నర్సీపట్నం
నర్సీపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాకు చెందిన పట్టణం. నర్సీపట్నం నుండి ఎటు వెళ్ళినా ఏజన్సీ ప్రాంతమే వస్తుంది కాబట్టి 'గేట్ వే ఆఫ్ ఏజన్సీ'గా పిలవబడుతూ ఉంది. ఇది తుని నుండి 43 కీ.మీ, విశాఖపట్నం నుండి 72 కీ.మీ దూరంలో ఉంది.
పట్టణం | |
Coordinates: 17°40′N 82°37′E / 17.67°N 82.62°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండలం | నర్సీపట్నం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 42.00 కి.మీ2 (16.22 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 33,757 |
• జనసాంద్రత | 800/కి.మీ2 (2,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1100 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8932 ) |
పిన్(PIN) | 531116 |
Website |
చరిత్ర
మార్చు1922 ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కూలగొట్టింది ఈ పట్టణంలోని పోలీస్ స్టేషను. అదే పోలీస్ స్టేషను ఇప్పటికి గుర్తుగా ఉంది. పెద్దగా మార్పులు చేయ లేదు. బ్రిటిష్ కాలం నాటి తాలుకా ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ లు చారిత్రక చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. సివిల్ సర్వెంట్స్ గా ఉన్న అనేక మంది ప్రసిద్దులకు ప్రారంభం ఇక్కడే కావడంతో సివిల్ సర్వెంట్స్ పై ఉపమన్యు చటర్జీ (ఆంగ్ల వికీ వ్యాసం) వ్రాసిన ఇంగ్లీష్ నవల ఆగస్టు నవల ఆధారంగా సినిమా తీయడం ఇక్కడే జరిగింది.
జనగణన వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం నర్శీపట్నం జనాభా - మొత్తం 91,612. అందులో పురుషులు 44,655 మంది ఉండగా స్త్రీలు 46,957 మంది ఉన్నారు.
పరిపాలన
మార్చునర్సీపట్నం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సదుపాయాలు
మార్చునర్సీపట్నం ఊరికి, నర్సీపట్నం రోడ్డు రైలు స్టేషనుకూ దరిదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ రెవెన్యు డివిషనల్ ఆఫీసు ఉండేది. ప్రస్తుతం ఒక బస్సు కాంప్లెక్స్ ఉంది. నర్సీపట్నం నుండి తుని రైల్వేస్టేషన్ కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు సదుపాయం ఉంది.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018