మద్దిలపాలెం

విశాఖపట్నంలోని ఒక ప్రాంతం.

మద్దిలపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీరప్రాంతంలో కలిగి ఉన్న ప్రాంతం.[1] గతంలో ఇది విశాఖపట్నం వెలుపల ఒక చిన్న శివారు ప్రాంతంగా ఉండేది.[2]

మద్దిలపాలెం
సమీపప్రాంతం
మద్దిలపాలెం జంక్షన్ నుండి కైలాసగిరిదృశ్యం
మద్దిలపాలెం జంక్షన్ నుండి కైలాసగిరిదృశ్యం
మద్దిలపాలెం is located in Visakhapatnam
మద్దిలపాలెం
మద్దిలపాలెం
విశాఖట్నం నగర పటంలో మద్దిలపాలెం స్థానం
Coordinates: 17°44′18″N 83°19′23″E / 17.738224°N 83.323039°E / 17.738224; 83.323039
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530013
Vehicle registrationఏపి 31, 32, 33

ఆర్థిక వ్యవస్థ మార్చు

 
మద్దిలపాలెంలోని సిఎంఆర్ సెంట్రల్

విశాఖపట్నంలోని ప్రధాన వాణిజ్య, నివాస శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ మద్దిలపాలెంలో అశోక్ లేలాండ్ ఆటో తయారీ, జయభేరి మారుతి సంస్థలు ఉన్నాయి. విశాఖపట్నం నగరంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఉంది.

రవాణా మార్చు

మద్దిలపాలెం, విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటి. విశాఖపట్నం బిఆర్టిఎస్ ఈ ప్రాంతాన్ని అసిల్ మెట్టతో కలుపుతోంది. మద్దిలపాలెం జంక్షన్ నగరంలో అత్యంత రద్దీగా ప్రాంతం. జంక్షన్ అసిల్ మెట్ట, ద్వారకా నగర్, మధురవాడ మొదలైన ప్రాంతాలకు రహదారులు ఉన్నాయి.[3]

మద్దిలపాలెం జాతీయ రహదారి ద్వారా కలుపబడి ఉంది. ఇక్కడ మద్దిలపాలెం బస్ స్టేషన్ ఉంది. ఎపిఎస్‌ఆర్‌టిసి ఆధ్వర్యంలో ఇక్కడినుండి విశాఖపట్నంలో అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]

విద్య మార్చు

 
మద్దిలపాలెంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం

ఇక్కడ అనేక విద్యాసంస్థలు, కోచింగ్-శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్, డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలు ఇక్కడ ఉన్నాయి.

సౌకర్యాలు మార్చు

ఇక్కడికి సమీపంలోరి పిఠాపురం కాలనీలో కళాభారతి ఆడిటోరియం ఉంది.

మూలాలు మార్చు

  1. "location". maps of india. 12 February 2017. Retrieved 15 May 2021.
  2. "Maddilapalem Locality". www.onefivenine.com. Retrieved 15 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.
  4. "transport". new indian express. 14 September 2017. Retrieved 15 May 2021.