నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ

దృశ్య మాధ్యమ దృశ్యీకరణ తీరు

బ్లాక్ అండ్ వైట్ (ఆంగ్లం:Black-and-white) ఫోటోగ్రఫీలో మొదటి తరం ఫోటోగ్రఫీ. ఇందులో రంగులు కనబడవు. కేవలం నలుపు, తెలుపు లేదా వివిధ పాళ్ళలో బూడిద రంగులతోనే ఛాయాచిత్రం ఏర్పడుతుంది. ఛాయాచిత్రకళ కనుగొనబద్డ తొట్టతొలి రోజులలో ప్రతిబింబాన్ని ఎలా ఏర్పరచాలి అనే దానిపైనే దృష్టి కేంద్రీకరించటంతో ఈ రకం ఛాయాచిత్రకళలో వర్ణాలు కనబడవు. అప్పట్లో అసలు కలర్ ఫోటోగ్రఫీ అనే పదమే లేదు. ఫోటోగ్రఫీ అంటే అప్పట్లో బ్లాక్-అండ్-వైట్ ఫోటోగ్రఫీయే. 1840 లలోనే కలర్ ఫోటోగ్రఫీ కనుగొనబడిననూ దానితో పోలిస్తే బ్లాక్-అండ్-వైట్ ఫోటోలు చవక కావటం, ఛాయాచిత్రకారులు బ్లాక్-అండ్-వైట్ ఫోటోలపై నైపుణ్యాన్ని సాధించటం వలన ఆ తర్వాత చాలాకాలం వరకూ కూడా బ్లాక్-అండ్-వైట్ ఫోటోగ్రఫీ నే రాజ్యమేలినది. సాంఖ్యిక సాంకేతికత ఉత్తానపథంలో ఉన్న ఈ రోజులలో కూడా, డిజిటల్ ఫోటోగ్రఫీ ద్వారానో ఫిలిం ఫోటోగ్రఫీ ద్వారానో బ్లాక్-అండ్-వైట్ ఫోటోలు సృష్టించబడుతున్నాయి. కేవలం సరదా కొరకు కొందరు బ్లాక్-అండ్-వైట్ ఫోటోగ్రఫీని ఇష్టపడితే, కొన్ని శాస్త్రీయ అభ్యాసాలు (ఉదా: గ్రహాల, ఉపగ్రహాల ఛాయాచిత్రాలు; శాస్త్రీయ ఛాయాచిత్రాలు; ట్రాఫిక్ పరిశీలన; కళాత్మక ఛాయాచిత్రకళ వంటివి) కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే సాగుతాయి. కొందరు ఫోటోగ్రఫర్లు కొన్ని సందర్భాల కొరకు, స్పెషల్ ఎఫెక్ట్ ల కొరకు (ఉదా: ఛాయాచిత్రంలో ఉదాసీనతను పెంపొందించేందుకు) ప్రత్యేకించి బ్లాక్-అండ్-వైట్ ఫోటోగ్రఫీనే వాడుతారు.

1870లో తీసిన కూర పనస యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటో
ఒక హార్మోనికా యొక్క B&W ఫోటో
తమిళ రాజకీయ ప్రముఖుల పై చిత్రీకరించబడ్డ ఇద్దరు చిత్రం యొక్క డివిడి ముఖచిత్రం

నలుపు, తెలుపును ఆంగ్లంలో బ్లాక్ అండ్ వైట్ అంటారు. తెలుగు వారు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ లేదా తెలుపు నలుపు అనే పదాలను ఉపయోగిస్తారు. దృశ్య కళలలో బ్లాక్ అండ్ వైట్‍కు సంక్షిప్త పదంగా తరచూ B/W లేదా B&W రూపాలను సూచిస్తారు. బ్లాక్ అండ్ వైట్ సంక్షిప్తంగా B&W అని ఉపయోగించే ఈ పదం దృశ్య కళలలోని మోనోక్రోమ్ రూపాలను సూచిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ వివరణ భావన చిత్రాలను సూచించడంలో తగిన పేరుగా ఉండకపోవచ్చు, ఈ చిత్రాలు పూర్తిగా నలుపు, తెలుపు రంగులలో ఉండక, నలుపు, తెలుపు రంగుల మిళితంగా ఉంటాయి. ఛాయాచిత్రకళ అభివృద్ధి చెందుతున్న మొదటి తరంలో చాలా వరకు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు (ప్రాచీన భాంఢాగార స్థిరత్వం కొరకు) సెపియా టోన్లో ముద్రించేవారు. ఇవి నిరంతరం బూడిద రంగు ఛాయలను ఉత్పత్తి చేసే స్థాయిగా ఉంటాయి. కలర్ ఫోటోగ్రఫిలో మరిన్ని రంగులను చిత్రీకరించే సౌలభ్యం ఉన్ననూ రంగుల తీవ్రతని (మొత్తం లేదా చాలా వరకు) తగ్గించే ఏకవర్ణ గుణం కలిగిన బ్లాక్ అండ్ వైట్ కి ఫోటోగ్రఫిలో ప్రత్యేక చోటు ఉంది.

ప్రసార మాధ్యమాలు

మార్చు
  • మొదటి తరం ఫోటోగ్రఫి కేవలం బ్లాక్ అండ్ వైట్ లో లేదా సెపియా టోన్లలో మాత్రమే ఉండేది. తర్వాత కలర్ ఫోటోగ్రఫి వచ్చిననూ అది అరుదుగా, ఖర్చుతో కూడుకొన్న వ్యవహారంగా ఉండేది.

సమకాలీన వాడుక

మార్చు

కలర్ ఫోటోగ్రఫి వాడుకలోకి వచ్చినప్పటి నుండి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు పాత ఙాపకాలని నెమరు వేసుకొనేదిగా, చారిత్రకమైనదిగా, కాలం చెల్లినదిగా భావింపబడుతున్నది. పలు చలనచిత్రాలలో గడచిన కథని చెప్పటానికి బ్లాక్ అండ్ వైట్ నే ఉపయోగిస్తుంటారు. నలుపు, తెలుపు వర్ణాల మధ్య వైరుధ్యం ఎక్కువగా ఉండటం మూలాన చూపించవలసిన సబ్జెక్టులో కావలసినంత లోతుని తీసుకురాగలగటం వలన కొంత మంది ఛాయాగ్రహకులు, చలన చిత్రకారులు కేవలం బ్లాక్ అండ్ వైట్ లోనే చిత్రీకరించటానికి మొగ్గు చూపుతారు.

ఒక్కోమారు చిత్రపటాల సాంప్రదాయికతని పెంచటానికి కూడా బ్లాక్ అండ్ వైట్ ని వినియోగిస్తారు.

మనం నిత్యం చూసే రంగులమయ ప్రపంచానికి భిన్నంగా ఉండటానికి, తాము తీసిన ఫోటోలకి కళాత్మకత జోడించటానికి ఛాయాగ్రహకులకి బ్లాక్ అండ్ వైట్ ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు