నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్

నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోల్ జంక్షన్ లో నిర్మించిన ఫ్లైఓవర్‌.[1] ఉప్పల్‌ - ఎల్బీనగర్‌ మార్గంలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటుగా నాగోల్, కొత్తపేట ప్రధాన లింక్‌రోడ్డు మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్‌ నిర్మించారు.[2] 2022 అక్టోబరు 26న మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాడు. హైదరాబాదు నగరంలో నిర్మించిన 16వ ఫ్లైఓవర్‌ ఇది.[3]

నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్
నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్
ప్రదేశం
నాగోల్, హైదరాబాదు, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E / 17.373576; 78.568726
జంక్షన్ వద్ద
రహదార్లు
ఉప్పల్‌ - ఎల్బీనగర్‌, నాగోల్-కొత్తపేట
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్6
నిర్మాణం చేసినవారువాడుకలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2022, అక్టోబరు 26
గరిష్ట
వెడల్పు
980 మీటర్ల పొడవు
24 మీటర్ల వెడల్పు

ప్రణాళిక

మార్చు

నాగోల్ జంక్షన్ కు సమీపంలోని కామినేని నుంచి హయత్‌నగర్‌ వరకు ఫ్లైఓవర్‌ నిర్మించాల్సివుండగా, మెట్రోరైలు రెండోదశలో వచ్చే ఇబ్బందుల దృష్ట్యా ఆ ఫ్లైఓవర్‌ ప్రతిపాదనను విరమించుకోవడంతో, ఆ ప్యాకేజీలో భాగంగా నాగోల్‌ జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ప్రణాళిక వేయబడింది.[4]

నిర్మాణ వివరాలు

మార్చు

సికింద్రాబాదు - ఎల్‌.బి. నగర్‌, కొత్తపేట - బండ్లగూడ మార్గాలలో వెళ్ళేవారికి, మన్సూరాబాద్‌తో సహ ఎల్‌బీనగర్‌ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళేవారికి నాగోల్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించేందుకు, సిగ్నల్‌ ఫ్రీగా వెళ్ళేందుకు 143.58 కోట్ల రూపాలయతో 980 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఒకే వరుస స్తంభాలపై ఆరులేన్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగింది. ఉప్పల్‌ వైపు నుంచి కామినేని, ఎల్‌బీనగర్‌ వైపు వెళ్ళేవారికి మూసీ బ్రిడ్జి నుండి దాదాపు 200 మీటర్ల తర్వాత ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్‌ అలకాపురికి దాదాపు 500 మీటర్ల ముందుగా ముగుస్తుంది.[4]

69కోట్ల వ్యయంతో 990 మీటర్ల ఫ్లై ఓవర్‌ కారిడార్‌ను చేపట్టారు. 23 పిల్లర్స్‌, 22 స్పాన్స్‌తో 600 మీటర్ల వయాడక్ట్‌ పొజిషన్‌, 300 మీటర్ల అప్రోచ్‌ పొడవుతో ఆర్‌ఈ వాల్‌ నిర్మాణం జరిగింది.

ప్రారంభం

మార్చు

2022 అక్టోబరు 26న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖమంత్రి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, సీఈ దేవానంద్‌, ఎస్‌సీ రవీందర్‌రాజు, మేడ్చల్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దర్గా దయాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు అరుణ, పవన్‌కుమార్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్న, పద్మానాయక్‌, సామ తిరుమల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, కుంట్లూరు వెంకటేశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.[5][6][7]

మూలాలు

మార్చు
  1. Telanganatoday (2022-02-07). "Hyderabad: Nagole flyover to be ready by July". Telangana Today. Archived from the original on 2022-02-06. Retrieved 2022-04-09.
  2. telugu, NT News (2022-04-07). "నాగోల్‌ జంక్షన్‌లో.. సిగ్నల్‌ పడదిక". Namasthe Telangana. Archived from the original on 2022-04-09. Retrieved 2022-04-09.
  3. "నాగోల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". 26 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  4. 4.0 4.1 "ఈస్ట్‌ జోన్‌లో ఈజీ జర్నీ". Sakshi. 2019-01-05. Archived from the original on 2019-01-05. Retrieved 2022-04-09.
  5. Velugu, V6 (2022-10-26). "ఎన్నికలప్పుడే రాజకీయాలు..ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ చేద్దాం". V6 Velugu. Archived from the original on 2022-10-26. Retrieved 2022-10-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Vaartha Online Edition ముఖ్యాంశాలు - నాగోల్ లో ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Vaartha. 2022-10-26. Archived from the original on 2022-10-26. Retrieved 2022-10-26.
  7. "» ఉప్పల్ టు ఎయిర్‌పోర్టు.. ఆరామ్‌సేజర్నీ". 27 October 2022. Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.