నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, వర్గల్ మండలం, నాచారం గ్రామంలోని గుట్టపై ఉన్న దేవాలయం. గజ్వేల్‌ పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో 44వ జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్‌ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఎంతో మహిమగల దేవాలయంగా పేరుగాంచిన ఈ దేవాలయం తెలంగాణలోనే రెండో యాదాద్రిగా పిలువబడుతోంది.[1]

నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం is located in Telangana
నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు:17°49′28″N 78°31′13″E / 17.8243801°N 78.5204004°E / 17.8243801; 78.5204004
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్ధిపేట జిల్లా
ప్రదేశం:నాచారం, వర్గల్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:లక్ష్మీనరసింహస్వామి

చరిత్ర మార్చు

పూర్వం ఈ దేవాలయాన్ని శ్వేతగిరి, గార్గేయ తపోవనం అని పిలిచేవారు. నారదుడు ఇక్కడ ఓడిపోయాడని, నాచార్ అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి నాచారం గుట్ట అని పేరు వచ్చిందని హిందూ పురాణాల ప్రకారం స్థానికులు చెబుతున్నారు. గర్భగుడి లోపల రాతిలో అందంగా చెక్కబడిన స్వయంబు నరసింహస్వామి, లక్ష్మీ కొలువై ఉన్నారు.

ప్రాగణంలోని ఇతర దేవాలయాలు మార్చు

ఈ దేవాలయ ప్రాగణంలో సాయిబాబా దేవాలయం, నవగ్రహాలయం, శివాలయం, రామాలయం, ఆండాళమ్మ దేవాలయం, భైరవాలయం మొదలైనవి ఉన్నాయి.

పూజలు-ఉత్సవాలు మార్చు

ఈ దేవాలయలంలో ప్రతిరోజూ కుంకుమార్చన, అభిషేకం, వాహన పూజలు, శాశ్వత కల్యాణం, సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు[2] స్వామివారి అధ్యయనోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతాయి. శ్రావణ మాసంలో అనేకమంది భక్తులు వచ్చి స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొంటారు.[3]

అభివృద్ధి పనులు మార్చు

ఈ దేవాలయం సమీపంలో రూ. 7.48 కోట్లతో హల్ది వాగు సుందరీకరణ, చెక్‌డ్యామ్‌ నిర్మాణాలు, బతుకమ్మ ఘాట్లు, స్నానపు ఘాట్లు ఏర్పాటుచేశారు.

మూలాలు మార్చు

  1. "నాచగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-09. Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-02.
  2. "వైభగంగా నాచగిరి లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు". ETV Bharat News. Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-02.
  3. "నాచగిరి ఆలయంలో శ్రావణ శోభ". andhrajyothy. Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-02.