నారాయణ్ సరోవర్
?నారాయణ్ సరోవర్ గుజరాత్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 23°40′30″N 68°32′19″E / 23.675086°N 68.538627°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | కచ్ జిల్లా |
నారాయణ్ సరోవర్ ను నారాయణ్ సర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఉంది. ఇది హిందువుల తీర్థ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండి పురాతన కోటేశ్వర్ ఆలయం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]
చరిత్ర
మార్చుదీనిని 90 వ దశకంలో మహారావు దేశాల్ జి రాణి నిర్మించింది.[1][2]
ఆలయాలు
మార్చుపవిత్ర నారాయణ్ సరోవర్ ఒడ్డున ఆది నారాయణుడి పురాతన ఆలయం ఉంది. కోటేశ్వర్ శివాలయం నారాయణ్ సరోవర్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణ్ సరోవర్ దగ్గర త్రికం జీ, లక్ష్మీనారాయణ, గోవర్ధన్నాథ్ జి, ద్వారకానాథ్ జి, ఆది నారాయణ్, రాంచోద్రాయ్ జి, లక్ష్మి జి మొదలైన ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను కచ్ మహారాజు మూడవ దేశాల్జీ నిర్మించారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు దర్శనం కోసం ఇక్కడకు వస్తారు. చెరువులు, దేవాలయాలు, పురాతన వాస్తుశిల్పం, కళ-పనితనంతో ఇక్కడి ప్రదేశాలు నిండి ఉన్నాయి.[3] [2]
ప్రత్యేకత
మార్చుఈ సరస్సు పంచ సరోవర్ లలో ఒకటి. హిందూ వేదాంతశాస్త్రం ప్రకారం, మన్ సరోవర్, బిందు సరోవర్, నారాయణ్ సరోవర్, పంప సరోవర్, పుష్కర్ సరోవర్ అనేవి ఐదు పవిత్ర సరస్సులు. వీటిని అన్నింటినీ కలిపి పంచ్-సరోవర్ అని పిలుస్తారు. భారతదేశంలోని పవిత్ర నదులలో ఒకటైన సరస్వతి నది నారాయణ్ సరోవర్ సమీపంలో సముద్రంలో కలుస్తుంది. ఈ సరస్సు లోని నీరు సరస్వతి నది పవిత్ర నీటి తో నిండి ఉంటుంది. అందుకే ఈ ప్రదేశం ఇప్పటికీ హిందువుల ఐదు పవిత్ర సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది.[4]
ఉత్సవాలు
మార్చుచైత్ర మాసం (ఏప్రిల్-మే), కార్తీక మాసం (నవంబర్-డిసెంబర్) నెలల్లో సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ వివిధ ఉత్సవాలు నిర్వహిస్తారు. పశ్చిమ భారతదేశం నుండి, వేలాది మంది యాత్రికులు ఈ సరస్సు ఒడ్డున అంత్యక్రియల కార్యక్రమాలు చేయడానికి వస్తారు.[5]
చిత్రాలు
మార్చు-
నారాయణ్ సరోవర్ లోని ప్రధాన ఆలయం
-
నారాయణ్ సరోవర్ లోని ప్రధాన ఆలయం లోపలి దృశ్యం
-
నారాయణ్ సరోవర్ లోని విష్ణువు ఆలయం
-
Tనారాయణ్ సరోవర్ లోని ఆలయం
-
నారాయణ్ సరోవర్ లోని అతిథి గృహం, భోజనశాల
-
పూర్వపు ప్రవేశ ద్వారం
-
నారాయణ్ సరోవర్
-
నారాయణ్ సరోవర్ అభయారణ్యం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. pp. 245–248.
- ↑ 2.0 2.1 Shree Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory of our fore-fathers : Page :27 by Raja Pawan Jethwa. (2007) Calcutta.
- ↑ [1] Encyclopaedia of tourism resources in India, Volume 2 By Manohar Sajnani
- ↑ One outlet of the Saraswati into the sea was at Lokpat which was also a major seat of learning and a port. Further downstream was Narayan Sarovar which is mentioned in the Mahabharta as a holy place.
- ↑ Ward (1998-01-01). Gujarat–Daman–Diu: A Travel Guide. ISBN 9788125013839.