నాయట్టు
నాయట్టు 2021లో మలయాళం విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జోజు జార్జ్, కుంచాకో బోబన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021, ఏప్రిల్ 8న విడుదల కాగా, 2021 మే 9న సింప్లి సౌత్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో విడుదలైంది.[1]
నాయట్టు | |
---|---|
దర్శకత్వం | మార్టిన్ ప్రక్కట్ |
రచన | షాహి కబీర్ |
నిర్మాత | రంజిత్ పి.ఎం.శశిధరన్ మార్టిన్ ప్రక్కట్ |
తారాగణం | కుంచాకో బోబన్ జోజు జార్జ్ నిమిషా సజయన్ |
ఛాయాగ్రహణం | శైజు ఖాలిద్ |
కూర్పు | మహేష్ నారాయణన్, రాజేష్ రాజేంద్రన్ |
సంగీతం | విష్ణు విజయ్ |
నిర్మాణ సంస్థలు | గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్ కంపెనీ మార్టిన్ ప్రక్కట్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | మ్యాజిక్ ఫ్రేమ్స్ |
విడుదల తేదీ | 8 ఏప్రిల్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
కథ
మార్చుకేరళలోని ఒక టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రవీణ్ మైఖేల్ (బోబన్) తన తండ్రి చనిపోవడం ద్వారా వచ్చిన పోలీస్ జాబ్ చేస్తూ ఉంటాడు తనకు తల్లి మాత్రమే ఉంటుంది. ఇక అదే స్టేషన్ లో ఏఎస్‌ఐగా మనియన్ (జోజు జార్జ్) కూడా పనిచేస్తూ ఉంటాడు తనకి కూతురు భార్య ఉంటారు కూతురును మంచి సింగర్ చేయాలని కొద్ది రోజుల్లో జరగబోయే కల్చరల్ పోటిలకోసం ఒక డాన్స్ మాస్టర్ ను పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తు ఉంటాడు.అదే స్టేషన్ లో పని చేసే సునీత (నిమిష సాజయన్) తన తల్లితో కలిసి ఉంటుంది ఆమెకు ఊరిలో ఒక వ్యక్తితో సమస్య ఉంటుంది అయితే ఒకరోజు సునీతతో సమస్య ఉన్న వ్యక్తి తన వాళ్ళతో స్టేషన్ కు రావడం అక్కడ అనుకోకుండా ప్రవీణ్ మైకేల్ అలాగే మణియన్ లు వాళ్ళతో గొడవ పడడం జరుగుతుంది అదే రోజు రాత్రి వీళ్ళు ముగ్గురు వెళుతున్న జీప్ యాక్సిడెంట్ అయి తాము గొడవ పడ్డ గ్రూప్ లో ఒక వ్యక్తి చనిపోతాడు దాంతో వీళ్ళను పై ఆఫీసర్స్ అరెస్ట్ చేయాలి అనుకునేసరికి పోలీసు స్టేషన్ నుంచి పరారవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది?? అసలు నేరం వీళ్ళే చేశారా లేదా అనేది మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- జోజు జార్జ్ - మనియన్, ఏఎస్‌ఐ
- కుంచాకో బోబన్ - ప్రవీణ్ మైఖేల్, సి.ఐ
- నిమిషా సజయన్ - సునీత, సి.ఐ
- జఫ్ఫార్ ఇడుక్కి - ముఖ్యమంత్రి
- వినోద్ సాగర్ - మూర్తి
- యమా గిల్గామేష్ - ఎస్పీ అనురాధ
సాంకేతిక నిపుణులు
మార్చు- దర్శకుడు: మార్టిన్ ప్రక్కట్
- స్క్రీన్‌ప్లే: షాహి కబీర్
- సంగీతం: విష్ణు విజయ్
- కథ: షాహీ కబీర్
- సినిమాటోగ్రఫీ: శైజు ఖాలిద్
- ఎడిటింగ్: మహేష్ నారాయణన్, రాజేష్ రాజేంద్రన్
మూలాలు
మార్చు- ↑ The News Minute (8 May 2021). "Kunchacko Boban starrer 'Nayattu' to stream on OTT". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
- ↑ Eenadu (16 May 2021). "Nayattu: ఈ వేట.. కీలుబొమ్మలాట - story of malayali movie nayattu". www.eenadu.net. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
- ↑ Andhrajyothy (16 May 2021). "నేటి పరిస్థితులకు నిలువుటద్దం నాయాతు!". www.andhrajyothy.com. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.