నాయుడుపేట
నాయుడుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక ముఖ్యపట్టణం.ఈ పట్టణ జనాభా సుమారు 50 వేలు.ఇది నెల్లూరు నగరమునకు సుమారు 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుండి 108 కిలోమీటర్లు, తిరుపతి నుండి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాయుడుపేట పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన కూడలి.ఈ పట్టణం గుండా చెన్నై,తిరుపతి,నెల్లూరు వంటి నగరములకు రోజూ అధిక సంఖ్యలో ప్రయాణీకులు వెల్తుంటారు. PIN = 524 126.
నాయుడుపేట | |
— మండలం — | |
నెల్లూరు పటములో నాయుడుపేట మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నాయుడుపేట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°54′00″N 79°54′00″E / 13.9000°N 79.9000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రం | నాయుడుపేట |
గ్రామాలు | 33 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 68,631 |
- పురుషులు | 34,802 |
- స్త్రీలు | 33,829 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 69.98% |
- పురుషులు | 77.93% |
- స్త్రీలు | 61.82% |
పిన్కోడ్ | {{{pincode}}} |
గ్రామములోని వైద్య సౌకర్యాలుసవరించు
సామాజిక ఆరోగ్య కేంద్రం.
విద్యా సౌకర్యాలుసవరించు
నాయుడుపేటలో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా "ఎ.ఎల్.సి.ఎమ్" ఉన్నత పాఠశాల చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పాఠశాలలో కొంతకాలం విద్యాభ్యాసం చేశాడు.[1] అలాగే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 1983లో స్థాపించిన ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 6 ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ రెండు గ్రంథాలయాలు ఉన్నాయి. విద్యకు సంబంధించి నాయుడుపేట పట్టణమునకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది.
రవాణా సౌకర్యాలుసవరించు
నాయుడుపేట చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-నెల్లూరు ల మధ్య ఉంది. తిరుపతి,నెల్లూరు, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్నం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చెన్నైకి ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌవుకర్యం కలదు. బెంగళూరుకి కూడా ఆదిక సంఖ్యలో బస్సు సౌకర్యం ఉంది.ఇంకా ప్రముఖ నగరమైన తిరుపతికి ప్రతి 5 నిమిషములకు బస్సులు విరివిగా ఉన్నాయి.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు విరివిగా బస్సులు ఉన్నాయి.
నాయుడుపేట చెన్నై-విజయవాడ రైలు మార్గములో ఒక స్టేషను. ఇక్కడ నుండి విజయవాడ, చెన్నై, హైదరాబాదు, .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
నాయుడుపేట స్టేషనులో ఆగు రైళ్ళు:
- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్.
- చార్మినార్ ఎక్స్ ప్రెస్.
- లక్నొ ఎక్స్ ప్రెస్.
- సర్కార్ ఎక్స్ ప్రెస్.
- జమ్ము- తావి ఎక్స్ ప్రెస్.
- డెహ్రడూన్ ఎక్స్ ప్రెస్.
వ్యవసాయంసవరించు
ఈ మండలంలో ప్రధాన వానిజ్య పంట చెరకు.దీనితోపాటుగా వరిని కుడా సాగు చేస్తారు.వ్యవసాయానికి కావలిసిన మొటర్శ్ నూ ఎ.కే.బీ బేరీపేట వారు తక్కువ దరకు అద్ద్సారు
నదులుసవరించు
ఈ ఊరు స్వర్ణముఖినది ఒడ్డున ఉంది. ఈ నది శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరి అటుపైన వాకాడు మీదుగా బంగాళాఖాతములో కలుస్తుంది.స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం ఉంది.ఈ స్వర్ణముఖి నదిలో ప్రతి సంవత్సరం యేటి పండుగలు నిర్వహిస్తారు.
పరిశ్రమలుసవరించు
నాయుడు పేటలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక బీడీ ఫ్యాక్టరీ, ఒక చక్కెర కర్మాగారము ఉన్నాయి. ఈ బీడీ ఫ్యాక్టరి వలన సుమారు 20000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.ఈ చక్కెర కర్మాగారము నుండి ఇతర దేశాలకు చక్కెర ఎగుమతి అవుతుంది. నాయుడుపేటకు సుమారు 7కి.మి దూరంలో బి.జె.టెక్సెటైల్స్ ఫ్యాక్టరి ఉంది.
బ్యాంకులుసవరించు
- ఆంధ్రాబ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఆంధ్ర ప్రగతి బ్యాంక్
- సిండికేట్ బ్యాంక్
- యు.టి.ఇ బ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇ.సి.ఇ.సి.ఇ బ్యాంక్
- కేంద్ర సహకార బ్యాంక్
సినిమాథియేటర్లుసవరించు
- సి.ఎస్.తేజ
- శ్రీ వెంకటేశ్వర ధియేటర్
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
నాయుడు పేటలో మూడు శివాలయాలు, మూడు రామాలయాలు, మూడు ఆంజనేయస్వామి ఆలయాలు, మూడు వినాయకుడి గుడులు, సత్య సాయి బాబా , షిర్డీ సాయిబాబా మందిరాలు, ఒక కృష్ణ మందిరము, కన్యకా పరమేశ్వరి ఆలయము ఒకటి ఉన్నాయి.
మూడు మసీదులు, రెండు దర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హజరత్ షా వలి దర్గా, ఇది పెద్దది. ఈ దర్గాకి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా గంథమహొత్సవం (ఉర్సు) జరుగుతుంది.అలాగే ఒక కరిమాణిక్యస్వామి ఆలయం కూడా ఉంది.స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం ఉంది.
గ్రామదేవతలుసవరించు
నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ. ఊరిలో పోలేరమ్మ జాతర ఘనంగా చేస్తారు. ఇంకా ఇక్కడ అంకమ్మ గుడి, మూకాంబిక గుడి, మహాలక్ష్మి గుడి, పెద్దపాలెమ్మ గుడి, కావమ్మ గుడి ఉన్నాయి.
ఇతర గ్రామ విశేషాలుసవరించు
నాయుడుపేట నుంచి తుమ్మురు 4కి.మి దూరంలో ఉంది.ఈ ఊరి జనాభా సుమారు 2500 మంది ఉన్నారు.
ఈ ఊరి విశేషాలు :
- ఈ ఊరిలో చోళుల కాలంలో నిర్మితమైన కరిమాణిక్యస్వామి గుడి ఉంది.
- మే నెలలో ఈ గుడిలో 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
గ్రామాలుసవరించు
|
మూలాలుసవరించు
- ↑ టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ నా జీవిత యాత్ర పుట 7
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Naidupeta. |