నల్గొండ రెవెన్యూ డివిజను
నల్గొండ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నల్గొండ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నల్గొండ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని నల్గొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.[4]
నల్గొండ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.
పరిపాలన
మార్చునల్గొండ డివిజనులోని మండలాలు:[5]
క్ర.సం | నల్గొండ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
2 | చిట్యాల మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
3 | కంగల్ మండలం | 24 రెవెన్యూ గ్రామాలు |
4 | కట్టంగూర్ మండలం | 18 రెవెన్యూ గ్రామాలు |
6 | నకిరేకల్ మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
7 | నల్గొండ మండలం | 35 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
8 | నార్కెట్‌పల్లి మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
9 | తిప్పర్తి మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
10 | కేతేపల్లి మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
11 | శాలిగౌరారం మండలం | 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
గమనిక:గతంలో ఈ రెవెన్యూ డివిజనులో 13 మండలాలు ఉండేవి. వాటిలోని చండూరు మండలం, మునుగోడు మండలం ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన చండూరు రెవెన్యూ డివిజనులో విలీనమయ్యాయి..[6]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Yadadri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 2017-02-15. Retrieved 2022-08-16.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-16.
- ↑ "Nalgonda district info". Official website of Nalgonda district. Archived from the original on 15 February 2016. Retrieved 2022-08-16.
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-16.
- ↑ "TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి". EENADU. Retrieved 2023-12-31.