నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్

నాచరాజు వెంకట శ్రవణ్‌ కుమార్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్

తెలంగాణ హైకోర్టులో నీటిపారుదలశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1967 ఆగస్టు 18
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు శారద, వెంకట కిషన్‌రావు
బంధువులు పీవీ నరసింహారావు (తాత)
పూర్వ విద్యార్థి నల్సార్‌ యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

నాచరాజు వెంకట శ్రవణ్‌ కుమార్‌ 1967 ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో శారద, వెంకట కిషన్‌రావు దంపతులకు జన్మించాడు.[3] ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీకాం, ఎల్‌ఎల్‌బీ, రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంబీఏ, నల్సార్‌ యూనివర్సిటీ నుండి సైబర్‌ లాలో పీజీ డిప్లొమా పూర్తి చేసి 2005 నవంబర్‌ 17న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం

మార్చు

ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ రావు అండ్‌ కో లాయర్స్‌ ఆఫీసులో జూనియర్‌ న్యాయవాదిగా చేరి కింది కోర్టులు, హైకోర్టు, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్స్‌లో కేసులు వాదించాడు. ఆయన ప్రస్తుతం హైకోర్టులో నీటిపారుదలశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[2][4] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[5] శ్రవణ్ కుమార్ 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమా‌ణ‌స్వీ‌కారం చేశాడు[6]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. 2.0 2.1 TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (9 February 2022). "పీవీ పెద్దల్లుడు కిషన్‌రావు మృతి". Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.
  4. Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  5. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  6. V6 Velugu (24 March 2022). "హైకోర్టు కొత్త న్యాయ‌మూ‌ర్తుల ప్రమా‌ణ‌స్వీ‌కారం" (in ఇంగ్లీష్). Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)