నాసిమ్-ఉల్-ఘని

పాకిస్తాన్ మాజీ క్రికెటర్

నాసిమ్-ఉల్-ఘని (జననం 1941, మే 14) పాకిస్తాన్ మాజీ క్రికెటర్.[1] 1958 - 1973 మధ్యకాలంలో 29 టెస్ట్ మ్యాచ్‌లు, ఒక వన్డే ఇంటర్నేషనల్‌లో ఆడాడు. తన అరంగేట్రం సమయంలో, 16 సంవత్సరాల వయస్సులో, అతను ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన టెస్ట్ ఆటగాడిగా ఉన్నాడు.[2]

నాసిమ్-ఉల్-ఘని
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1941-05-14)1941 మే 14
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 26)1958 జనవరి 17 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1973 జనవరి 6 - ఆస్ట్రేలియా తో
ఏకైక వన్‌డే (క్యాప్ 6)1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా
మ్యాచ్‌లు 29 1 117
చేసిన పరుగులు 747 1 4,490
బ్యాటింగు సగటు 16.60 1.00 28.41
100s/50s 1/2 0/0 7/23
అత్యధిక స్కోరు 101 1 139
వేసిన బంతులు 4,406 21,041
వికెట్లు 52 343
బౌలింగు సగటు 37.67 25.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 23
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 6/67 6/24
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 0/– 104/–
మూలం: Cricinfo, 2016 జూన్ 13

క్రికెట్ రంగం

మార్చు

1962లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై 101 పరుగులు చేసి సెంచరీ చేసిన మొదటి నైట్‌వాచ్‌మన్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో తన ఏకైక సెంచరీ ఇది. ఇంగ్లిండ్‌లో పాకిస్థానీ చేసిన మొదటి సెంచరీ కూడా.[2]

ఎడమచేతి బౌలర్ గా కూడా రాణించాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన వ్యక్తిగా నిలిచాడు. 1958లో వెస్టిండీస్‌పై 116 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నప్పుడు ఇతని వయస్సు 16 సంవత్సరాల 303 రోజులు.[3] 1969 నుండి 1978 వరకు స్టాఫోర్డ్‌షైర్ తరపున మైనర్ కౌంటీ క్రికెట్ ఆడాడు.

పదవీ విరమణ తర్వాత

మార్చు

జాతీయ సెలెక్టర్‌గా రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 9 వన్డేలలో ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు.

మూలాలు

మార్చు
  1. "Nasim-ul-Ghani Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
  2. 2.0 2.1 What a waste Espncricinfo. Retrieved 20 March 2011
  3. "Shane Watson ton puts Australia on top against Pakistan". BBC. 29 December 2009. Retrieved 4 November 2018.

బాహ్య లింకులు

మార్చు