నలందపాలెం
నలందపాలెం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం.
నలందపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′19″N 80°54′54″E / 16.022°N 80.915°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | అవనిగడ్డ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521121 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చురేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన
సమీప మండలాలు
మార్చుమోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుఅవనిగడ్డ, నాగాయిలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండలపరిషత్ ప్రాథమిక పాఠశాల
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుఊరచెరువు:- గ్రామములో అధ్వాన్నంగా ఉన్న ఈ చెరువును ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, రు. 3.11 లక్షల వ్యయంతో పూడిక తీసి, గట్లను పటిష్ఠంచేసి అభివృద్ధిచేసారు. చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను సైతం తొలగించారు. గట్ల వెంట ఉన్న ముళ్ళపొదలు, పిచ్చిచెట్లు, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేసారు. గ్రామంలో ఏ ప్రాంతంలో వర్షం కురిసినా ఆ నీరు చెరువులోనికి వచ్చేలాగా డ్రెయినును ఏర్పాటు చేసారు. ఈ మధ్యన కురుస్తున్న, ప్రతి వర్షపు చినుకూ, చెరువులోకి చేరి, చెరువు నిండుకుండలాగా తయారై, చెరువులో జలకళ ఉట్టిపడుచున్నది. [3]
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం రామచంద్రాపురం గ్రామ పంచాయతీలోని శివారు గ్రామం.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుశ్రీ రామాలయం
మార్చుఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఊత్సవాలు, చలువ పందిళ్ళు వేసి, 9 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆలయానికి రంగులద్ది, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించెదరు. [2]
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం
గ్రామంలోని విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన శ్రీ దాసరి వెంకట శ్రీమన్నారాయణ, ఎం.ఎస్.సి., ఎం.ఫిల్., చదివి, రెండు దశాబ్దాలుగా విద్యాశాఖలో పనిచేస్తున్నారు. పల్లెలలో విద్యాభివృద్ధికి విశేష కృషిచేసినందులకు, వీరికి 2014 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. వీరు గత సంవత్సరం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. [4]
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్ద; 2014, ఏప్రిల్-8; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-9; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-20; 20వపేజీ.