నారాయణ అండ్‌ కో 2023లో తెలుగులో విడుదలైన సినిమా. పాపిశెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌పై సుధాకర్‌ కోమాకుల పాపిశెట్టి బ్రదర్స్‌ నిర్మించిన ఈ సినిమాకు చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహించాడు.  సుధాకర్‌ కోమాకుల, పూజా కిరణ్‌, యామిని, జయ్‌కృష్ణ, ఆమనీ, దేవి ప్రసాద్, అలీరెజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 29న విడుదల చేయగా[2], సినిమా జూన్ 30న విడుదలైంది.[3]

నారాయణ & కో
దర్శకత్వంచిన్న పాపిశెట్టి
రచనరవి గోలి
నిర్మాతసుధాకర్‌ కోమాకుల, పాపిశెట్టి బ్రదర్స్‌
తారాగణంసుధాకర్‌ కోమాకుల, ఆమనీ, దేవి ప్రసాద్
ఛాయాగ్రహణంరాహుల్ శ్రీవాత్సవ్
కూర్పుసృజన అడుసుమిల్లి
సంగీతండా. జోశ్యభట్ల శర్మ, నాగ వంశీ & సురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
పాపిశెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్, సుఖ మీడియా
విడుదల తేదీs
2023 జూన్ 30 (2023-06-30)(థియేటర్)
2023 సెప్టెంబరు 5 (2023-09-05)(అమెజాన్ ప్రైమ్‌)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

కథ మార్చు

నారాయ‌ణ (దేవిప్ర‌సాద్)బ్యాంకులో క్యాషియ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌డి బ్యాంకులో దొంగ‌త‌నం జ‌రుగుతుంది. ఆ నేరం నారాయ‌ణ‌పై ప‌డ‌టంతో 25 ల‌క్ష‌లు క‌ట్టాల్సివ‌స్తుంది. నారాయ‌ణ‌ కొడుకు ఆనంద్ (సుధాకర్ కొమాకుల) క్రికెట్ బెట్టింగ్‌లో న‌ష్ట‌పోతాడు. ఆ డ‌బ్బు కోసం బెట్టింగ్ గ్యాంగ్ అత‌డి వెంట ప‌డుతోంటారు. త‌మ క‌ష్టాలు తీర‌డం కోసం ఓ రౌడీ ఇచ్చిన డీల్ కు నారాయ‌ణ ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. ఆ డీల్ ఏమిటి? ఈ క్ర‌మంలో నారాయ‌ణ, ఆనంద్‌తో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యులు ఈ సమస్యల నుండి బయటపడ్డారు అనేదే మిగతా సినిమా కథ.[5]

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: పాపిశెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్, సుఖ మీడియా
 • నిర్మాత: సుధాకర్‌ కోమాకుల, పాపిశెట్టి బ్రదర్స్‌
 • కథ: రవి గోలి
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిన్న పాపిశెట్టి
 • మాటలు : రాజీవ్ కొసనం
 • సంగీతం: డా. జోశ్యభట్ల శర్మ, నాగ వంశీ & సురేష్ బొబ్బిలి
 • సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
 • ఎడిటర్: సృజన అడుసుమిల్లి
 • పాటలు :పూర్ణ చారీ, కాసర్ల శ్యామ్

మూలాలు మార్చు

 1. Sakshi (5 September 2023). "ఓటీటీలోకి వచ్చేసిన 'నారాయణ అండ్‌ కో'". Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
 2. Namasthe Telangana (29 March 2023). "ఎంటర్‌టైనింగ్‌గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
 3. V6 Velugu (12 June 2023). "క్లీన్ కామెడీ..నారాయణ అండ్ కో". Archived from the original on 20 సెప్టెంబర్ 2023. Retrieved 20 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
 4. NTV Telugu (24 March 2023). "తిక్కల్ ఫ్యామిలీ మెంబర్ గా సుధాకర్ కోమాకుల!". Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
 5. Sakshi (30 June 2023). "'నారాయణ & కో' మూవీ రివ్యూ". Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.

బయటి లింకులు మార్చు