కొల్లా రామయ్య
కొల్లా రామయ్య (1930 - 2008): గాంధేయ వాది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులుగా (1955 - 1962) పనిచేసారు.
జననం
మార్చుకొల్లా రామయ్య గారు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం లో ఒక సంపన్న రైతు కుటుంభంలో 1930 జూలై 12న కొల్లా సుబ్బారాయుడు, రంగమ్మ దంపతులకు జన్మించారు.
రాజకీయ జీవితం
మార్చు1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో కొల్లా రామయ్య గారు పర్చూరు నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్దిగా శాసన సభకు ఏన్నికైనారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, వీరు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులుగా 1962 వరకు పనిచేసారు. 25 ఏళ్ళ పిన్న వయస్సులో ప్రముఖ కమ్యునిస్ట్ నాయకుడు కొల్లా వెంకయ్య గారిపై విజయం సాధించి సంచలనం కలిగించారు.
మరణం
మార్చుకొల్లా రామయ్య గారి ధర్మపత్ని అలివేలమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రాజకీయ జీవితం నుండి వైదొలిగిన రామయ్య గారు 2008 డిసెంబర్ 10న నాగులపాలెం గ్రామంలో పరమపదించారు.