నాయకుడు (2023 సినిమా)
నాయకుడు 2023లో విడుదలైన తెలుగు సినిమా. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై తమిళంలో మామన్నన్ పేరుతో ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా తెలుగులో నాయకుడు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ మల్టీప్లెక్స్ విడుదల చేశారు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళంలో 2023 జూన్ 29న, తెలుగులో జూన్ 14న థియేటర్లలో విడుదల చేసి[1], నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జులై 27న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నాయకుడు | |
---|---|
దర్శకత్వం | మారి సెల్వరాజ్ |
రచన | మారి సెల్వరాజ్ |
దీనిపై ఆధారితం | మామన్నన్ |
నిర్మాత | ఉదయనిధి స్టాలిన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | తేని ఈశ్వర్ |
కూర్పు | సెల్వ ఆర్.కే. |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | రెడ్ జెయింట్ మూవీస్ |
పంపిణీదార్లు | సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ |
విడుదల తేదీ | 14 జూలై 2023 |
సినిమా నిడివి | 155 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుమామన్నన్ (వడివేలు) అణాగారిన వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తుంటారు. ఆయన కొడుకు వీరన్ (ఉదయనిధి ) అభ్యుదయ భావాలు ఉన్న యువకుడు. కుల వ్యవస్థ వల్ల చిన్నప్పటి నుంచే అనేక అవమానాలు ఎదుర్కొంటాడు. వీరకు స్నేహితురాలైన లీలా (కీర్తి సురేష్) స్థానికంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. ఆమె కోచింగ్ సెంటర్‌ను బలవంతంగా మూయించే ప్రయత్నం రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేసేందుకు వచ్చిన మామన్నన్, వీరన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
మార్చు- ఉదయనిధి స్టాలిన్
- వడివేలు
- ఫహాద్ ఫాజిల్
- కీర్తి సురేష్
- లాల్
- విజయకుమార్
- ఆదిమురాయ్ ఆసన్
- అళగం పెరుమాళ్
- సునీల్ రెడ్డి
- గీతా కైలాసం
- రవీనా రవి
- ఇంధుమతి మణికందన్
- టీ.ఎన్.బి కతీర్
- పాత్మెన్
- రామకృష్ణన్
- మధన్ ధాక్షిమూర్తి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రెడ్ జెయింట్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్
- నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారి సెల్వరాజ్
- సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
- సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
- ఎడిటర్ : ఆర్కే సెల్వ
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (7 July 2023). "'నాయకుడు' వస్తున్నాడు". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
- ↑ Namasthe Telangana (18 July 2023). "రెండు వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి నాయకుడు సినిమా..!". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
- ↑ Eenadu (27 July 2023). "రివ్యూ: నాయకుడు.. తమిళ బ్లాక్‌బస్టర్ తెలుగులో మెప్పించిందా?". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
- ↑ A. B. P. Desam (13 July 2023). "నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.