నర్తు రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1]

నర్తు రామారావు

శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 02 - 01 మే 2029
నియోజకవర్గం స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 17 మే 1957
కొత్త పుట్టుగ గ్రామం, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నర్తు చామంతి
సంతానం శివాజీ, రవికుమార్, పద్మ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

నర్తు రామారావు 1957 మే 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, కొత్త పుట్టుగ గ్రామంలో జన్మించాడు. ఆయన 9వ వరకు చదువుకున్నాడు.[2]

 
వైయ‌స్ఆర్‌సీపీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను కలిసిన నర్తు రామారావు

రాజకీయ జీవితం మార్చు

నర్తు రామారావు కవిటి మండలం బెలగాం పీఏసీఎస్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ఆ తర్వాత రెండు సార్లు లండారి పుట్టుగ సర్పంచ్‌గా పని చేశాడు. రామారావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పని చేసి 2009 ఎన్నికల్లో ఇచ్చాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

నర్తు రామారావు వైఎస్సార్సీపీ ఆవిర్భావం అనంతరం పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి  2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో పార్టీ రాజకీయ, సామాజిక సమీకరణాల దృష్ట్యా పోటీకి దూరంగా ఉండి పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో కీలకంగా పని చేశాడు. నర్తు రామారావు  వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో 2021 జులై 18న ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]

నర్తు రామారావు వైఎస్సార్సీపీ చేసిన సేవలకు గాను 2023లో స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ఆయన పేరును ఖరారు చేసింది.[4] నర్తు రామారావు మార్చి 17న 524 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికై[5], మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Eenadu (21 February 2023). "ఎమ్మెల్సీగా నర్తు రామారావుకు అవకాశం". Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  3. Andhra Jyothy (18 July 2021). "'నామినేటెడ్‌' మాయ!". Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  4. Sakshi (21 February 2023). "స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్తు రామారావు". Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  5. Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  6. 10TV Telugu (15 May 2023). "ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)