నాటకాల రాయుడు
నాటకాల రాయుడు 1969లో విడుదలైన తెలుగు సినిమా. ఇది హిందీ చిత్రం 'ఆల్బెలా' (Albela, 1951) (భగవాన్ కథానాయకునిగా) ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో గాయని పి.సుశీల పాడిన 'నీలాల కన్నుల్లో మెలమెల్లగా' పాట జనరంజకమైనది. (హిందీలో సి.రామచంద్ర స్వరకల్పనలో తయారైన పాట ఆధారంగా)
నాటకాల రాయుడు (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. సంజీవి |
---|---|
నిర్మాణం | దిడ్డి శ్రీహరిరావు |
తారాగణం | నాగభూషణం, కాంచన, కైకాల సత్యనారాయణ, చిత్తూరు నాగయ్య, బి.పద్మనాభం, ప్రభాకరరెడ్డి |
సంగీతం | జి.కె.వెంకటేష్ |
గీతరచన | ఆత్రేయ |
సంభాషణలు | గొల్లపూడి మారుతీరావు |
నిర్మాణ సంస్థ | హరిహర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చిత్రకథ
మార్చుబుజ్జిబాబు (నాగభుషణం) కు నాటకాల పిచ్చి. తండ్రి ఉద్యోగాలు వేయిస్తుంటే ఆ నాటకాల పిచ్చి మూలంగా అన్నింటిని పోగొట్టుకుంటాడు. చివరికి కోపం వచ్చి తండ్రి ఆదిశేషయ్య (నాగయ్య) బుజ్జిబాబును ఇంటి నుండి గెంటివేస్తాడు. అయినా తల్లి (హేమలత) మాత్రం మహానటుడు కమ్మని దీవిస్తుంది. తండ్రి కూతురి పెళ్ళి కోసం అప్పులు చేస్తాడు. అన్నయ్య రామారావు (సత్యనారాయణ) చెల్లి పెళ్ళి కోసం భార్య నగలు అమ్మేస్తాడు. అయితే ఆ డబ్బంతా దొంగలు ఎత్తుకు పోతారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కూతుర్ని తల్లి చేరదీస్తుంది. ఇల్లు వదిలి చాలా కష్టాలు పడి చివరికి రంగమార్తాండ నాటక సంస్థ యజమాని గీతాదేవి (కాంచన) ఇంట్లో పనివాడుగా చేరి ఆమె అభిమానాన్ని సంపాదిస్తాడు. ఆ కంపెనీ మేనేజర్ రాజశేఖర్ (పద్మనాభం), హీరో ప్రేమ్ కుమార్ (ప్రభాకర రెడ్డి) లు ఎంతగా ప్రతిఘటించినా చివరికి మంచి నటుడిగా ఎదిగి పేరుతెచ్చుకుంటాడు.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- నాగభూషణం - బుజ్జిబాబు, నాటకాల రాయుడు
- కాంచన - గీతాదేవి
- చిత్తూరు నాగయ్య - ఆదిశేషయ్య, బుజ్జిబాబు తండ్రి
- పి.హేమలత - బుజ్జిబాబు తల్లి
- కైకాల సత్యనారాయణ - రామారావు, బుజ్జిబాబు అన్నయ్య
- బి. పద్మనాభం - రంగమార్తాండ రాజశేఖర్
- ప్రభాకర రెడ్డి - ప్రేమ్ కుమార్
- అనిత
- సీత
పాటలు
మార్చు- ఇదేనా నే నెదురు చూచిన ప్రజాస్వామ్యం ఇదేనా నేను - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
- ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చిబాబు తలరాత ఒకే తికమక మకతక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
- చిన్నవాడా వన్నెకాడా అన్నెము పున్నెము ఎరుగనోడా నిన్నడగనా ఒక్క మాట - పి.సుశీల - రచన: ఆత్రేయ
- ద్రౌపతీ పంచభర్త్రుకా ధైర్యమూని రాజరాజుకు (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: వడ్డాది
- నలభైకి డెభైకి తేడా ఎంతా - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, బి. వసంత బృందం - రచన: ఆత్రేయ
- నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే నిండారా రావే (సంతోషం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
- నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే నిండారా రావే (విషాదం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
- పట్టుపాన్పున వెన్నెల పరచినటుల (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు, సుశీల - రచన: వడ్డాది
- రథము సిద్ధము నీ మనోరధము తీర్ప (సంవాద పద్యాలు) - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల
- రాయుడా నా రాయుడా నాటకాల రాయుడా స్వతంత్ర భారత పౌరుడా - పిఠాపురం నాగేశ్వరరావు బృందం - రచన: ఆత్రేయ
- వేళచూడ వెన్నెలాయె లోన చూడ వెచ్చనాయే ఎందకో మరి - పి.సుశీల - రచన: ఆత్రేయ
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)