నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో 2012వ సంవత్సరం డిసెంబరు 27, 28, 29 తేదీలలో నిర్వహించారు. ఈ సభను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సభలను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీవేంకటేశ్వర ప్రాంగణములో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.యస్.ఎల్.నరసింహన్, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు కొన్ని ఉపవేదికలను ఏర్పటుచేసి తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రి చిరంజీవి అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా తమిళనాడు గవర్నరు కొణిజేటి రోశయ్య, ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‍రెడ్డి హాజరయ్యారు.[1][2][3]

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం
ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రధాన వేదికపై ప్రసంగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

ఇవి కూడా చూడండిసవరించు

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. ఎ, రామ్మోహన్ రావు (2013). "తెలుగు బాషకు కొత్త వెలుగు ! (వసంతం.నెట్ ద్వారా)". ఇండియా టూడే: 42–43. Retrieved 2014-03-21. Cite journal requires |journal= (help)[permanent dead link]
  2. ఎ, రామ్మోహన్ రావు. "ఆదర్శాల వేదిక… ఆచరణాత్మక గీతిక (వసంతం.నెట్ ద్వారా)". ఇండియా టూడే. Archived from the original on 2014-03-20. Retrieved 2014-03-21. Cite journal requires |journal= (help)
  3. "ప్రత్యేక వ్యాసాలు (వసంతం.నెట్ ద్వారా)". ఇండియా టూడే. Archived from the original on 2014-03-20. Retrieved 2014-03-21. Cite journal requires |journal= (help)