నాతయ్యపాలెం
నాతయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ప్రాంతం, నగర కేంద్రంమైన మద్దిలపాలెం నుండి సుమారు 17 కి.మీ.ల దూరంలో ఉంది.[2] ఇది షీలా నగర్, గాజువాక ప్రాంతాల మధ్యలో ఉంది.[3]
నాతయ్యపాలెం
నాతయ్యపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′38″N 83°11′58″E / 17.710579°N 83.199344°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530012 |
Vehicle registration | ఏపి-31 |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో ద్వారకా నగర్, ఎన్ఎడి ఎక్స్ రోడ్, మధురవాడ, తుంగలం, బిహెచ్‌పివి టౌన్‌షిప్, ఆటో నగర్, మిండి విలేజ్, అహ్మద్‌నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
భౌగోళికం
మార్చుఇది 17°42′38″N 83°11′58″E / 17.710579°N 83.199344°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[4]
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాతయ్యపాలెం కాలనీ మీదుగా గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్, బిహెచ్‌పివి, విమానాశ్రయం, ఎన్ఏడి ఎక్స్ రోడ్, బిర్లా జంక్షన్, గురుద్వార్, కుర్మనపాలెం, గాంటియాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]
మూలాలు
మార్చు- ↑ "Nathayyapalem, Visakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
- ↑ "location". the maps of india. 22 July 2017. Retrieved 11 May 2021.
- ↑ "about". times of india. 14 March 2017. Retrieved 11 May 2021.
- ↑ "Nathayyapalem Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 11 May 2021.