నాగులపాలెం, ప్రకాశం జిల్లా, పర్చూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి కోడ్: 08594.

నాగులపాలెం
గ్రామం
నాగులపాలెం is located in Andhra Pradesh
నాగులపాలెం
నాగులపాలెం
నిర్దేశాంకాలు: 15°57′N 80°16′E / 15.95°N 80.27°E / 15.95; 80.27Coordinates: 15°57′N 80°16′E / 15.95°N 80.27°E / 15.95; 80.27 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపర్చూరు మండలం
మండలంపర్చూరు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523169 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

పర్చూరు 4 కి.మీ, బోదవాడమండగుంట 5 కి.మీ, నూతలపాడు 5 కి.మీ, ఆదిపూడి 6 కి.మీ, జాగర్లమూడి 7 కి.మీ.

సమీప మండలాలుసవరించు

దక్షణాన కారంచేడు మండలం, పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన పెదనందిపాడు మండలం, దక్షణాన ఇంకొల్లు మండలం.

గ్రామ ప్రముఖులుసవరించు

  • ఇనగంటి ఇమాం సాహెబ్ ప్రఖ్యాత క్లారినెట్ విద్వాంసులు. ఆకాశవాణి నిలయవిద్వాంసులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి, శ్రోతల మనసులను రంజింపజేసినారు. రాగసుధారసం బిరుదాంకితులు. వీరు 2017, ఏప్రిల్-5న అనారోగ్యంతో పరమపదించారు. [5]
  • దావూద్‌ ఇనగంటి

నాగుబడి చారిటబుల్ ట్రస్ట్సవరించు

ఈ గ్రామంలో శ్రీ నాగుబడి సుబ్బారావు 2003 లో "నాగుబడి చారిటబుల్ ట్రస్ట్" పేరుతో పాఠశాల స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా బధిర బాలబాలికలకు ఉచిత విద్య, వసతి, భోజనం ఏర్పాటు చేసి వారికి నృత్యం, చిత్రలేఖనం, టైలరింగ్ మొదలగు పలు అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు పలు జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించారు.

ఉప్పలపాటి ప్రియాంక సవరించు

నాగులపాలెం గ్రామానికి చెందిన శ్రీ ఉప్పలపాటి జగదీష్, ఉమాలక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక, 2015, మే-28వ తేదీనాడు ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర ఎంసెట్ పరీక్షలో, వైద్య విభాగంలో ఆ రాష్ట్రంలోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలైనది. ఈమె జాతీయస్థాయిలో నిర్వహించిన ఎయింస్ (All India Institute of Medical Scinces) ప్రవేశా పరీక్షలలో 41వ స్థానం సంపాదించింది. [3]&[4]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
  • 14.04.2013 ఈనాడు వ్యాసం

[2] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-17; 9వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, మే-29; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-21; 7వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2017, ఏప్రిల్-6; 6వపేజీ.