నాయినిపాక సర్వతోభద్ర దేవాలయం
నాయినిపాక సర్వతోభద్ర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, నాయినిపాక గ్రామంలో ఉన్న దేవాలయం. ఒకే శిలపై నాలుగు వైపులా దేవతా విగ్రహాలు కలిగివున్న ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు.[1] పూర్వం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేయడంవల్ల మునికుంట పేరు వచ్చిందని, నాపాక ప్రాంతాన్ని కాకతీయరాజులు పాలించినందున ఈ ఆలయానికి ‘నాపాకగుడి’అని పేరు వచ్చినట్లు, కాలక్రమేణా నైన్‌పాకగా పిలుస్తున్నట్లుగా చరిత్రకారుల అభిప్రాయం.
నాయినిపాక సర్వతోభద్ర దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°25′57″N 79°40′2″E / 18.43250°N 79.66722°E |
పేరు | |
ఇతర పేర్లు: | నాపాక సర్వతోభద్ర దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | జయశంకర్ భూపాలపల్లి జిల్లా, |
ప్రదేశం: | నాయినిపాక, చిట్యాల మండలం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ |
ప్రత్యేకత
మార్చుఇటువంటి దేవాలయం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ ఆలయంలోని సుమారు ఐదున్నర అడుగుల ఎత్తులో స్వామి మీసాలను కలిగి ఉన్నాడు.
నిర్మాణ శైలి
మార్చుఈ దేవాలయంను ఒకే శిలపై నిర్మించడం వల్ల దీనికి ఆది ఏకశిలాక్షేత్రం అని అంటారు. ఇందులోని విగ్రహాలన్నీ ఏకశిలపై చెక్కబడ్డాయి. సుమారు 50 అడుగుల ఎత్తులో (20 అడుగుల ఎత్తు గర్భాలయం, 30 అడుగుల ఎత్తుతో ఇటుకలతో గోపురం) దీని గాలి గోపురం నిర్మించబడి ఉంది. దేవాలయం చుట్టుప్రక్కల కోనేరు, చెరువు, రచ్చబండ, వరుణకొండ, స్వామివారి పాదుకలు, లజ్జగౌరి, 11 పాదులు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.
గుట్టపై మధ్యభాగంలోని గర్భాలయంకు నాలుగువైపులా ఐదున్నర అడుగుల ఎత్తులో ద్వారాలు, లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో విగ్రహం ఉన్నాయి. ఒక్కో ద్వారం నుంచి ఒక్కోవైపున్న దేవతా విగ్రహాలు (తూర్పు ద్వారం నుంచి ఉగ్ర నరసింహస్వామి, దక్షిణ ద్వారం నుంచి కాళీయమర్థనం భంగిమలో వేణుగోపాలస్వామి, పశ్చిమం వైపు బలరాముడు, ఉత్తర దిశలో సీతారామలక్ష్మణులు) కనిపిస్తుంటాయి కాబట్టి దీనిని సర్వతోభద్ర నమూనా ఆలయం అంటారు.[2]
ఈ ఆలయ గర్భగుడి ఎంతో ఎత్తులో అతిపెద్ద గాలి గోపురంలా ఉంటుంది. ఆలయ సమీపంలో కోనేరు, వెనుక భాగంలో పెద్ద సరస్సు, వరుణదేవుడి పర్వతం, రాజుల కాలంనాటి రాజ కచ్చీరు సువిశాలమైన స్థలంలో ఉంటాయి.
ఇతర వివరాలు
మార్చు- 1992లో అప్పటి పురావస్తు సహాయ సంచాలకుడు ఎన్. రామకృష్ణరావు తొలిసారిగా ఈ దేవాలయాన్ని వెలుగులోకి తెచ్చాడు.[3]
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (19 January 2020). "ఏకశిలాక్షేత్రం నాపాక సర్వతోభద్ర దేవాలయం". ntnews. మధుకర్ వైద్యుల. Archived from the original on 25 జనవరి 2020. Retrieved 21 May 2020.
- ↑ సాక్షి, తెలంగాణ (18 November 2017). "గుట్ట..గుడిగా మారింది!". Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
- ↑ డైలీహంట్, తెలంగాణ (18 April 2019). "దేవుడు ఎదురుచూడాల్సిందే!". www.dailyhunt.in. Retrieved 7 June 2020.[permanent dead link]