భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు.

నవవిధ భక్తి రీతులు పుస్తక ముఖచిత్రం.

వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది.[1] అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది.


భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది.[2] నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.

భక్తి మార్చు

.

నవవిధ భక్తి మార్గాలు మార్చు

భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తి మార్గాలు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా
క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్

'పై శ్లోకాలను పోతన తెనిగించిన విధం

తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

  1. శ్రవణం: భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు, ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
  2. కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట: రామదాసు, దాసగణు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
  3. స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
  4. పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట
  5. అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
  6. వందనం: ప్రణామం చేయుట
  7. దాస్యం: భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు
  8. సఖ్యం: అర్జునుడు
  9. ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి

నవవిధ భక్తులు మార్చు

కరుణ చూపమనో, కృప సాధించాలనో, అనుగ్రహం పొందాలనో, కోరికలు తీర్చుకోవాలనో భగవంతుడ్ని ఆశ్రయిస్తాం.. గుడికెళ్లి కొబ్బరికాయలు కొట్టి, అష్టోత్తరం చదివించి. పూజలు చేయించి (చేసి)... ఆ కోరికలు తీరగానే లేదా తీరకుండానో అతను్ని మర్చిపోతాం.... కోరికలు తీరితే అవెందుకు తీరాయి?తీరకపోతే అవెందుకు తీరలేదు? అని కూడా ఆలోచించే తీరిక మనకెప్పుడూ ఉండదు. ఏదైనా సాధించాలంటే మనిషికి ఆ పనిచేసితీరాలి అనే పట్టుదల, ఆత్మవిశ్వాసం, తన సామర్థ్యం పై నమ్మకం, చేస్తున్న ( లేదా చేయబోయే) పని మీద ఇష్టం ఉండాలి. ఆ పని పూర్తయి, ఫలితం వచ్చే వరకూ వేచిచూసే ఓపిక, మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకునే సహనశక్తి ఉండాలి.

ఓ పని మన వల్ల కాదు అని నిర్ణయానికొచ్చాక ఆ పనిలో నిపుణులనో, అనుభవఙ్ఞులనో ఆశ్రయించటం జరుగుతుంది. ఇక ఆ పని పూర్తవడానికి మనకి ఎవరూ సహకరించరు (సహకరించలేరు) అనిపించినప్పుడే మనం భగవంతుడ్ని ఆశ్రయిస్తాం, మన కోరికలను తీర్చే అతను్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోం. పోనీ కోరిక తీరకపోతే ఎందుకు తీరలేదా అని ఒక్కసారి కూడా అలోచించకుండా.. భగవంతుడు లేడు అనేస్తాం. మనతో తిరిగే స్నేహితుల అవసరాల పట్ల శ్రద్ధ వహించకుండా... వారిని నిర్లక్ష్యం చేసి.. మనకి అవసరం ఏర్పడినప్పుడు వారి మీద ఆధారపడితే, వారు మనల్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తారా? మనకిష్టమైన హీరో గురించో లేదా ఇష్టమైన వ్యక్తి గురించో అతని జీవిత చరిత్ర ఆసాంతం తెలుసుకునే దాకా నిద్రపోని మనం భగవంతుడి గురించి తెలుసుకోవటానికి కొంచెం కూడా ఆసక్తి చూపించం.మనం ఎవర్నయినా నిర్లక్ష్యం చేస్తే. దూరం చేసుకుంటే వారు మనకి దూరం అవుతారు. ఓ వ్యక్తి దగ్గరవ్వటానికి ముందు పరిచయం చేసుకోవాలి. అతని గురించి తెలుసుకోవాలి, అతని ఇష్టాయిష్టాలని కనిపెట్టుకోవాల, అతని పట్ల కాస్త శ్రద్ధ కలిగివుండాలి. అతని ఇష్టాయిష్టాలని బట్టి అతనితో మసలుకోవాలి. అతని మనసెరిగి ప్రవర్తిస్తే ఆ మనిషి మనకి దగ్గరవుతాడు (మిత్రుడవుతాడు). దగ్గరయిననాడు ఆపదలో ఆదుకుంటాడు... ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తమిత్రుడు.... అందరినీ సమంగా చూచే భగవంతుడే ఆ ఆప్తమిత్రుడు. మరి భగవంతుడు ఏంచేస్తే దగ్గరవుతాడు.. అతనితో స్నేహం చేసేదెలా? మనకి అతను రాళ్లలోనో, ఫొటోల్లోనో తప్ప మనిషిలా కనిపించడే?

అతనుకి దగ్గరవటానికి ఒకే దారి ఉంది అది భక్తిమార్గం, మరి భక్తి అంటే ఏమిటి? భగవంతుడిపై అవ్యాజమైన ప్రేమే భక్తి. సర్వం పొందాలనే కోరిక ప్రేమలో ఉంటుంది - సమస్తం సమర్పించాలనే కోరిక భక్తిలో ఉంటుంది. భక్తి అంటే సర్వం అర్పించుకోవటమే, అంటే ఏది నాది అనుకుంటమో అదేదీ మనది కాదు. అవన్నీ మన చుట్టూ చేరి నేనుగా తయారయ్యింది. అది ఒదిలించుకోడానికి మార్గం అన్నిటికీ కారణమైన భగవంతునికి అవన్నీ అర్పించుకోవడమే. అదే భక్తి. మరి అతను మనిషి కాదుగా అంటే... రాముడు, కృష్ణుడు, సాయిబాబా, రమణ మహర్షి. ఏసు ప్రభువు, మహమ్మదు, గురునానక్‌ వీరందరూ మానవరూపంలోనే భూమిపై అవతరించారు. మనిషిగా అవతరించినపుడు వారిని అందరూ ఒకేసారి పూజించలేరు కాబట్టి అందరికి దగ్గరవటానికి. ఫొటోలు, విగ్రహాల రూపంలో మనకి దగ్గరవుతారు.మరి వారిని అర్ధం చేసుకొని వారిని భక్తి భావంతో సేవించి వారికి దగ్గరవ్వాలంటే ఏం చెయ్యాలి??మన ముందర అతను్ని సేవించిన పరీక్షిత్తు, నారదుడు, ప్రహ్లాదుడు, బిల్వమంగళుడు, భక్త జయదేవుడు, హనుమంతుల వారు లాంటి భక్తులు ఏం చేసి అతను అనుగ్రహాన్ని పొందారో గమనించి మనం కూడా వాటిని ఆచరించడం ద్వారా అతను కరుణ, కృప, అనుగ్రహం పొందగలం.

భక్తి, ఙ్ఞాన, కర్మ యోగాల ద్వారా భగవంతుడ్ని పొందవచ్చు అని మనకి శాస్త్రాల్లో చెప్పారు.. వాస్తవానికి అవి ఒకటే తప్ప వేరు కాదు...భగవంతుడిపై పరిపూర్ ణనమ్మకంతో కూడిన అవ్యాజమైన ప్రేమ పెంచుకోవటం (భక్తి, భగవంతుడెవరు?అతను తత్వమేమిటి?అతను ఓ సాధారణమైన రాయా? లేక విశ్వమంతా వ్యాపించిన చైతన్యమా? అతనుకి దగ్గరవటం ఎలా? అనే విషయాలు తెలుసుకుని ( ఙ్ఞానం) అతను అనుగ్రహాన్ని పొందటానికి ఇతర భక్తులు ఏం చేసారో అర్ధంచేసుకుని.. అవి ఆచరించటం (కర్మ) ఈ మొత్తాన్ని అర్ధం చేసుకుంటే భగవంతుడి అనుగ్రహాన్ని పొందటంలో పై మూడింటి ఆవశ్యకత ఏమిటో భక్తి, ఙ్ఞాన, కర్మ మార్గాల మధ్య అవినాభావ సంబంధం ఏమిటో అర్ధమవుతుంది.

భక్తిలో నవవిధ భక్తిమార్గాలున్నాయని చెప్పటం మనం వినే (చదివే) ఉంటాం. వాటి ద్వారా మనమేమైనా ఫలితం పొందామా? అంటే సమాధానం శూన్యం కారణం? ఎందుకిలా జరుగుతుంది? అసలవేమిటో అర్ధం ఐతే అర్ధం అయినవి ఆచరణలో పెడితే మనం క్రమంగా ఓ స్థాయికి వచ్చేసరికి భగవంతుడు మనని శ్రద్ధగా గమనిస్తున్నారు. అతను మనల్ని పట్టించుకుంటున్నారు..అతను మన బాధల్ని అర్ధం చేసుకుంటున్నారు అనే విషయం అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు మనపట్ల అతను పూర్తిగా సంతృప్తి చెందితే మనం పూజించే అవతారంలోనో లేదా అవధూత మహాత్ముల రూపంలోనో సగుణ సాక్షాత్కారం ప్రసాదించి దర్శన, స్పర్ప, సంభాషణ అనుభవాలు ఇవ్వవచ్చు ఆచరణ వల్లే అనుభవాలు కలుగుతాయి. ముందుగా మనకి కావల్సింది ఒకే ఒక భగవంతుడి పై గురి (భక్తి). అది రాముడా, కృష్ణుడా. సాయి బాబానా. ఏసు ప్రభువా, అల్లానా అని మన మతం నిర్ణయిస్తుంది లేదా భగవుంతుడ్ని వివిధ గుణాలతో ఆరాధించే వారికి సాధారణంగా అయన్ని ఆరాధించేవారి అభిప్రాయాన్ని బట్టీ అతను అనేక రూపాల్లో దర్శనమిస్తాడు (హిందుమతం). మతాన్ని బట్టో, ఇష్టాన్ని బట్టో ముందుగా మనకి నచ్చిన భగవంతుడ్ని ఎంచుకొని అతనుకి నవవిధ భక్తి ద్వారా దగ్గరయి, అతను అనుగ్రహాన్ని పొందవచ్చు. ముందుగా నవవిధ భక్తి మార్గం గురించి తెలుసుకుందాం. వాస్తవానికి అవి తొమ్మిది మార్గాలు కాదు, ఒకే మార్గంలో వివిధ దశలు. కేవలం తెలుసుకోవటంలో ఏమీ లేదు. ఆచరణ మీద ఆధారపడి ప్రపంచం నడుస్తుంది.. చేసుకున్నవారికి చేసుకున్నంత.. ఏదైనా ఆచరణలో పెడితేగాని అనుభవానికి రాదు. ప్రతి దానిలోనూ మనం మంచి చెడు చూచి ఎంచుకుంటాం మరి భగవంతుడు చూడడా?

నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది వ్యాయామం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఎండలో వేడి శీతాకాలంలో చలి ఇవన్నీ మనకి అనుభవానికి వస్తున్నప్పుడు వీటిని సృష్టించిన భగవంతుడెందుకు అనుభవానికి రాడు??? భగవంతుడ్ని ఆచరణలో పట్టుకోవాలి ఆ ఆచరణే నవవిధ భక్తిమార్గం.

నవవిధ భక్తిమార్గం : 1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.పాదసేవనము 5.అర్చనము 6.వందనము 7.దాస్యము 8.సఖ్యము 9.ఆత్మ నివేదనము


శ్రవణము మార్చు

1.శ్రవణము : ఇక్కడ ఈ శ్రవణం అనే పదమే వాడాల్సిన అవసరం ఏమిటి?పఠనం వాడొచ్చుగా? దీన్ని వినటం అనే అర్ధంలో కాకుండా చెప్పిన మాట వినటం అనే అర్ధంలో ఉపయోగించినప్పుడు మనకి సరైన ఫలితాలు వస్తాయి.. సత్ప్రవర్తన అభివృద్ధి చేసుకోవాటంలో ఇది...అద్భుతమైన ఫలితాలిస్తుంది...

ఉదా :

కీర్తనము మార్చు

2.కీర్తనం : మంచి చెడుల భేదభావం తెలిసి ఆచరణలో పెట్టాక...ఆ సుగుణాల వల్ల మనకి కాస్త శక్తి లభించి అది గర్వంగాను.. అహంగానూ మారుతుంది.. అప్పుడు భగవంతుడ్ని తలుచుకుంటూ అతనుకెన్ని గొప్ప గుణాలు వున్నప్పటికీ సాధారణమైన వ్యక్తిగా అతనుెంత అణకువ కలిగి ప్రవర్తించారో....గుర్తెరిగి అతను్ని కీర్తిస్తూ మన అహాన్ని చంపుకోవాలి.... దైవాన్ని స్మరిస్తూ అహన్ని చంపుకో అని బాబాగారు చెప్పారు. అంతేగాక అతను లీలలు ఇతరులతో చెప్పడం కూడా కీర్తనే.

ఉదా: సాయి సచ్చరిత్రలో మసీదులో చాలసేపు కూర్చున్న ఓ వ్యక్తి, ఓసారి బయటికి వెళ్లి వచ్చేసరికి అతని స్థానంలో ఓ పిల్ల కూర్చుని ఉంటుంది.. వెంటనే అతను ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యమని పిల్లతో కఠినంగా మాట్లాడతాడు... అప్పుడు బాబాగారు ఆవేశంగా ఈ సృష్టి అంతా భగవంతుడి సొత్తు...ఎవరకీ దీనిపై యాజమాన్యపు హక్కులుండవు అంటారు...ఇదే అనుభవం బాబాగారికే ఎదురవుతుంది.. బాబాగారు ఓ రోజు అతను స్థానంలో కూర్చుని ఉండగా నానావలి గారు వచ్చి... కూర్చుంది చాల్లే లే!!! నేను కూర్చోవాలి ... అంటాడు.. వెంటనే బాబాగారు మరో ఆలోచన లేకుండా లేచి నిలబడగానే.... నానావలి కొద్దిసేపు అక్కడ కూర్చుని లేచి బాబాగారికి నమస్కరించి వెళ్లిపోతాడు.... మాట మాత్రంతో తుఫానుని నియంత్రించిన భగవానుడు.. తన ఆచరణ ద్వారా మనిషి ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి... ఇలాంటి సందర్భాలు చదవి గుర్తుంచుకుని మన నిజజీవితంలో మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు అంత శక్తివంతుడైన అతనుకే ఎలాంటి అహంలేనప్పుడు మనకెందుకుండాలి అని అతను గుణాలను గుర్తుకు తెచ్చుకుని ...అతను భక్తులుగా అతను కీర్తిని మరింత పెంచాలి.

స్మరణము మార్చు

3.స్మరణం : స్మరణం అంటే తొమ్మిదిసార్లో, నూటెనిమిది సార్లో కాకుండా...వీలున్నప్పుడల్లా అతను్ని స్మరిస్తూ ఉండాలి. అందాన్ని, అందవికారమైన దాన్ని దేన్ని చూచినా అది అతను సృష్టిగా భావిస్తూ...అతను్ని గుర్తుకు తెచ్చుకోవాలి.ప్రతి పనికి ముందు, పని ముగిశాక.... (అంత ఏకాగ్రత అవసరంలేని పనులకు) పనిచేస్తూ అతను్ని స్మరించాలి..ప్రతి దాన్లోనూ అతను్ని చూచినప్పుడు ఒకనాటికి అతనుకి దయకలిగి దర్శనభాగ్యం ప్రసాదిస్తాడు. కలియుగంలో కేవలం భగవంతుడి నామస్మరణే మానవులని అన్ని పాపాలనుండి విముక్తులను చేస్తుందని వేదవ్యాస మహర్షుల వారు భాగవతంలో అజామిళుని కథలో చెప్పారు..మనం విజయదశమి రోజు ఆయుధాలను పూజిస్తాం.వినాయకచవితి రోజు పుస్తకాలని బొట్టుతో అలంకరించి విఘ్నేశ్వరుడి ముందు పెడతాం. ఏ పెద్ద వస్తువు కొన్నా మనం దానికి బొట్టు పెడతాం, వాహనాలకి పూజ చేయిస్తాం.. ప్రతిదాన్లోనూ మనం భగవంతుడ్ని చూస్తాం... కానీ కొంతసేపటికి మరిచిపోతాం ఈ మరుపు వల్లే మనం చాలా తప్పులు చేస్తాం... అందుకే అయన్ని నిత్యం స్మరించాలి... గురు నామమే మహామంత్రం...అది గుర్తించి అతను్ని స్మరించాలి.

ఉదా: రోహిల్లా శిరిడిలో బిగ్గరగా భగవంతుడి నామం ఉచ్ఛరించడం వల్ల ఇబ్బంది కలిగిన భక్తులు అతనితో తలపడలేక బాబాగారికి విన్నవించుకుంటే అతను వాడిని ఇంకా బిగ్గరగా నామం ఉచ్ఛరించనివ్వండి.. అతడు చేసే స్మరణ నాకెంతో ఆనందాన్ని కల్గిస్తుంది.. అతని జోలికెవరు వెళ్లకండి అన్నారు.రోహిల్ల ఉచ్ఛరించే ఆ భగవంతుడెవరో చెప్తూనే... అది వారికెంత ఇష్టమైనదో తెలియజెప్పారు. నానాచందోర్కర్‌, బాబాగారి పక్కనే కూర్చున్నప్పటికీ అందమైన అమ్మాయిని చూడగానే మనసు చలించి, ఆమెని ఇంకొక్కసారి చూడాలనిపిస్తుంది. అప్పుడు బాబాగారు ఏమన్నారో చూడండి...నానా (చందోర్కర్) సింహద్వారం ఉండగా దొడ్డిదారిన వెళ్తావెందుకు?? ఇంద్రియాల పనిని ఇంద్రియాలని చేసుకోనివ్వు... మనసుకి ఆలోచనలు కల్పించకు.అందమైన దేవాలయాలెన్ని (దేహాలు) లేవు?అందులో ఉన్న దైవాన్ని దర్శించు...అందమైన దేహాన్నిసృష్టించిన దేవున్ని స్మరించు అన్నారు.

పాదసేవనము మార్చు

4.పాదసేవనం : సద్గురువులు, మహాత్ముల పాదాలెంత పవిత్రమైనవో హిమాలయయోగులు అనే గ్రంథంలో ఓ మహాయోగి రామాగారికి చెప్తూ ఇలా అంటారు.. మహాత్ముల పాదాలెందుకు సేవించాలంటే... బ్రహ్మఙ్ఞానం పొందిన మహాత్ములు భగవంతునితో ఐక్యమై ఉంటారు... అలా ఐక్యమై భగవంతుని పాదాలచెంత తమ జీవితంలో సర్వస్వమూ అర్పిస్తారు.సామాన్యంగా జనాలు ఎదుట వారిని ముఖం చూచి పోల్చుకుంటారు, కానీ ఋషీశ్వరుల ముఖం (అహం) ఇక్కడ ఉండదు, భగవంతుని చెంత ఉంటుంది (ఐక్యమైవుంటుంది). జనాలిక్కడ అతను పాదాలనే (ఆచరణ) కనుగొంటారు.అందుచేత అతను పాదాలకి నమస్కరించాలి.పాదసేవనం అంటే పాదాలను కౌగలించుకోవటం, ముద్దడటమో, పాదాల చెంత తలను వాల్చడమో కాదు...అతను అనుసరించి చూపిన మార్గంలోనే నడవటం...అతను చెప్పిన వాటిని ఆచరించి చూపించడం.మహాత్ముల పాదాల పవిత్రత ఎంతటిదంటే.... సాయి సచ్చరిత్రలో దాసగణుకి బాబాగారు వారి పాదలనుండే త్రివేణీ సంగమంలోని జలాలని అనుగ్రహించారు....ఎవరి పాదాలనుండి గంగ ఉద్భవించి పవిత్రమైందో ఆ భగవంతుడు తనే అని నిరూపించారు. అత్యంత పవిత్రమైన గంగ... పాపుల వల్ల మలినమై మహాత్ముల స్పర్శచే పునీతమవుతుంది... అంతటి మహాత్ములు చూపిన దారి మనల్ని ఎంత ఉన్నత స్థితికి చేరుస్తుందో గుర్తించి దానిని ఆచరించి ఫలితాలు పొందాలి.

అర్చనము మార్చు

5.అర్చనం : హిందువులకి సగుణరూపంలో (ఫొటో, విగ్రహం) భగవంతుడ్ని అర్చించాలనే నియమం విధించబడింది....కృతయుగంలో విగ్రహారాధన లేదు..గురుశిష్య పరంపర కొనసాగిన కాలం అది...త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు గురువులని ఆశ్రయించారు..కానీ క్రమంగా సామాన్యులు గురువులని, మహాత్ములని దూరం చేసుకోవటం వల్ల... మనకి భగవంతుడు దూరమయ్యాడు, అదీకాక కలియుగంలో ప్రతివీధిలోనూ ఓ గురువు వెలుస్తాడు... సద్గురువు ఎవరో తెలుసుకునే ఙ్ఞానం అల్పులైమైన మనకి ఉండదు కాబట్టి.. ఋషులు ఇది ముందుగా గ్రహించి మనకి విగ్రహారాధన అలవాటు చేసారు.మనం ఓ సద్గురువుని ఆశ్రయించి (శ్రీపాద వల్లభ మహారాజ్. నృసింహ సరస్వతి మహారాజ్, మాణిక్య ప్రభువు, అక్కల్‌కోట స్వామి సమర్ధ, షేగాఁ గజానన మహారాజ్, తాజుద్దీన్ మహారాజ్‌, శిరిడీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, మహావతార్ బాబాజీ ) ఈ ఆరాధన సక్రమంగా చేస్తూ..పారాయణలు, వ్రతాలు చేస్తూ.. వారి అనుగ్రహాన్ని పొందితే వారు మన బాధ్యత తీసుకుంటారు.

అర్చన విధాలు : ముగ్గు, సుగంధము, అక్షతలు, పుష్పము, ధూపం, దీపం, ఉపహారం, తాంబూలం అని ఎనిమిది విధాల భగవంతుడి సగుణరూపాన్ని అర్చించాలి. అర్పించడమంటే సమర్పించడం...మనకున్న వాటిని భగవంతుడికి సమర్పించడమే అర్చన....ప్రతి అవసరానికి భగవంతుడిపై ఆధారపడే మనకి ఆస్తులేముంటాయి? ఈ చరాచర జగత్తుని సృష్టించిన అతనుకి మనమేమివ్వగలం?? అతను కోరుకొనేది మనలో దుర్గుణాలు అతనుకి సమర్పించి.... పరిపూర్ణమైన ప్రేమని ఇచ్చి.. అతను అనుగ్రహాన్ని పొందమనే అతను చెప్పేది.

వందనము మార్చు

6.వందనం : ప్రతి పనిలోనూ..మన ప్రతి కదలికలోను అతను మనల్ని ఎలా కనిపెట్టుకుని ఉన్నారో గుర్తెరిగి అతనుపట్ల కృతఙ్ఞతా భావం కలిగివుండటంతినే అన్నం..తాగే నీరు...పీల్చే గాలి అన్నీ అతనువే....ఉద్యోగం రాకున్నా, ఉన్నతి కోసం ఇలా ప్రతిదానికి అతను్ని ప్రార్థిస్తాం...అన్నీ ఇచ్చేది అతనుే కాబట్టి వందనం అంటే నమస్కరించటం...ఉన్నతమైన వారికి మన శిరస్సు వంచి నమస్కరిస్తాం..శిరస్సు వంచటం అంటే పెద్దల గొప్పతనాన్ని గుర్తించి మన అహాన్నిఒదలి వారి పట్ల వినయ, విధేయతలు ప్రకటించటం.... ఈ వినయ, విధేయతలు వారి సమక్షంలోనే కాదు సుమా..వారికి దూరంగా ఉన్నప్పటికీ వారి పట్ల మనంఅదే గౌరవభావాన్ని ప్రదర్శిస్తాం...అదేవిధంగా భగవంతుడి గొప్పతనాన్ని, అతను సమస్త జీవులలోను ఉన్నారని గుర్తించి సకల జీవరాసుల పట్ల కరుణ, దయ, ఇతరులతో సోదరభావం కలిగివుండటమే అసలైన వందన సమర్పణ. కేవలం గుడిలో విగ్రహం ముందు మాత్రమే కాకుండా..మనం ఉన్న ప్రతి చోటా, మనం కలిసే ప్రతి వ్యక్తిలోనూ జీవించి ఉన్న ప్రతి జీవిలోనూ... భగవంతుడున్నాడని గమనించి మన ప్రవర్తనని సక్రమంగా మలచుకోవాలి.

దాస్యము మార్చు

7.దాస్యం : మనం చూస్తున్న ప్రకృతిలో ప్రతిదానిని సృజించింది భగవంతుడే... చూచే ప్రతిదానిలోనూ, చేస్తున్న ప్రతి పనిలోనూ అతను ఉన్నాడు.... అతనుే మనల్ని ఆ పనికి నియమించారని... అందరికి యజమాని అతనుే అని..మనం చేసే పని అతనుని సంతృప్తి పరిస్తే చాలు అనే సేవ్యభావంతో చేస్తూ..అతను సేవకుడిగా మనల్ని మనం భావించుకోవటం ద్వారా దురహంకారం అంతమయి...అతను బిడ్డలమనే సంతృప్తి మనకి కలుగుతుంది. సత్యసాయిబాబా ఒక సందర్భంలో మనప్రజలు ప్రతిపనిలోనూ భగవంతుడినే చూస్తారు అని, దానికి ఉదాహరణగా మన లారీ డ్రైవర్లు, లారీని నడపడానికి ముందు అగరువత్తులు వెలిగించి స్టీరింగ్‌కి నమస్కరిస్తారు.. చేసే పనిలో భగవంతుడ్ని చూడటం అంటే ఇదికాక మరేమిటి అన్నారు... దాస్యం అంటే సేవ చెయ్యటం.. పైన ఆరు విధాలుగా భగవుంతుడికి భక్తిని సమర్పిస్తూ వచ్చిన భక్తుడు ఈ మజిలీలో తన కోసం తను చెయ్యవలిసిన పనంటూ ఏమీలేదని గుర్తించి...అందరిలోనూ, అన్నింటిలోనూ భగవంతుడ్ని చూస్తూ..వారు చేయవలసిన పని విధివిధాన పూర్వకంగా చేస్తూ అదే భగవంతుని సేవగా భావిస్తూ భగవంతుడికి అంకితమైపోతారు. ఇప్పుడు వీరు నడిచే మార్గమే భగవంతున్ని చేరుకొనే దారి అవుతుంది.

సఖ్యము మార్చు

8.సఖ్యం : భగవంతుడు అంటే రాయో, రప్పో కాదని...విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకుని...అతను్ని... తండ్రిగానో..తల్లిగానో...కొడుకుగానో... ప్రియుడిగానో..తాతగానో.... మనింట్లో పెద్దవాడిగా గుర్తించి.. మనం ఏమి తిన్నా.. ఏమి తాగినా అతనుకి సమర్పించి... మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనమెలా ఆదరభావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ, ప్రేమ అతనుపట్ల చూపిస్తూ..అతనుకి దగ్గరవ్వాలి..ఒకసారి బంధం అంటూ ఏర్పడితే..మనం అయన్ని ఒదిలిపెట్టినా అతను మనల్ని ఒదలడు. ఇక్కడి వరకూ వచ్చిన భక్తులకి రాయిలో కూడా చైతన్యం కనిపిస్తుంది..రామకృష్ణ పరమహంస వారి జీవితంలో వారు కాళీమాతకి చేరువైన తీరు గమనించండి... మనకెంతో ఇష్టమైన మనిషితో ఎలా మెలగుతామో అతను కాళీమాత విగ్రహంతో అలా మెలగేవారట..విగ్రహానికి అన్నం తినిపించడం.చామరాలు వీచటం ఇవి చూచి ఇతరులు అతను పిచ్చివాడనుకునేవారట, అంతగా అతను భగవంతుడికి దగ్గరయ్యారు...చివరికి అతను కాళిమాతని మరవలేకపోతుంటే తోతాపురి గురుదేవుల వారు రామకృష్ణుల వారిని మందలించారట. మూడురోజుల్లో తోతాపురి గురుదేవులవారు శ్రీరామకృష్ణులవారికి ఆత్మఙ్ఞానాన్ని ప్రసాదించారు.... సాయిబాబా గారు కూడా వారి గురుదేవుల వారిని ఎలా సేవించేవారో సచ్చరిత్రలో వివరించారు. మనిషికి చిట్టచివరి బంధమే గురువు. మనుషులకి భగవంతుడితో దగ్గరగా మెలిగే అవకాశం కేవలం గురువుల సన్నిధిలోనే కలుగుతుంది. ఎందుకంటే గురువే భగవంతుడు, భగవంతుడే గురువు కాబట్టి. నిరాకారుడైన ఈశ్వరుడు సాకార రూపంగా రావడమే గురువు అవడం.

ఆత్మనివేదనము మార్చు

9.ఆత్మనివేదనం : మన దగ్గరున్నవన్నీ సమర్పించేశాక మిగిలేది ఆత్మ ఒక్కటే అదే పరబ్రహ్మం. ఈ స్థితిలో భగవంతుడికి, భక్తునికి భేదంలేదు..ఇద్దరూ ఒక్కటే. సద్గురువుని ఆశ్రయించి...అతను్ని అనుసరించి..అతను భోదలే జీవితంగా మలచుకున్నవారు అతనుే అవుతారు....ఇదే భ్రమరకీట న్యాయం..భ్రమరాన్నే చింతించిన కీటకం భ్రమరం అవుతుంది...ఇప్పుడు భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు...సద్గురు మిలరేపా, సద్గురు ఎక్కిరాల భరద్వాజ మహారాజ్‌, సద్గురు సిద్ధప్ప ఇలాంటివారు గురువుగారిని ఆశ్రయించి, వారి ఉపదేశాలు ఆచరించి గురువులు అయ్యారు. ఈ స్థితిలో వారేమైనా చెయ్యగల సమర్ధులై తమ మార్గంలోకి ఎంతోమంది రావడానికి ప్రేరణ కలిగిస్తారు...జనన, మరణాల్ని జయించి ఎప్పటికీ జీవిస్తూ తమ భక్తుల, శిష్యుల బాగోగులు గమనిస్తూ వారికి సన్మార్గాన్ని చూపిస్తారు.

ఆధ్యాత్మికతలో గురువులు ఉపయోగించే పదాలన్నీ నిగూఢంగా వుంటాయి..తిరిగి తిరిగి దాన్ని అలోచిస్తేగానీ దాని లోతైన అర్ధం మనకి అర్ధంకాదు. పారాయణ ద్వారా నియమబద్ధమైన జీవితానికి అలవాటుపడుతూ..క్రమశిక్షణ కలిగివుండటం అలవాటుగా చేసుకోవాలి... నామం రాస్తూ పోవటం ద్వారా ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి....నామానికి, రూపానికి, గుణానికి అతీతమైన భగవంతుడు ధ్యానంలో మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరవ్వాలి.మరి భగవంతుడిపై మనకి ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలి?? మహాత్ముల, భక్తుల, సద్గురువుల, వారి శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేసారో గమనిస్తూ...వాటిని ఆచరిస్తూ పోతే..మనం అన్నిటినీ ఒదులుకోవటానికి సిద్ధపడగానే భగవంతుడు అంతులేని ప్రేమ అనే సంపదని ప్రసాదిస్తారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Chaitanya Charitamrita Madhya 8.138 Archived 2011-05-25 at the Wayback Machine puruṣa, yoṣit, kibā sthāvara-jaṅgama sarva-cittākarṣaka, sākṣāt manmatha-madana “The very name Kṛṣṇa means that He attracts even Cupid. He is therefore attractive to everyone—male and female, moving and inert living entities. Indeed, Kṛṣṇa is known as the all-attractive one.
  2. "Bhagavad-Gita 18.55". Archived from the original on 2007-03-11. Retrieved 2009-03-11.


వనరులు మార్చు

  • ఓం నమో శ్రీ నారసింహాయ - భండారు పర్వతరావు
  • శ్రీ మద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్ఛూరి మురళీధరరావు