వడ్డాది బుచ్చి కూర్మనాథం
తెలుగు సినిమా గేయ రచయిత. నవలాకారుడు.
వడ్డాది బుచ్చి కూర్మనాథం తెలుగు సినిమా గేయరచయిత. ఇతడు విజయనగరానికి చెందినవాడు. 1950 ప్రాంతాలలో సినీ పరిశ్రమకు వచ్చాడు.[1] ’ఇలవేలుపు’ లో సుశీల, లీల, రఘునాథ పాణిగ్రాహి పాడిన ’చల్లని రాజా ఓ చందమామ’ పాట ద్వారా పాప్యులర్ అయ్యాడు. తర్వాత చాలా డబ్బింగ్ చిత్రాలకు పాటలు వ్రాశాడు. ఆ రోజుల్లో రిలీజైన డబ్బింగ్ చిత్రాలలో కొన్నిటికి ఇతని పేరు కె.వడ్డాది గా వుంది. ’కె’ అంటే కూర్మనాథం అనే అనుకోవాలి. అంతగా సక్సెస్ కి నోచుకోని వడ్డాది 1973 తర్వాత రాసిన చిత్రాలేమిటి అనే వివరాలు అందుబాటులో లేవు. శ్రీకాకుళానికి చెందిన చిత్రకారుడు వడ్డాది పాపయ్యకి, పాటల రచయిత వడ్డాదిగా సంగీతాభిమానులకు పరిచయమైన వడ్డాది బుచ్చి కూర్మనాథంకి - ఇంటి పేరు లోనే తప్ప ఇంకెక్కడా సామ్యం లేదు[2].
వడ్డాది బుచ్చి కూర్మనాథం | |
---|---|
జననం | వడ్డాది బుచ్చి కూర్మనాథం |
ఇతర పేర్లు | వడ్డాది, కె.వడ్డాది |
వృత్తి | సినిమా గేయ రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1956-1973 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చల్లని రాజా ఓ చందమామ |
గుర్తించదగిన సేవలు | ఇలవేలుపు నాటకాల రాయుడు |
ఫిల్మోగ్రఫీ
మార్చుఇతడు పాటలు వ్రాసిన కొన్ని సినిమాలు:
- ఇలవేలుపు (1956)
- కాలాంతకుడు (1960)
- జగన్నాటకం (1960)
- బాగ్దాద్ గజదొంగ (1960)
- పాపాల భైరవుడు (1961)
- హంతకుడు ఎవరు (1964)
- మారని మనుష్యులు (1965)
- ఎవరాస్త్రీ? (1966)
- కత్తిపోటు (1966)
- పాదుకా పట్టాభిషేకం (1966)
- మా అన్నయ్య (1966)
- అంతులేని హంతకుడు (1968)
- దెబ్బకు దెబ్బ (1968)
- నాటకాల రాయుడు (1969)
- మేమే మొనగాళ్లం (1971)
- కనకదుర్గ పూజామహిమ (1973)
రచనలు
మార్చుఇతని ఈ క్రింది గ్రంథాలు ప్రచురితమయ్యాయి[3].
- దూరతీరాలు (1966) - నవల
- శాంతియాత్ర (1968)
- అందిన ఆదర్శం అందని అనురాగం (1970) - నవల
మూలాలు
మార్చు- ↑ పైడిపాల (2010). తెలుగు సినీగేయకవుల చరిత్ర (1 ed.). చెన్నై: స్నేహ ప్రచురణలు. p. 195.
- ↑ మంగు రాజా. "Profiles". Raja Music Bank. రాజా. Retrieved 20 May 2020.
- ↑ వరల్డ్ కాట్.ఆర్గ్^లో వడ్డాది వివరాలు