ఇనగంటి ఇమాం సాహెబ్

ఇనగంటి ఇమామ్ సాహెబ్ ప్రఖ్యాత క్లారినెట్ విద్వాంసులు. ఆకాశవాణి నిలయవిద్వాంసులు.ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం 1953 లో మీరాసాహెబ్,హుస్సేనమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి, శ్రోతల మనసులను రంజింపజేసినారు. రాగసుధారసం బిరుదాంకితులు.తెలుగువారి ఖ్యాతిని చాటిన గొప్ప సంగీత కళాకారులు.చిన్నతనం నుండే క్లారినెట్ వాద్యాన్ని మౌలా గారివద్ద అభ్యసించారు.తరువాత పోరూరి లక్ష్మీనరసింహారావు గారి వద్ద శిక్షణ పొందారు.అన్నవరపు రామస్వామి వద్ద కూడా కొంతకాలం శిష్యరికంచేసి, ఆకాశవాణి వారిచే బి.హై గ్రేడ్ కళాకారునిగా గుర్తింపు పొందారు.బెంగళూరు ఆకాశవాణిలో 1991 లో నిలయ విద్వాంసునిగా ఉద్యోగంలో చేరారు.అక్కడ ఎన్నో వాద్యగోష్టులలోను, సంగీత సభలలోను పాల్గొన్నారు.1996 లో విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి బదిలీపై వచ్చి,అక్కడే 2011వరకూ పనిచేశారు. ఇమాంసాహెబ్ కచేరీలలో ఆయన ప్రదర్శించే రాగప్రవాహం, అప్రతిహతంగా కొనసాగేది.సున్నితమైన శ్రుతిశుద్ధ నాదంతో ఆయన పలికించే ప్రతి కీర్తనా శ్రోతల మనో ఫలకాలపై చెరగని ముద్ర వేసుకొనేది.మన తెలుగు రాష్ట్రాలలోనే కాక,కర్ణాటక,తమిళనాడు,కేరళ రాష్ట్రాల శ్రోతలనూ తన సంగీతంతో మైమరపించారాయన! కర్ణాటక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏటా జరిగే పెక్కు సంగీతోత్సవాలలో ప్రథమశ్రేణి కళాకారుల సరసన ఇమాంసాహెబ్ గారి క్లారినెట్ కచేరీ ఏర్పాటయ్యేది.ఆ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు మెండుగా ఉండేవారు.ప్రఖ్యాత డోలు విద్వాంసులు,ఒంగోలుకు చెందిననిడమానూరి లక్ష్మీనారాయణ గారి చేతులమీదుగా 'రాగ సుధాకర' బిరుదాన్ని అందుకున్నారు.5.4.2017 న తాడేపల్లి లో తన స్వగృహంలో మరణించారు.

ఇనగంటి ఇమామ్‌ సాహెబ్
ఇనగంటి ఇమాం సాహెబ్
జననంఇనగంటి ఇమామ్‌ సాహెబ్
1953
నాగులపాలెం, ప్రకాశం జిల్లా
మరణం2017 ఏప్రిల్ 5(2017-04-05) (వయసు 64)
తాడేపల్లి
వృత్తినిలయ విద్వాంసుడు, ఆకాశవాణి
క్రియాశీలక సంవత్సరాలు1991-2017
ప్రసిద్ధిక్లారినెట్ వాద్య విద్వాంసుడు
తల్లిదండ్రులుమీరాసాహెబ్,హుస్సేనమ్మ
పురస్కారాలురాగ సుధాకర

మూలాలు

మార్చు