రవీనా రవి (జననం 11 డిసెంబర్ 1993) భారతీయ డబ్బింగ్ కళాకారిణి, నటి. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన అనేక టెలివిజన్ ప్రకటనలను తమిళం, మలయాళం, తెలుగు భాషలలో ఆమె డబ్బింగ్ చెప్పింది. ఆమె వాయిస్ ఆర్టిస్ట్ శ్రీజ రవి, నటుడు,గాయకుడు రవీంద్రనాథన్ కృష్ణన్‌ల కుమార్తె.[1]

రవీనా రవి
జననం (1993-12-11) 1993 డిసెంబరు 11 (వయసు 30)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • వాయిస్ ఆర్టిస్ట్
  • నటి
క్రియాశీల సంవత్సరాలు
  • 1995–ప్రస్తుతం (డబ్బింగ్)
  • 2017–ప్రస్తుతం(నటన)
తల్లిదండ్రులు

ఆమె సత్తై (2012)తో ప్రధాన నటీమణులకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది.[2] ఇందులో చిత్ర కథానాయిక మహిమా నంబియార్ కు గాత్రదానం చేసింది. ఆమె ఒరు కిదయిన్ కరుణై మను (2017)తో తెరపై నటిగా అరంగేట్రం చేసింది.[3]

ఫిల్మోగ్రఫీ

మార్చు

ఆమె వాయిస్ ఆర్టిస్ట్‌గా చేసిన కొన్ని తెలుగు సినిమాలు..

Year Film For Whom Notes
2015 ఓకే బంగారం రమ్య సుబ్రమణియన్ డబ్బింగ్ సినిమా
2016 ప్రేమమ్ మడోన్నా సెబాస్టియన్
2018 2.0 ఎమీ జాక్సన్ డబ్బింగ్ సినిమా
నవాబ్ ఐశ్వర్య రాజేశ్ డబ్బింగ్ సినిమా

మూలాలు

మార్చు
  1. Rao, Arpitha (2 June 2016). "Dubbing artist Raveena Ravi giving life to characters". Deccan Chronicle. Archived from the original on 12 May 2019. Retrieved 15 December 2019.
  2. "Voice of the Stars: Dubbing Artist Raveena Interview". 3 September 2015. Archived from the original on 12 May 2019. Retrieved 15 December 2019.
  3. Kaushik, Lm (12 June 2017). "Dubbing artiste Raveena on her decision to get into acting". The Hindu. Archived from the original on 12 November 2020. Retrieved 15 December 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=రవీనా_రవి&oldid=3951416" నుండి వెలికితీశారు