నడవపల్లి వెంకటేశ్వర్లు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త

నడవపల్లి వెంకటేశ్వర్లు సామాజిక కార్యకర్త.

Venkateswarlu

జీవిత విశేషాలుసవరించు

ఆయన జగన్నాధ శర్మ, లక్ష్మి దంపతులకు మార్చి 27, 1935రేపల్లె (గుంటూరు జిల్లాలో) జన్మించారు. విధ్యాభ్యాసము తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం లో జరిగింది. 1955 లో డిగ్రీ పూర్తి చేసుకుని ఆతరువాత తిరుమల కొండపై గుడి (దేవస్థానం) ఆఫీసులో 3 సంవత్సరములు గుమాస్తాగా పనిచేసి ఆతరువాత మద్రాసు లో కేంద్ర ప్రభుత్వ పి అండ్ టి ఆడిట్ (under C A G) విభాగములో 8 సంవత్సరములు పనిచేసి బదిలీ మీద హైదరాబాదు వచ్చారు. జూన్ 30, 1993లో పదవీ విరమణచేసినారు.

సామాజిక కార్యకర్తగా...సవరించు

వీరు విధ్యార్ధి దశలోనే సామాజిక కార్యక్రమాలయందు మక్కువచూపేవారు. 1953 లో గోదావరి వరదలు వచ్చినపుడు అమలాపురం కాలేజీనుంచి సహచరులందరు ఒక టీముగా ఏర్పడి నాటుపడవల్లో లంకగ్రామాల్లో చిక్కుకున్న వారికి మంచినీళ్ళు, ఆహారము, మందులు అందించారు. ఈసేవకు గాను కాలేజీ యాజమాన్యం ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

  1. 1994-99 ఆస్థిపన్ను మదింపు ఒకేసారి నాలుగు రెట్లు పెంచడముతో తోటి భవన యజమానులను కూడగట్టుకొని ఒక సంఘాన్ని స్థాపించి హైకోర్టులో పిటీషన్ ద్వార సవాల్ చేసి స్టే ఆర్డరు సంపాదించారు. తరువాత ప్రభుత్వంతో సంప్రదింపులద్వారా పన్ను తగ్గింది. దీనివలన 6500 మంది భవన యజమానులు రూ.ఒక కోటి నలభై లక్షలు లబ్ధి పొందారు.
  2. తనకాలనీ సమీపంలో గడ్డియన్నారం మునిసిపాలిటీవారు చెత్తనంతా డంప్ చేసేవారు. హైకోర్టులో వాజ్యం వేసి అక్కడ చెత్తవేయకుండా శాశ్వత నీషేధఉత్తర్వులు సాధించారు. వినియోగదారుల మండలిని స్థాపించి దగాపడిన వినియోగదారులకు బాసటగా నిలచి వినియోగదారుల ఫోరంలో వారి తరపున కేసు వేసి తనే వాదించి నష్టపరిహారం ఇప్పించారు. ప్రభుత్వము వీరిసేవలను గుర్తించి నగదు బహుమతిచ్చి ప్రశంసాపత్రమును అందజేసింది.

కొన్ని సామాజిక కార్యక్రమాలుసవరించు

  1. ఒకట్రావెల్ ఏజన్సీ షిర్ఢి యాత్రకు సరికొత్త బస్సులు అని ప్రకటిన ఇచ్చారు. దీనిని నమ్మి టికెట్లు రేజర్వేషను చేయించుకున్నారు. తీరా ప్రయాణం రోజూన చూస్తే డొక్కుబస్సు కొత్తబస్సుపేరుతో మోసంచేసినందుకు తోటి ప్రయాణీకులను ఒప్పించి వినియోదగారుల కోర్టులో కేసునేసి పరిహారం ఇప్పించారు.
  2. చెన్నైనుంచి హైదరాబాదు రైలులో ప్రయాణం చేస్తుంటే రైల్వే కేటరింగు సిబ్బంది గూడూరులో భోజనం సరఫరాచేస్తామని డబ్బులు వసూలుచేసారు భోజనం మాత్రం రాలేదు. రంగారెడ్డిజిల్లా వినియోగదారుల ఫోరంలో రైల్వే శాఖ పై గెలిచి నష్ట పరిహారం పొందారు.
  3. కొత్తపేట నివాసి ఒక వృద్ధురాలికి రు.13000/- కురెంట్ చార్జీలు కట్టాలని బిల్లు పంపించారు. విస్తుపోయిన భాదితురాలు అధికారులకు ఫిర్యాదుచేసింది. మొదట బిల్లుచెల్లించండి. తరువాత ఫిర్యాదును పరిశీలిస్తాం కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తాం అని అధికారులు బెదిరించారు. చేసేదిలేక బిల్లు మొత్తం చెల్లించారు. తరువాత అధికారులు విచారణలో తప్పుడుబిల్లు పంపినట్లు రుజువైనా అమెచెల్లించిన డబ్బు తిరిగివ్వలేదు. 15 సార్లు కాళ్ళు అరిగేలాగా తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితులలో ఆమె వినియోగదారుల ఫోరంను ఆశ్రయిoచారు. ఫోరంలో ఆమెతరపున వాదించారు. ఫోరం తనతీర్పులో వృద్ధురాలికి మనోవేదన కలిగించినందుకు దారిఖర్చులకు రెండువేలు, కోర్టుఖర్చులకు వెయ్యిరూపాయలు 24 శాతం వడ్డితో సహా చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

నేత్రదాన ప్రచారంసవరించు

సొంతఖర్చుతో నేత్రదాన నినాదాలను ముద్రించి వెయ్యి కారీ బ్యాగులు(carry bags)ఇంటింటికీ తిరిగి సంచులను, నేత్రదానం కరపత్రాలను పంచారు. షుమారు 70 మంది నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలను ఇచ్చారు. ఇప్పుడు కూడా కరపత్రములను పంచేందుకు కార్యకర్తలను నియమించి ప్రచారం చేస్తున్నారు.

నిర్వహించిన పదవులుసవరించు

  1. Founder President, Gaddiannaram Property Tax payers Association
  2. Founder Secretary, Gaddiannaram Consumers Forum
  3. Founder President, Senior Citizens Forum of CGHS Dispensary No.12, Hyderabad
  4. Trustee of N J Sarma and Lakshmi Foundation Eye donation propagandist

మూలాలుసవరించు

వనరులుసవరించు

  • ఈనాడు దిన పత్రిక 6-2-2008, The Hindu English Daily News paper 3-1-2008

ఇతర లింకులుసవరించు