నా ఆటోగ్రాఫ్

2004 సినిమా

నా ఆటోగ్రాఫ్ 2004 లో ఎస్. గోపాల రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇది ఓ తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. ఇందులో రవితేజ, భూమిక, గోపిక ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

నా ఆటోగ్రాఫ్
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్. గోపాల రెడ్డి
రచనఎస్. గోపాల రెడ్డి
నిర్మాతబెల్లంకొండ సురేష్
తారాగణంరవితేజ
భూమిక
గోపిక
మల్లిక
స్రవంతి
ప్రకాష్ రాజ్
సంగీతంఎం. ఎం. కీరవాణి
విడుదల తేదీ
2004 ఆగస్టు 11 (2004-08-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

కథానాయకుడు శీను (రవితేజ) తన పెళ్ళిపత్రికలు తీసుకుని హైదరాబాదు నుంచి కాకినాడకు బయలుదేరుతూ తన గురించి చెప్పడంతో కథ మొదలవుతుంది. శీను ఒక పోస్టు మాస్టరు (పరుచూరి వెంకటేశ్వరరావు) అబ్బాయి. బడికి వెళ్ళే సమయంలో విమల అనే అమ్మాయిని ఆరాధిస్తాడు. పదో తరగతి పూర్తి కాగానే విమల తండ్రి ఆమెకు పెళ్ళి చేసేస్తాడు. శీను డిగ్రీ చదువుకు వచ్చేసరికి తండ్రికి కేరళకు బదిలీ అవుతుంది. అక్కడ లతిక (గోపిక) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు.

తారాగణం మార్చు

పాటలు మార్చు

పాట పాడిన వారు రాసిన వారు
గుర్తుకొస్తున్నాయి కె. కె చంద్రబోస్
దువ్విన తలనే దువ్వడం కీరవాణి చంద్రబోస్
మన్మథుడే బ్రహ్మను పూని ఉదిత్ నారాయణ్ చంద్రబోస్
నువ్వంటే ప్రాణమనీ విజయ్ యేసుదాసు చంద్రబోస్
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది చిత్ర చంద్రబోస్
గామా గామ హంగామా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చంద్రబోస్

మూలాలు మార్చు

  1. జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో నా ఆటోగ్రాఫ్ సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Archived from the original on 6 జూలై 2017. Retrieved 21 August 2017.