నన్నపనేని వెంకట్రావు


నన్నపనేని వెంకట్రావు (1914 డిసెంబరు 10 - 1980 జనవరి 28) స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు.

గుంటూరు జిల్లా ఐతానగర్ వారి జన్మస్థలం. జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన నన్నపనేని వెంకట్రావు స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర సోషలిస్టు పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. తెనాలి పురపాలక సంఘం అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసాడు. ఆ తరువాత 1962లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు, 1980లో లోకసభకు ఎన్నికయ్యాడు.[1]

మూలాలు మార్చు

  1. "'సమతావాది' నన్నపనేని వెంకట్రావు". andhrajyothy. Retrieved 2022-01-29.