నారాయణదత్ తివారీ

భారత రాజకీయవేత్త

నారాయణదత్ తివారీ (జ. అక్టోబర్ 18, 1925, మ. అక్టోబరు 18, 2018 ) భారత జాతీయ కాంగ్రేసు రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా, మూడు పర్యాయాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తివారీ 2007 ఆగష్టు 19న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆగష్టు 22 న గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.[1] డిసెంబరు 26, 2009న గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించాడు.

నారాయణదత్ తివారీ
నారాయణదత్ తివారీ


పదవీ కాలం
2007 - డిసెంబరు 26, 2009
ముందు రామేశ్వర్ ఠాకూర్
తరువాత ఈ.ఎస్.ఎల్.నరసింహన్

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి
పదవీ కాలం
1986-1987

పదవీ కాలం
1976 - 1977, 1984 - 1985, 1988 - 1989

పదవీ కాలం
2002–2007

వ్యక్తిగత వివరాలు

జననం (1925-10-18)1925 అక్టోబరు 18
బాలూటి గ్రామం, నైనిటాల్ జిల్లా
మరణం అక్టోబరు 18 2018
కొత్త ఢిల్లీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్
మతం హిందూ
November 07, 2008నాటికి

రాజకీయ జీవితం

మార్చు

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత పివి నరసింహారావుకు వ్యతిరేకంగా మరి ఆ తరువాత ఎన్.డి. తివారీ నాయకత్వంలో అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పేరుతో తిరుగుబాటు కాంగ్రెస్‌ స్థాపించబడింది.

పితృత్వ వివాదం

మార్చు

1967 నుండి 1980 మధ్య తివారీ పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నాడు. 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నతివారీ, 3 కృష్ణమెనన్ మార్గ్ లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. ఆ తరుణంలో షేర్ సింగ్ కూతురు ఉజ్జ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధము వారి కుమారుడు రోహిత్‌ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో 29 ఏళ్ళ వయసులో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానములో దావా వేశాడు. కోర్టు నోటీసుకు జవాబిస్తూ తివారీ తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించాడు, రోహిత్ కోరినట్టు డి.ఎన్.ఏ పరీక్షకు అంగీకరించలేదు.[2][3] 2008లో రోహిత్ శేఖర్ తనను కొడుకుగా గుర్తించాలని ఎన్డీ తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దావా వేశాడు. అయితే తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నాడు.

సెక్స్ కుంబకోణము

మార్చు

రాజ భవన్ లో తివారీపై సెక్స్‌ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకుని నివేదిక పంపవలసిందిగా ఐబీ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే - రాజీనామా చేయమనీ, కాదంటే భర్తరఫ్‌ చేయకతప్పదని ఢిల్లి పెద్దలు ఆదేశించడంతో తివారీ ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపారు. అయితే ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్‌ పదవికి రాజీనామా చేస్తున్నానని తివారీ ఆ లేఖలో పేర్కొనడం విశేషం.http://www.prabhanews.com/specialstory/article-61458

మూలాలు

మార్చు
  1. "Tiwari sworn in as Andhra Governor" Archived 2007-09-30 at the Wayback Machine, పి.టి.ఐ (ది హిందూ), ఆగష్టు 22, 2007.
  2. ఎన్‌.డి.తివారీ నా కన్నతండ్రి Archived 2008-10-16 at the Wayback Machine - ఈనాడు పత్రికలో వార్త అక్టోబర్ 16, 2008
  3. Paternity suit on ND Tiwari - ది టెలిగ్రాఫ్ (కోల్కతా) అక్టోబర్ 15, 2008