ స్వామి వద్దకు వచ్చి వారిరువురి మధ్య జరిపిన నృత్య పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని వేడుకొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఇందుకు అంగీకరించగా, వారిరువురి మధ్య జరిగిన నృత్య పోటీలో ఇద్దరూ సమవుజ్జీలుగా ఒకరి కొకరు తీసిపోకుండా నాట్యం చేస్తున్న సమయంలో, శివుడు, తాను గెలుచుటకు సలహా కొరకు శ్రీ గోవిందరాజస్వామిని సమీపించగా, శివుడిని కాలు ఎత్తి పెట్టి నిలిపి ఉంచుకొమ్మని ఉపాయం చెప్పాడు. కానీ నాట్య శాస్త్రం ప్రకారం ఈ భంగిమ స్త్రీలకు నిషేధించబడుట వలన పరమశివుడు చివరికి ఆ భంగిమలోనే నిలుచుట చేత పార్వతి తన యొక్క ఓటమిని అంగీకరిస్తుంది, అందు వలన ఆ ప్రదేశంలో పరమశివుడు ఆ నాట్య భంగిమలో కొలువై ఉన్నాడు. నాట్య వేదిక లేదా బహిరంగ ప్రదేశాన్ని సాధారణంగా అంబళం అని పిలుస్తారు. శ్రీ గోవిందరాజస్వామి న్యాయనిర్ణేతగా వ్యవహిరించడమే కాక పోటీకి సాక్షి కూడా. కానీ వీరశైవ రాజులైన కిరుమి కంద చోళుడు (2వ కులోతున్గన్ అని కూడా అంటారు) మున్నగువారు సాంస్కృతిక దాడి చేసిన తరువాత ఈ ప్రదేశం శైవుల పుణ్యక్షేత్రంగా మరింత ఖ్యాతికెక్కింది. దీక్షితులను బలవంతంగా శైవులుగా మార్పించారు (అప్పటి దాకా వైదిక వ్యవస్థను అనుసరిస్తున్న దీక్షితులు, శైవ ఆగమనాన్ని తెలుసుకోలేకపోయారు ఎందుకనగా శైవ ఆగమం వైదిక వ్యవస్థలో లేనిది, కానీ స్వతహాగా బ్రాహ్మణులు అగుట చేత, బ్రాహ్మణ ప్రతిపత్తిని వదులుకోకుండా భగవస్స్వరూపాన్ని మార్చుట చేత సరిపుచ్చుకున్నారు, అందుకని కేవలం దీక్షితుల వర్గం మాత్రమే శివాలయంలో వైదిక వ్యవస్థను అనుసరిస్తారు).
ఆలయ రూపకల్పన యొక్క ప్రాముఖ్యత
మార్చుఆలయ స్థాపత్యం (నిర్మాణశిల్పం), ఆవరణ యొక్క అమరిక జ్ఞాన సంబంధమైన భావాలతో సంపూర్ణమైనది.
- ఐదు పంచభూతస్థల ఆలయాల్లో మూడు ఆలయాలైనట్టి, కాళహస్తి, కాంచీపురం, చిదంబరంలలోని మూడు ఆలయాలు కచ్చితంగా ఒకే సరళ రేఖలో 79' 43" తూర్పు రేఖాంశంలో నిలిచి ఉండుట - నిజంగా సాంకేతిక, జ్యోతిష్శాస్త్రపరంగా,, భౌగోళికంగా అద్భుతం. మిగతా రెండు ఆలయాల్లో, తిరునైక్కవల్ దక్షిణానికి సుమారు 3 డిగ్రీలలో నెలకొనున్నది, ఈ దివ్య అక్షరేఖ యొక్క ఉత్తరపు మొనకి పడమరగా కచ్చితంగా 1 డిగ్రీలో ఉండగా, తిరువన్నామలై సుమారుగా మధ్యస్థంగా (దక్షిణానికి 1.5 డిగ్రీలో, పడమరకి 0.5 డిగ్రీలో) ఉంది.
- 9 ముఖద్వారాలు మానవ శరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి.
- గర్భగుడి అయినట్టి చిత్ సభై లేదా పొన్నాంబళం, హృదాయాన్ని సూచించగా, దాన్ని చేరుకొనుటకు ముందర భాగంలోని ఎత్తైన వేదిక - కనకసభై నుంచి 5 అంతస్తులైన పంచాత్చర పది - పంచ అర్ధం 5, అచ్చర – నాశనరహితమైన అక్షరాలు – "శి వ య న మ", లను సోపానాలను అధిగమించవలెను. వేదిక యొక్క ప్రక్కల నుంచి సభై (మందిరం) కి ప్రవేశం ఉన్నది (చాలా ఆలయాల్లో ఉన్నట్లుగా ముందు నుంచి కాదు).
- పొన్నాంబలం లేదా గర్భగుడి 28 స్తంభాలతో కట్టి ఉండి - 28 ఆగమాలు లేదా పరమ శివుని పూజ కొరకు ఏర్పరచిన ఆచార పద్ధతులను సూచిస్తుంది. పై కప్పుని 64 దూలాలతో కట్టగా అవి 64 కళలను సూచిస్తాయి, అనేక అడ్డ దూలాలు అసంఖ్యాకమైన రక్తనాళాలను సూచిస్తాయి. పైకప్పు మీద శివాయనమ అను నామం చెక్కబడి ఉన్న 21600 బంగారపు పలకలు 21600 శ్వాసలను సూచిస్తాయి. ఈ బంగారపు పలకలను బిగించుటకు ఉపయోగించిన 72000 బంగారపు మేకులు మానవ శరీరంలోని నాడుల సంఖ్యని సూచిస్తుంది. పై కప్పు మీద ఉంచబడిన 9 పవిత్రమైన బిందెలు లేదా కలశాలు, 9 శక్తి స్వరూపాలను సూచిస్తాయి. (ఉమాపతి శివం యొక్క కుంచితాంగ్రిస్థవంలో చూడండి)
- మహరాష్ట్రలోని సతార నగరములోని ఆదిత్యనగరిలో యున్న శ్రీ ఉత్తర చిదంబరం నటరాజ మందిరం ఈ ఆలయానికి నకలు వంటిది.
ఆలయ రథం
మార్చుతమిళనాడులోని ఆలయాలలోకెల్లా చిదంబరం ఆలయ రథం ఎంతో అందమైనది. ఏడాదిలో రెండు సార్లు నటరాజస్వామి ఊరేగే ఈ రథాన్ని, ఉత్సవాల సమయంలో వేలాది భక్తులు లాగుతారు.
శివాలయం యొక్క నిర్మాణం - చిత్ & అంబరం వివరణ
మార్చుఆగమ సూత్రాల ప్రకారంగా సశాస్త్రీయమైన శివాలయానికి ఐదు ప్రాకారాలు ఉండి ఒకదానిని మరోకటికి కలుపుతూ గోడలు ఉంటాయి. అంతర్గతంగానున్న ప్రాకారం తప్ప వెలుపలి ప్రాకారాలు ఆకాశానికి బహిర్గతమవుతాయి. అంతర్గతంగా ఉన్నదానిలో మూల విగ్రహం, ఇతర విగ్రహాలు కొలువై ఉన్నాయి. చెక్క లేదా రాయితో చేయబడిన పెద్ద ధ్వజ స్తంభం సరిగ్గా మూల విరాట్టుకి అభిముఖంగా ఉంటుంది.
అంతర్గత ప్రాకారంలో గర్భగుడి (తమిళంలో కరువరై) నెలకొని ఉంది. అందులో పరమశివుడు కొలువై ఉన్నాడు.
శివాలయం యొక్క నిర్మాణం వెనుకనున్న ప్రతీకాత్మకత
- ఆలయం యొక్క కట్టుబడిలో మానవ శరీరంలోని అన్ని సూక్ష్మాలతో పోలిక కనబడుతుంది.
- ఒకదానితో మరొకటి చుట్టుకొనిన ఐదు ప్రాకారాలు మానవ ఉనికి యొక్క కోశాలు (తొడుగులు):
- అన్నింటి కంటే వెలుపలనున్నది అన్నమయ కోశం, ఇది భౌతిక శరీరానికి ప్రతీక.
- రెండవది ప్రాణమయ కోశం, ఇది మూలాధార శక్తి యొక్క తొడుగు లేదా ప్రాణానికి ప్రతీక.
- మూడవది మనోమయ కోశం, ఇది మనోభావాల యొక్క తొడుగు, మనస్సు యొక్క ప్రతీక.
- నాలుగవది విజ్ఞ్యాన మాయా కోశం, ఇది విజ్ఞానం యొక్క తొడుగుకి ప్రతీక.
- ఐదవది, అంతర్గతమైనది ఆనంద మాయా కోశం, ఇది మహదానందం యొక్క తొడుగుకి ప్రతీక.
- ఆనంద మాయా కోశపు తొడుగుకి ప్రతీకైన ప్రాకారంలో ఉన్న గర్భగుడిలో, స్వామి కొలువై ఉన్నాడు, మనలో జీవుడు ఉన్నట్టుగా. హృదయం లోపల అన్ని వైపుల నుంచి మూయబడి ఉన్నట్లు మాదిరిగా, గర్భగుడి వెలుగుపడని అంతరాళం అని గ్రహించవచ్చు.
- ప్రవేశ గోపురాలు, ఒక వ్యక్తి వెల్లకిలా పడుకొని ఉన్నట్లుగా అగుపడుటతో, వాటిని పాదాలతో పోలుస్తారు.
- మూలాధారం (వెన్ను యొక్క మట్టం) నుంచి సహస్రం (శిరస్సులోని శీర్షం) వరకు లేచి ఉన్న ధ్వజ స్తంభం సుషుమ్న నాడిని ప్రదర్శిస్తుంది.
- కొన్ని ఆలయాలకు మూడు ప్రాకారాలు ఉంటాయి. అక్కడ అవి స్థూలం, మానవుడి యొక్క సూక్ష్మాండ కరణ శరీరాలను సూచిస్తాయి. కొన్ని ఆలయాలకి కేవలం ఒకటే ఉండి మొత్తం ఐదింటినీ సూచిస్తుంది.
చిదంబరం ఆలయం, దాని ప్రతీకాత్మకత
చిదంబరంతో పెనవేసుకుపోయిన పుణ్య పురుషుడైన తిరుమూలర్ పురాణాన్ని, అతని తిరుమంతిరంలో చెబుతాడు.
திருமந்திரம்
- மானுடராக்கை வடிவு சிவலிங்கம்
- மானுடராக்கை வடிவு சிதம்பரம்
- மானுடராக்கை வடிவு சதாசிவம்
- மானுடராக்கை வடிவு திருக்கூத்தே
తెలుగులోకి అనువదిస్తే:
- మనుదరక్కై వడివు శివలింగం
- మనుదరక్కై వడివు చిదంబరం
- మనుదరక్కై వడివు సదాశివం
- మనుదరక్కై వడివు తిరుక్కూతే
అర్ధం: "మానవ శరీరం యొక్క స్వరూపమే శివలింగం; అలాగే చిదంబరం; అలాగే సదాశివం; , అలాగే అతని దివ్య నృత్యం".
- ఆలయానికి తొడుగులను పోలిన ఐదు ప్రాకారాలు ఉన్నాయి.
- బంగారపు పైకప్పు కలిగిన చిత్ సభ (మందిరం) అని పిలువబడే గర్భగుడి నుంచి నటరాజ స్వామి దర్శనమిస్తాడు.
- కప్పు మీద 26,000 బంగారపు పలకలు (చిత్రం చూడండి) కలిగి, ఒక రోజులో ఒక వ్యక్తి తీసే శ్వాసల సంఖ్యని సూచిస్తుంది.
- ఈ పలకలను చెక్కతో చేసిన పైకప్పుకి బిగించుటకు ఉపయోగించిన 72,000 మేకులు నాడుల సంఖ్యని సూచిస్తాయి (శరీరంలోని వివిధ అవయవాలకు శక్తిని చేరవేసే నరాలు)
- శరీరంలో గుండె ఎడమ వైపుకి ఉన్నట్లుగా, చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడమ వైపుగా ఉంటుంది.
- చిత్ సభ కప్పు మీద ఉన్న తొమ్మిది కలశాలు (రాగితో చేయబడినవి) - తొమ్మిది శక్తులను ప్రదర్శిస్తుంది.
- కప్పుకి 64 అడ్డ దూలాలు ఉండి 64 కళలను సూచిస్తాయి.
- అర్ధ మండపానికి ఉన్న ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలను సూచిస్తాయి
- అర్ధ మండపానికి ప్రక్కనున్న మండపానికి పద్దెనిమిది స్తంభాలు, పద్దెనిమిది పురాణాలకి ప్రతీక.
- కనక సభ నుంచి చిత్ సభకి దారి తీయు ఐదు మెట్లు సూచించేది
ఐదు అక్షరాల పంచాక్షర మంత్రం (న మ శి వ య) - చిత్ సభ పైకప్పుకి ఊతమిచ్చే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు.
నటరాజ స్వామి ప్రతీకాత్మకత
- నటరాజ స్వామి యొక్క నృత్యం ఐదు దివ్య కార్యాలను సూచిస్తుంది, అవి:
- సృష్టి- నటరాజు యొక్క ఒక కుడి చేతిలో ఢమరుకం అని పిలువబడే చిన్న డోలు ఉంటుంది. ఈశ్వరుడు అంటే నాథ బ్రహ్మ. ఆయన అన్ని శబ్దాల (నాదం) కు మూలం.ఇది విశ్వ వృక్షం యొక్క ఆవిర్భావానికి విత్తనం.
- రక్షణ (కార్యకలాపాలు) - మరొక కుడి చేతితో చూపెడుతున్న 'అభయముద్ర', కి అర్ధం ఆయన దయగల రక్షకుడు.
- నిర్మూలన; ఎడమ చేతులలో ఒకదానికి ఉన్న నిప్పు, నిర్మూలనకి ప్రతీక.అన్నింటినీ అగ్ని నాశనం చేయగా మిగిలే బూడిదని, స్వామి తన శరీరానికి రాసుకొంటాడు.
- క్రింద ఉంచిన పాదం దాచి ఉంచే కార్యాన్ని సూచిస్తుంది.
- ఎత్తిన పాదం అర్పించే కార్యాన్ని సూచిస్తుంది.
- నటరాజస్వామికి ఎడమ ప్రక్కన దేవీ శివకామ సుందరి విగ్రహం ఉంటుంది. ఇది అర్ధనారీశ్వర, ' ఎడమ భాగంలో స్త్రీని కలిగి ఉన్న స్వామి'కి ప్రతీక. ఆయనకి కుడి ప్రక్కన ఒక తెర ఉంది. దీపారాధన సమయంలో దీపాలను స్వామికి, ఎడమ వైపుకి చూపెడతారు, అప్పుడు తెరని తొలగించగా ఐదు నిట్టనిలువుగా వ్రేలాడుతున్న బంగారపు విల్వ పత్రాల యొక్క వరుసలు కనబడతాయి. వాటికి వెనుక ఏమీ కనబడదు. శివకామి సగుణ బ్రాహ్మణుడైన (ఆకారం కలిగిన భగవంతుడు) నటరాజుని చూపుతుంది. సగుణ బ్రాహ్మణుడు, మనల్ని నిర్గుణ బ్రాహ్మణుడి (నిరాకార స్వరూపుడైన భగవంతుడు లేదా నిరాకారత్వాన్ని తన రూపంగా కల భగవంతుడు) కి దారి తీస్తుంది. దీనినే 'చిదంబర రహస్యం' అని దీక్షితార్లు, సనాతనంగా ఉన్న ఆలయ పూజారులు చెబుతారు.
- శివుని యొక్క నృత్యాన్ని విశ్వ నృత్యమని పండితులు పిలుస్తారు. చిదంబరంలో, ఈ నృత్యాన్ని 'ఆనంద తాండవ' అని అంటారు.
- శ్రీ మహావిష్ణువు కూడా ఈ దివ్య నృత్యాన్ని వీక్షించాడు. దగ్గరలోనున్న చిత్రకూట మంటపంలో, మహా విష్ణువు, యోగనిద్ర భంగిమలో శేషసాయితల్పం మీద శయనించి దర్శనమిస్తాడు. నారాయణుడికి ఎదురుగానున్న ఒక చిన్న పద్మం చెక్కబడిన రాతిపలక మీద నుంచుని చూస్తే తన కుడి చేతి పక్కన నటరాజుని కూడా చూడవచ్చు.
- చిదంబరంలో నటరాజు యొక్క నృత్యాన్ని పతంజలి, తిరుమూలర్ వంటి యోగులు కూడా చూశారు. వాటి యొక్క చిత్రాలు చిత్ సభ యొక్క వెండి తలుపుల మీద చిత్రించబడి ఉంటాయి.
చిదంబర రహస్యం
మార్చుచిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. స్వామి తన సతీమణి శక్తి లేదా శివగామితో కలసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో "ఆనంద తాండవ" నృత్యాన్ని నిరంతరంగా చేస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వ్రేలాడదీసిన బంగారు 'బిల్వ' పత్రాల వరుసలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి. తెరకి బైట వైపు నల్లగా ఉండి (అజ్ఞానాన్ని సూచిస్తుంది), లోపలి వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి (జ్ఞానాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది).
రోజు వారీ క్రతువులలో, ఆ రోజు ప్రధాన పూజారి, తనని తాను భగవత్స్వరూపుడిగా - శివోహం భవ (శివ - దైవం, సంధి రూపంలో - శివో-, అహం – నేను /మనం, భావ - మనస్థితి), భావిస్తూ తెరని తొలగించుట, అజ్ఞానాన్ని పారద్రోలుటను, ప్రదేశాన్ని వెల్లడి చేస్తూ స్వామి సమక్షాన్ని సూచిస్తుంది.
చిదంబర రహస్యం అనగా, ఆ సమయంలో భగవంతుడికి పూర్తిగా లొంగి, ఆయనను మనలో లీనం చేసుకొని, అజ్ఞానాన్ని తొలగించుకొని, భగవంతుడి సమక్షాన్ని 'చూసి, అనుభవించి' అందువలన కలిగే బ్రాహ్మానందాన్ని పొందుతారు.
ఆలయ పరిపాలన , రోజువారి క్రతువులు
మార్చుఆలయం నిర్వహణ, పరిపాలన చేసేది చిదంబరం దీక్షితార్ అనువంశీయులు - వైదిక బ్రాహ్మణులలోని ఒక తరగతి వారు, ప్రముఖులు చెప్పినదాని ప్రకారం, ముఖ్యంగా చిదంబరం ఆలయం లోని రోజువారి ఆచార వ్యవహారాలకు, నిర్వహణ కొరకు, వారిని పుణ్య పురుషుడైన పతంజలి, కైలాస్ మఠం నుంచి ఇక్కడకు తీసుకు వచ్చారు.
దీక్షితార్ల సంఖ్య 3000 వుండవలసినది ( 2999 కచ్చితంగా, భగవంతునితో కలిపి మొత్తం 3000), వారిని తిల్లై మూవయరం అని పిలుస్తారు. ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 360. పరమేశ్వరుని పూజించే విషయంలో ఈ దీక్షితార్లు వైదిక క్రతువులను పాటిస్తారు, శివచారియర్స్ లేదా ఆధిశైవర్స్ ఆగమ క్రతువులను పాటిస్తారు. ఆలయంలో పాటించే క్రతువులు వేదాల నుంచి తీసుకున్నారు, వాటిని ఏర్పరచినది పతంజలి, పరమేశ్వరుని, నటరాజ స్వామిగా ఆరాధించమని దీక్షితార్లను ఏర్పరచినది ఆయనే అని చెప్పబడుతుంది.
సాధారణంగా, వివాహం అయిన దీక్షితార్ల వంశములోని పురుషులకు, ఆలయంలోని క్రతువులను నిర్వహించే అవకాశం వరుసలో వస్తుంది, ఆరోజుకు వారే ప్రధాన అర్చకులు. వివాహమైన దీక్షితార్లకు ఆలయ ఆదాయంలో భాగం లభిస్తుంది. ఆలయానికి వున్న దరిదాపు 5,000 ఎకరాలు (20 కి.మీ2) సారవంతమైన భూమి మాన్యాన్ని, శతాబ్దాలుగా వివిధ రాజులు పోషిస్తూ వచ్చారు, ప్రస్తుతం మాన్యాన్ని, దాదాపుగా స్వంత వ్యక్తులే నిర్వహిస్తున్నారు.
ఆ రోజుకి ప్రధాన అర్చకుడుగా వున్న వ్యక్తి, తనను తాను పరిశుభ్రం చేసుకొనే క్రతువులను పాటించి, తనను తాను శివునికి అర్పించు కొంటున్నాను అనే భావంతో, ఆలయ ప్రవేశం చేసి, రోజువారి క్రతువులను చేయాలి. రోజు ప్రారంభంలో, స్వామి పాదుకలను పల్లియరై (లేదా శయన మందిరం) నుంచి ఉదయం 7 గంటలకు గర్భ గుడికి, భక్తుల మేళతాళాలతో పల్లకిలో తీసుకు వస్తారు. పూజారి రోజువారి క్రతువులను యజ్ఞంతో, 'గోవు పూజతో' (ఆవును, దూడతో సహా పూజించడం) ప్రారంభిస్తారు.
రోజుకి 6 సార్లు పూజ చేస్తారు. ప్రతి పూజకి ముందు, స్ఫటిక లింగం - 'ఆరు ఉరువ' లేదా పరమ శివుడి యొక్క అర్ధరూప స్థితికి నెయ్యి, పాలు, పెరుగు, బియ్యం, గంధం,, భస్మంతో అభిషేకిస్తారు. దీని తరువాత స్వామికి నైవేద్యం సమర్పించి, వేద మంత్రోచ్చారణల మధ్య, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే తమిళంలోని 12 రచనల నుంచి తీసిన 5 పద్యాలు) చదువుతూ, వివిధ రకాల అలంకారం చేసిన దీపాలతో, దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి యొక్క తెరను లాగి చిదంబర రహస్యాన్ని వెల్లడి చేయుటతో పూజ ముగుస్తుంది.
2వ పూజకి ముందు, క్రమం తప్పకుండా చేసే స్పటిక లింగ అభిషేకం కాకుండా, రత్న నటరాజ విగ్రహానికి (రతినసభాపతి) కూడా అభిషేకం చేస్తారు. 3వ పూజ సుమారుగా 12.00 గంటలకు ఉండగా, దాని తరువాత ఆలయం మధ్యాహ్నం 4:30pm వరకు మూసి ఉంచుతారు. 4వ పూజ 6.00pm కి చేస్తారు, 5వ పూజ 8:00pm,, చివరి పూజ 10:00pm కి చేస్తారు, దాని తరువాత స్వామి యొక్క పాద రక్షలను ఆ రాత్రికి 'శయనించుటకు' ఊరేగింపుగా తీసుకు వెళతారు. రాత్రి చేసే 5వ పూజకి ముందు, పూజారి చిదంబర రహస్యంలోని యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించటం వంటి కొన్ని ప్రత్యేక క్రతువులను చేస్తాడు.
చిదంబరంలో, రోజులో చేసే చివరి పూజని అర్థజామ పూజ అని అంటారు, దీనిని అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. రాత్రికి శయనించేటపుడు స్వామిలోకి విశ్వంలోని సమస్త దివ్య శక్తులు వచ్చి శయనిస్తాయని నమ్ముతారు.
ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వం T.N. HR & CE చట్టం యొక్క సెక్షన్ 45 క్రింద తన ఆధీనంలోకి తీసుకొంది. అయితే, పొదు దీక్షితార్లు దీనిని ప్రతిఘటించారు. మద్రాస్ హైకోర్టు 1951లో పొదు దీక్షితార్లను మతపరంగా ఒక వర్గమని గుర్తించింది. భారత రాజ్యాంగం యొక్క 26వ అధికరణం, T.N.HR & CE చట్టం యొక్క 107 సెక్షన్ ప్రకారం మతపరమైన వర్గాల యొక్క పాలనలోకి మధ్యవర్తిత్వం నిషేధించడమైనది కనుక ఈ వర్గానికి తమ పాలనను కొనసాగించే అర్హత ఉన్నదని విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం ప్రస్తుతం (2010 ఏప్రిల్) సుప్రీం కోర్టు ముందర ఇంకా జరుగుతూ ఉంది. HR & CE కమీషనర్ నియమించిన కార్యనిర్వాహక అధికారికి బాధ్యతలను అప్పగించటానికి పొదు దీక్షితార్లు నిరాకరించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలో కార్యనిర్వాహక అధికారి హుండీలను ఏర్పాటు చేసాడు. అతను ఎత్తైన ఆధునిక దీపాలను కూడా ఈ స్థలంలో ఏర్పాటు చేశాడు. అతను అర్చన టిక్కెట్లు, దర్శన టిక్కెట్లను ప్రవేశ పెట్టుటకు ఆలోచన చేస్తున్నాడు. ఇట్టి చర్యలు అన్నింటినీ పొదు దీక్షితార్లు, భక్తులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, నిత్య క్రతువుల యొక్క నిర్వహణని ఇంకా దీక్షితార్లు కొనసాగిస్తున్నారు.
పండుగలు
మార్చుమానవులకు సంబంధించిన పూర్తి ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు. కేవలం ఒక రోజులో 6 పూజలు మాత్రమే గర్భగుడిలో చేస్తారు, సంవత్సరానికి ఒకసారి 6 అభిషేకాలు ప్రత్యేక రోజులలో ప్రధాన దేవతైన నటరాజ స్వామికి చేస్తారు. అవి మర్ఘజ్హి తిరువాధిరై (డిసెంబరు - జనవరి లో) మొదటి పూజని సూచిస్తుంది, నెలవంక తరువాత 14 వ రోజు (చతుర్దశి) మాసి నెలలో (ఫిబ్రవరి - మార్చి) రెండవ పూజను సూచిస్తుంది, చిట్టిరై తిరువోణం (ఏప్రిల్ - మే లో) మూడవ పూజను లేదా ఉచి కాలాన్ని సూచిస్తుంది, ఉతిరం అఫ్ ఆని (జూన్ - జూలై), ఆని తిరుమంజనం అని కూడా పిలువబడుతుంది, సాయంత్రాన్ని లేదా నాలుగవ పూజను సూచిస్తుంది, ఆవనిలో చతుర్దశి (ఆగస్టు - సెప్టెంబరు) ఐదవ పూజను సూచిస్తుంది, పురటసి నెలలోని చతుర్దశి (అక్టోబరు - నవంబరు) ఆరవ పూజ లేదా అర్తజమను సూచిస్తుంది.
వీటిలో మర్ఘజ్హి తిరువాధిరై (డిసెంబరు-జనవరి), ఆని తిరుమంజనం (జూన్ -జూలై) చాలా ముఖ్యమైనవి. వీటిని కీలక ఉత్సవంగా నిర్వహిస్తారు, దీనిలో ముఖ్యమైన దేవత విగ్రహాన్ని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకు వచ్చి, రథంలో ఊరేగించి, తరువాత అభిషేకిస్తారు. లక్షలాది ప్రజలు గుంపుగా ఆలయానికి వచ్చి, అభిషేకం ఉత్సవాన్ని, విగ్రహాన్ని తిరిగి గర్భగుడిలోకి తీసుకువెళ్ళేటప్పటి దేవుని ఆగమ ప్రధానమైన నృత్యాన్ని చూస్తారు. ఉమాపతి శివం యొక్క 'కున్చితాన్గ్రిస్తావం' లో మాసి ఉత్సవంలో కూడా దేవుని ఊరేగిస్తారని పేర్కొన్నారు కాని ఈ రోజులలో దానిని పాటించడం లేదు.
చారిత్రక సూచనలు
మార్చుమూలాలు
మార్చుదక్షిణ భారతదేశంలో వున్న చాలా ఆలయాలు సజీవ స్మారక కట్టడాలు, అనగా, ప్రారంభమైన నాటినుంచి ప్రార్థనలు జరుగుతూ వున్నాయి, భక్తులు క్రమం తప్పకుండా దర్శిస్తూ వుంటారు, క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు.
పురాణాల (చరిత్ర మాటల ద్వారా పయనించి తరువాత వ్రాయబడ్డది) ప్రకారం దైవ సమానుడగు పులికాల్మునివర్, సిమ్మవర్మన్ రాజు ద్వారా విశేషమైన ఆలయ నిర్మాణాలు గావించాడు. పల్లవ రాజులలో, సిమ్మవర్మన్ పేరుతొ ముగ్గురు రాజులు కలరు (275-300 క్రీశ, 436-460 క్రీశ, 550-560 క్రీశ). కవి-పుణ్య పురుషుడగు తిరునావుక్కరసర్ కాలం నాటికే ఈ ఆలయం ప్రాచుర్యం పొందినది. (అతని కాలం అటు ఇటుగా సుమారు 6 శతాబ్దం), సిమ్మవర్మన్ జీవించినది బహుశ క్రీశ 430-458 అనగా సిమ్మవర్మన్ II. పట్టయం లేదా కొత్త్రవంకుడి లోని రాగి రేకుల మీది శాసనాలు దీనిని ధ్రువపరుస్తున్నాయి. అయితే పల్లవ కాలంనాటి తన్దంతోట్ట పట్టయం, ఇతర పట్టయంల ద్వారా సిమ్మవర్మన్ కు చిదంబరం ఆలయంనకు అనుబంధం ఉంది. అందువలన, సిమ్మవర్మన్ పల్లవ రాజని, తరువాత రాజరికాన్ని వదలి చిదంబరం వచ్చి నివసించాడని నమ్ముతారు. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ లు సమకాలీలు అగుటచే, ఈ ఆలయనిర్మాణం ఆ కాలంలో జరిగి ఉంటుందని భావిస్తూవుంటారు.
అయితే, నిజం ఏమిటంటే, కవి-పుణ్య పురుషుడగు తిరునావుక్కరసర్ కంటే చాలా కాలంముందే, కవి-పుణ్య పురుషుడగు మణిక్కవసాగర్ నివసించి, చిదంబరంలోనే పరమానందాన్ని పొందాడు, నటరాజ స్వామి విగ్రహం, అసమానమైన భంగిమ, ఆకారం, ఆ కాలం నాటి ఇతర పల్లవుల పనులతో పోల్చలేనిది, సిమ్మవర్మన్ కాలం నుండి ఆలయం వున్నది, తరువాతి కాలంలో పులికాల్మునివర్ పేరుతొ ఇంకొక పుణ్య పురుషుడు ఉండడానికి అవకాశం ఉంది.
నియమిత కాల వ్యవధులలో (సాధారణంగా 12 సంవత్సరంలకు ఒకసారి), పెద్ద మరమ్మత్తులు, పునర్నిర్మాణాన్ని చేబడతారు, కొత్త వసతులను ఏర్పరచి, సమర్పిస్తారు. చాలా పురాతన ఆలయాలు కాలం గడిచేకొద్దీ, ఆలయ బాధ్యత తీసుకొన్న రాజుల వలన పెరిగి, కొత్త వసతులను, ఎక్కువ బయటి వసారాలను, కొత్త గోపురాలను (పగోడాలు) ఏర్పరుచుకొంటాయి. ఈ ప్రక్రియలు ఆలయాలను, పురావస్తు, చారిత్రిక కట్టడాలుగా మాత్రమే కాకుండా, సజీవ పూజ్య స్థలాలుగా ఉంచడానికి దోహదం చేశాయి, ఉద్దేశ్యపూర్వకంగా చేయనప్పటికీ, ఈ పునర్నిర్మాణాల ఆలయ ప్రణాళికతో అసలు కట్టడాలు సరితూగకపోతే, కొంత అసలు కట్టడం నాశనం కావచ్చు.
ఈ సాధారణ పోకడకు, చిదంబరం ఆలయం కుడా మినహాయింపు కాదు. మూలాలు, ఆలయ అభివృద్ధి గురించిన సమాచారం చాలా భాగం, సాహిత్యం, కవిత్వం యొక్క రచనల నుంచి రాబట్టినవి, తరతరాలుగా దీక్షితార్ సమాజంలో నోటితో చెప్పబడిన విషయాల ద్వారా, కొంత భాగం, ఇప్పటికీ వున్న శాసనాలు, చేతి వ్రాతల రచనల ద్వారా తెలుస్తుంది.
ఈ పురాతన పుణ్య క్షేత్రానికి చోళులు గొప్ప భక్తులని సంగం సాహిత్యం ద్వారా మనకు తెలుస్తుంది. తిల్లై బంగారు మందిరంలో చోళ రాజు సుభదేవన్, కమలాదేవి పూజ చేసిన తరువాతనే చోళ రాజు కోచెంగన్నాన్ జన్మించినట్లు చెబుతారు. అందువలన ఆలయంలో వున్న బంగారు మందిరం వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్లుగా చెబుతారు.
ఆ ఆలయ స్థాపత్యం, ముఖ్యంగా గర్భగుడి గోపురం చోళుల, పాండ్యుల, పల్లవుల ఇతర ఆలయాల లాగా వుండదు. కొంతవరకు, ఈ నిర్మాణం చేర రాజుల ఆలయాలను పోలి వుంటుంది, కాని చేర రాజ్యవంశం, కవి-పుణ్య పురుషుడగు సుందరర్ (సుమారు 12 వ శతాబ్దం) కాలం నాటిదని ఇప్పటివరకు లభించిన ఆధారాల ద్వారా తెలుస్తోంది. చిదంబరం ఆలయానికి సంబంధించిన పనుల వివరాలు దురదృష్టవశాత్తు 10 వ శతాబ్దం తరువాతనుంచి మాత్రమే లభిస్తున్నాయి.
శాసనములు
మార్చుగుడిలో చాలా శాసనములు లభించాయి, చిదంబరం గుడి గురించిన శాసనాలు చుట్టూ ప్రక్కల ప్రదేశాలలో ఉన్నాయి.
చాలా శాసనాలు క్రింది కాలానికి సంబంధించినవి:
తరువాతి చోళ రాజులు
మార్చు- రాజరాజ చోళ I 985-1014 క్రీశ (CE), తంజావూర్ పెద్ద గుడి కట్టించినవాడు
- రాజేంద్ర చోళ I 1012-1044 క్రీశ, జయంకొండంలో గంగైకొండచోలపురం గుడిని కట్టించినవాడు.
- కులోతుంగా చోళ I 1070-1120 క్రీశ
- విక్రమ చోళ 1118-1135 క్రీశ
- రాజతిరాజ చోళ II 1163 -1178 క్రీశ
- కులోతుంగా చోళ III 1178-1218 క్రీశ
- రాజరాజ చోళ III 1216-1256 క్రీశ
పాండ్య రాజులు
మార్చు- త్రిభువన చక్రవర్తి వీరపాండ్యన్
- జటావర్మన్ త్రిభువన చక్రవర్తి సుందరపాండ్యన్ 1251-1268 క్రీశ
- మారవర్మన్ త్రిభువన చక్రవర్తి వీర కేరళనాగియ కులశేఖర పాండ్యన్ 1268-1308 క్రీశ
పల్లవ రాజులు
మార్చు- అవని ఆల పిరందాన్ కో-ప్పెరుం-సిన్ఘ 1216-1242 క్రీశ
(ప్రపంచాన్ని పాలించుటకు పుట్టినవాడు, గొప్ప రాజ్య సింహం దేవుడు)
విజయనగర రాజులు
మార్చు- వీరప్రతాప కిరుట్టిన తేవ మహారాయర్ 1509-1529 క్రీశ
- వీరప్రతాప వెంకట దేవ మహారాయర్
- శ్రీ రంగ తేవ మహారాయర్
- అచ్చుత దేవ మహారాయర్ (1529-1542 క్రీశ)
- వీర భూపతిరాయర్
చేర రాజులు
మార్చు- చేరమాన్ పేరుమల్ నయనార్ వారసులు, రామవర్మ మహారాజ.
గోపురములు
మార్చుదక్షిణ గోపురం ను నిర్మించినది ఒక పాండ్య రాజు. దీనికి గుర్తు, గోపుర పైభాగాన చెక్కబడిన పాండ్య రాజుల చేప చిహ్నం. చరిత్ర ప్రకారం, ఒక వేళ పాండ్య రాజులు గోపురాన్ని పూర్తిగా నిర్మిస్తే రెండు చేపలు ఎదురెదురుగా వుండునట్లు చెక్కిస్తారు (, గోపుర నిర్మాణం అసంపూర్తిగా వున్నట్లయితే ఒక చేప మాత్రమే వుంటుంది). దక్షిణ గోపురం పాండ్యుల రెండు చేపల చిహ్నాన్ని కలిగి వుంటుంది.
తదుపరి, మొదటి అంతస్తును వుంచి, పల్లవ రాజైన కోపెరున్సిన్గాన్ సా. శ, I 1216-1242 గోపురాన్ని తిరిగి నిర్మించాడు. ఈ గోపురం సోక్కసీయాన్ తిరునిలై ఎజ్హు గోపురం అని పిలువబడుతుంది.
పడమటి గోపురం ను నిర్మించినది జడవర్మన్ సుందర పాండ్యన్ సా. శ, I 1251-1268
ఉత్తర గోపురం ను నిర్మించినది విజయనగర రాజైన కృష్ణ దేవరయర్ సా. శ, 1509-1529
మొదట తూర్పు గోపురం ను నిర్మించినది పల్లవ రాజైన కోపెరున్సిన్గాన్ సా. శ, II 1243-1279
తదుపరి మరమ్మత్తులు చేయించినది ప్రముఖ దాత పచయప్ప ముదలియార్ అత్తగారైన సుబ్బంమల్ . పచయప్ప ముదలియార్, అతని భార్య ఇయలంమల్ విగ్రహాలను తూర్పు గోపురం మీద చెక్కించారు. గుడిలో జరిగే అనేక ఉత్సవాలను పచయప్ప ట్రస్ట్ నిర్వహిస్తుంది, గుడి రథాన్ని పోషిస్తుంది.
చిట్ సభ పై కప్పుకు బంగారు పూత పూయించినది చోళ రాజైన పరంతక I (907-950 క్రీశ) అని చెప్పబడుతుంది ("తిల్లైయంబలత్హుక్కు ఫోన్ కూరై వెఇయ్న్థ తేవన్") . ఈ గుడికి ముఖ్య దాతలు అని చెప్పబడ్డ రాజులు: పరంథక II రాజు, రాజరాజ చోళ I, కులోతుంగా చోళ I. రాజరాజ చోళుని కుమార్తె అగు కుందవై II కూడా ఈ ఆలయమునకు బంగారం, ధనమును సమర్పించినది అని చెప్పబడుతుంది. తరువాత చోళ రాజైన విక్రమ చోళుడు (క్రీశ 1118-1135), ప్రతి రోజు ధూప, దీప నైవేద్యాల కొరకు అనేక దానాలను చేసాడు.
గుడికి, బంగారం, ఆభరణాలను విరాళంగా ఇచ్చిన దాతలలో అనేక రాజులు, పాలకులు, రక్షకులు కలరు, వారిలో పుదుకోట్టై మహారాజు, శ్రీ సేతుపతి (పచ్చల హారం విగ్రహానికి ఇప్పటికీ అలంకరించబడుతోంది), బ్రిటిష్ మున్నగువారు.
దాడులు
మార్చుఉత్తర భారతం లోని అనేక గుడులు చాలా మంది విదేశీ దండయాత్రదారుల చేత నాశనం చేయబడ్డాయి, వాటితో పోలిస్తే దక్షిణ భారతంలోని ఆలయాలు శతాబ్దాల నుంచి ప్రశాంతంగా ఉన్నాయి. ఆలయాలు దక్షిణ భారతదేశంలో వికసించడానికి అది ఒక ముఖ్యకారణం. అయితే, ప్రశాంత చరిత్ర, చిన్న చిన్న యుద్ధాలు లేకుండా లేదు. కొన్ని చారిత్రిక ప్రసక్తుల ప్రకారం, క్రీశ 1597 లో విజయనగర రాజ్య సైనికాధికారి గోవిందరాజ ఆలయమును విస్తరించినప్పుడు, చాలా మంది గుడి దీక్షితార్లు ఎత్తైన గుడి గోపురంలనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారి పూజనీయమైన, ప్రియతమ ఆలయం నాశనం చేయబడటం చూడటం కంటే చావే నయమనుకున్నారు. దీనిని గ్రంథస్తం చేసినది యూదుల పూజారైన యాత్రికుడు ఫాదర్ పిమెంత.
చాలా సందర్భాలలో, దండయాత్రలనుంచి రక్షించుకొనడం కొరకు, దీక్షితార్లు, ఆలయాన్ని మూసివేసి, విగ్రహాలను చాలా రక్షణతో కేరళ లోని అలపుజ్హకు తీసుకోని వెళ్ళేవారు. దండయాత్ర భయం తగ్గగానే తిరిగి వచ్చేవారు.
- జ్ఞాన సంబంధమైన అర్ధం, సవిస్తారమైన నిర్మాణాన్ని తీసుకొన్నది శ్రీ ఉమాపతి శివం యొక్క 'కుంచితంగ్రిస్తావం' లోని 'నటరాజస్తవమంజరి', చిదంబరం, నటరాజ స్వామి మీద వ్రాయబడిన వున్నత శ్రేణి కావ్యం.
- చిదంబరం లోని నాట్యం చేస్తునట్లుండే విశ్వరూప పరమశివుని గురించిన చరిత్ర, వివరణను తీసుకొన్నది 'అడల్వల్లన్ - అడల్వల్లన్ గురించి పురాణాలు, యంత్రాలు, పూజలు, శిల్పాలు, నాట్య శాస్త్రాలలో వున్న విజ్ఞాన సర్వస్వం' వ్రాసినది అధీన మహావిద్వాన్ శ్రీ S దండపాణి దేశికర్,, ప్రచురించినది
ది త్రివవదుతురై అధీనం, సరస్వతి మహల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్, తిరువవదుతురై, తమిళ్ నాడు, ఇండియా 609803.
మూలాలు
మార్చు- ↑ Dehejia 1990, pp. 99-101
- ↑ Vivek Nanda; George Michell (2004). Chidambaram: Home of Nataraja. Marg. pp. 15, 55–58. ISBN 978-81-85026-64-0.
- ↑ Rajarajan, R.K.K. (2016). "'Tirukkuḷam' or 'Teppakkuḷam' of South India: 'Jalavāstu'". Pandanus '16: Nature in Literature, Art, Myth and Ritual. 10 (2): 83–104.
- ↑ Caṇmukam Meyyappan 1992, pp. 21-22
ఇతర లింకులు
మార్చు- Ca Ve, Ppiramaṇiyan̲; G., Rajendran (1985). Heritage of the Tamils: temple arts. International Institute of Tamil Studies.
the hymnists as Tillai came to be universally accepted as the place where the Lord dances in the Hall of Gold - Pon Ambalam
- Pal, Pratapaditya (1988). Indian Sculpture: 700-1800 By Los Angeles County Museum of Art. University of California Press. ISBN 9780520064775.
"Curiously despite its importance in the religious life of Tamil Nadu and the Tamils in Sri Lanka, the image was not adopted with equal fervour by other southern Hindus
- G., Vanmikanathan (1971). Pathway to God through Tamil literature, Volume 1. Delhi Tamil Sangam Publication.
- Pillai, M. Rajamanickam (1964). The development of Śaivism in South India, A.D. 300-1300. Dharmapuram Adhinam.
- Ramaswamy, Vijaya (2007). Historical dictionary of the Tamils. United States: Scarecrow Press, INC. ISBN 978-0-470-82958-5.
- Bajwa, Jagir Singh; Ravinder Kaur (2007). Tourism Management. New Delhi: S.B. Nangia. ISBN 81-313-0047-1.
- Knapp, Stephen (2005). The Heart of Hinduism: The Eastern Path to Freedom, Empowerment and Illumination. NE: iUniverse. ISBN 978-0-595-35075-9.
- M.K.V., Narayan (2007). Flipside of Hindu Symbolism: Sociological and Scientific Linkages in Hinduism. California: Fultus Corporation. ISBN 1-59682-117-5.
- Kamalabaskaran, Iswari (1994). The light of Arunachaleswarar. Affiliated East-West Press Pvt. Ltd.
- Spear, Heidi (2011). The Everything Guide to Chakra Healing: Use Your Body's Subtle Energies to promote Health, Healing and Happiness. USA: Adams Media. ISBN 1-4405-2649-4.
- Hüsken, Ute; Will Sweetman (2009). Viṣṇu's children: prenatal life-cycle rituals in South India By. Germany: otto Harrassowitz GmbH & Co.KG, Wiesbaden.
- Aiyangar, Krishnaswami S. (1991). South India and Her Muhammadan Invaders. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0536-5.
- Ayyangar, Sreenivasa C.R. (1908). The life and teachings of Sri Ramanujacharya. Madras: R. Venkateshwar & Co.
- K.R., Sundararajan; Bithika Mukerji (2003). Hindu spirituality: Postclassical and modern. USA: Cross Road Publishing Company. ISBN 81-208-1937-3.
- Dubey, D. P. (2003). Rays and ways of Indian culture. New Delhi: M.D. Publishing Pvt. Ltd. ISBN 81-85880-98-0.
- Harle, J.C (1994). The Art and Architecture of the Indian Subcontinent (2 ed.). Yale University Press Pelican History of Art. ISBN 0300062176.
- Manninezhath, Thomas (1993). Harmony of religions: Vedānta Siddhānta samarasam of Tāyumānavar. New Delhi: Motilalal Banarsidass Publishers Private Limited. ISBN 81-208-1001-5.
- Glory of India, Volume 8. Motilal Banarsides. 1984.
{{cite book}}
:|work=
ignored (help) - Michell, George (1995). Architecture and art of southern India: Vijayanagara and , Volume 1, Issue 6. New York: Cambridge University Press. ISBN 0-521-44110-2.
- References to the philosophical meaning and detailed architecture are drawn from the Sri Umapathy Sivam's 'Kunchithangristhavam', as detailed in 'Natarajasthvamanjari'a collection of elite works on Chidambaram and Lord Nataraja
- References to history and details of the Lord Shiva as the cosmic dancer at Chidambaram are from 'Adalvallan - Encyclopaedia of Adalvallan in Puranas, - Yantras, Poojas- Silpa and Natya Sastras, compiled by Adheena Mahavidhvan Sri S Dhandapani Desikar, and published by The Thrivavaduthurai Adheenam, Saraswathi Mahal Library and Research Centre, Thiruvavaduthurai, Tamil Nadu, India 609803
- Kulke, Hermann; Dietmar Rothermund (2004). A History of India. Oxon: Routledge. ISBN 0-415-32920-5.
- Jones, Constance; James D. Ryan (2007). Encyclopedia of Hinduism. New York: Facts On File, Inc. ISBN 0-8160-5458-4.
- Singh, Sarina; Lindsay Brown, Mark Elliott, Paul Harding, Abigail Hole, Patrick Horton (2009). Lonely Planet India. Australia: Lonely Planet. ABN 36-0005-607-983.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - National Geographic (2008). Sacred Places of a Lifetime: 500 of the World's Most Peaceful and Powerful Destinations. United States: National Geographic Society. ISBN 978-1-4262-0336-7.
- Let's Go, Inc (2004). Let's go: India & Nepal, 2004. New York: Martin's Press. ISBN 0-312-32006-X.
- Onwumechili, C. Agodi (1997). The equatorial electrojet. Amsterdam: Overseas Publishers Association. ISBN 90-5699-069-1.
- Encyclopædia Britannica (India) (2000). Students' Britannica India, Volumes 1-5. Hong Kong: Encyclopædia Britannica Inc. ISBN 0-85229-760-2.
- Southern Circle (1903). Epigraphy. Madras: Archaeological Survey of India.
- Dehejia, Vidya (1990). Art of the imperial Cholas. USA: Columbia University Press. ISBN 0-231-07188-4.
- Caṇmukam Meyyappan (1992). Chidambaram Golden Temple. Manivasagar Pathippagam.
- Sastri, Natesa; S. M. Natesa Sastri (2003). Hindu feasts, fasts and ceremonies. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0402-4.
- Kodayanallur Vanamamalai, Soundara Rajan (2001). Concise classified dictionary of Hinduism. New Delhi: Concept Publishing Company. ISBN 81-7022-857-3.
- Anand, Swami P.; Swami Parmeshwaranand (2004). Encyclopedia of the Śaivism. New Delhi: Sarup & Sons. ISBN 81-7625-427-4.
- Subramuniyaswami, Satguru Sivaya (2004). Merging with Śiva: Hinduism's contemporary metaphysics. USA. ISBN 978-0-945497-99-8.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - Storl, Wolf-Dieter (2004). Shiva: the wild God of power and ecstasy. USA: Inner Traditions. ISBN 978-1-59477-780-6.
బాహ్య లింకులు
మార్చు- నరరాజ స్వామి ఇల్లు
- చిదంబరం నటరాజ ఆలయ వెబ్ సైట్
- ఉదహరించినది , తీసుకొన్నది "చిదంబరం", ఎన్సైక్లోపెడియా బ్రిటాన్నికా (1911).
- "మనోహరమైన తమిళ్ నాడు" చూడవలసిన ప్రదేశాలు చిదంబరం
- వుదహరించినది "122.
- ఆలయం (చిదంబరం), శివుని ఆలయాలు," టెంపుల్ నెట్
- "తమిళ్ నాడు ఆలయాలు, చిదంబరం", టెంపుల్ నెట్
- "చిదంబరం లోని నటరాజ ఆలయం", టెంపుల్ నెట్
- చిదంబరం, తమిళ్ నాడు, ఇండియా
- చిదంబరం లోని ఆలయం
- శ్రీ నటరాజ ఆలయం దృశ్య పర్యటన ద్వారా [permanent dead link]
- దీక్షితర్స్ గురించిన పరిశోధనా పత్రం
- చిదంబరం లోని పురాతన ఆభరణాలు