నాగులపాడు (పెదనందిపాడు)

నాగులపాడు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం లోని రెవెన్యూయేతర, గ్రామం.

నాగులపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
నాగులపాడు is located in Andhra Pradesh
నాగులపాడు
నాగులపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°47′32″N 80°00′04″E / 15.792202°N 80.001084°E / 15.792202; 80.001084
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదనందిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ తాడేపల్లి వెంకట సుబ్బారావు
పిన్ కోడ్ 522 235
ఎస్.టి.డి కోడ్ 0863

గ్రామంలోని విద్యా సౌకర్యాలు మార్చు

శ్రీనివాస ఉన్నత పాఠశాల మార్చు

  1. ఆర్.రేవంత్ అను విద్యార్థి, ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్నాడు. ఇతడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో ద్వితీయస్థానం సంపాదించాడు.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న ఏ.ఎన్.ముఖేష్ అను విద్యార్థి రూపొందించిన హైడ్రాలిక్ బ్రిద్జ్ ప్రయోగ నమూనా, జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో, ర్రాష్ట్రస్థాయికి ఎంపికైనది.

ఎస్.టి.కాలనీలోని ప్రాథమిక పాఠశాల మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

  1. ఈ గ్రామసర్పంచిగా శ్రీ ఆళ్ళ రాఘవయ్యగారు 3 దశాబ్దాలపాటు సేవలు, మౌలిక వసతుల కల్పనకు, విశేషకృషి చేశారు. వీరు 1953 నుండి 1959 వరకూ మరియా 1964 నుండి 1990 వరకూ ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. వీరి హయాంలో నాగులపాడు నుండి పెదనందిపాడు వెళ్ళేటందుకు రహదారి వసతి కల్పించారు. దీనికొరకు, రైతులనుండి 5 గజాల వంతున స్థలాలు కొనుగోలు చేసి, తానుగూడా కొంత ఖర్చు భరించారు. పొలాలు వెళ్ళేటందుకు డొంకదారులు కల్పించారు. రక్షిత మంచినీటి పథకం, పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, పాఠశాల భవనాలు నిర్మించారు. లయన్స్ క్లబ్ సహాయంతో బాపట్ల రోడ్డు వద్ద బస్ షెల్టర్ నిర్మించారు. శ్మశానాన్ని బాగుచేయించారు. వీరు 91 సంవత్సరాల వయస్సులో, 2014,డిసెంబరు-15వ తేదీనాడు కన్నుమూసినారు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తాడేపల్లి వెంకట సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనాడు ఉప సర్పంచిగా వెంకటరావు ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మార్చు

వందల సంవత్సరాల క్రితం వెలసిన ఈ ఆలయం, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుచున్నది. ఇక్కడ నాగేంద్రస్వామి వెలసినందున ఈ గ్రామానికి "నాగులపాడు" అని పేరు వచ్చినదని చరిత్రకారుల అభిప్రాయం. నాగులచవితికి, జిల్లా నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. 49 శిరస్సులుగల నాగేంద్రుడు, పైన బాలసుబ్రహ్మణ్యస్వామి పాలరాతి విగ్రహం, దీనిపైన నిర్మించిన ఆలయం విశిష్టతను సంతరించుకున్నవి. ఈ ఆలయం చారిత్రాత్మకంగా, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధిచెందినది. ఈ స్వామివారు, వరాలిచ్చే ఆపద్బాంధవుడని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఈ దేవాలయంలో ప్రతి గురువారం, ఆదివారం పిల్లల చెవులకు, ముక్కులకు పోగులు కుట్టించి, పొంగళ్ళు పెట్టి, నైవేద్యాలు సమర్పించటం ఆనవాయితీ. ఈ ప్రాంతప్రజలు ఎక్కువగా తమ పిల్లలకు నాగరాజు, నాగేశ్వరరావు, నాగవల్లి అను పేర్లు పెట్టుకుంటుంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ మాసం (మే నేల) లో, ఎనిమిది రోజులపాటు, కన్నులపండువగా నిర్వహించెదరు. ఈ సప్తాహంలో ఆఖరిరోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించెదరు. ఈ వేడుకలలో పలు భజన సమాజాలవారు భజన కార్యక్రమాలు వీనుల విందుగా నిర్వహించెదరు. ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం, ప్రత్యేక గదులు, కళ్యాణమండపాలు నిర్మించారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

ఈ గ్రామానికి చెందిన సూరే పల్లవీరాం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా పొందినారు. ఈమె ఇ.సి.ఇ. విభాగంలో 4జి సాంకేతిక పరిఙానానికి సంబంధించిన అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఈమెకు ఈ డాక్టరేటు ప్రదానం చేసారు.

మూలాలు మార్చు